మార్పునకు చదువే మూలం జిల్లా కలెక్టర్ డా.ఎం. హరి జవాహర్లాల్. ఘనంగా డా. అంబేద్కర్ జయంతి
ఉత్సవాలు విజయనగరం, ఏప్రిల్ 14 (prajaamaravathi): సమాజం లో నున్న ఆర్ధిక అసమానతలను రూపు మాపడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి చదువే మార్గమని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవాహర్లాల్ పేర్కొన్నారు. చదువు లేకపోవడం వల్లనే సమాజం లో వెనుకబాటుతనం వస్తుందని అన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్బంగా స్థానిక బాలాజీ కూడలి వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి బుధ వారం డా. హరి జవాహర్లాల్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు. అందుకోసం యువతకు చదువే ఏకైక లక్ష్యం కావాలన్నారు. విద్య తో వివేకం. సంస్కారం, సంపద, సమాజం లో గౌరవం లభిస్తాయని పేర్కొన్నారు. ఉన్నతంగా జీవించి తల్లి దండ్రులకు కూడా గౌరవం తీసుకురావాలని అన్నారు. కుల వివక్ష ను పోగొట్టి సమాజాన్ని అభివృద్ధి లో నడపడానికి విద్యే మూలమని అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత నిస్తోందని, చదువుకోవాలని ఆకాంక్ష ఉన్న వారికి అన్ని విధాలా ప్రోత్సాహం అందించడం జరిగుతోందన్నారు. కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభిత్వం అన్ని వసతులను కల్పించడం తో పాటూ ఆంగ్ల మాధ్యమం లో కూడా బోధన చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, జె వెంకట రావు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం. గణపతి రావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సునీల్ రాజ్ కుమార్, ఎస్.సి కార్పొరేషన్ ఈ.డి జగన్నాధ రావు, పలు శాఖల జిల్లా అధికారులు,అంబెడ్కర్ అభిమానులు పాల్గొన్నారు.
addComments
Post a Comment