ఉన్నత విద్య మెరుగైన సమాజానికి తొలిమెట్టు
*ఎంత పంచినా తరగని సంపద విద్య* *పార్వతీపురం శాసన సభ్యులు అలజంగి జోగారావు* పార్వతీపురం, ఏప్రిల్ 19 (prajaamaravathi):- ఉన్నత విద్య మెరుగైన సమాజానికి తొలిమెట్టు అని పార్వతీపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు పేర్కొన్నారు. పార్వతీపురం లో శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జగనన్న విద్య దీవెన కార్యకమనికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా ముఖ్య మంత్రి క్యాంపు కార్యాలయం నుండి నిర్వహించిన జగనన్న విద్యా దీవెన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆడిటోరియంలో పాల్గొన్న అతిథులు, విద్యార్థిని ,విద్యార్థులు, తల్లిదండ్రులు తిలకించారు. అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యం తో దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో ఎటువంటి బకాయిలు లేకుండా నాలుగు దశల్లో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చదువుతున్న పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తూ ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని అన్నారు. 2020-21 విద్యా సంవత్సరం మొదటి విడత కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో చేస్తున్న ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం అని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 57,238 మంది విద్యార్థులకు గాను29.22 కోట్లు నిధులు విడుదల చేశారని, అందునా పార్వతీపురం నియోజకవర్గం లో 3.31 కోట్లు విడుదల చేయగా 6161 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది అన్నారు. కాలేజీలలో చదువుకున్న ప్రతి విద్యార్థి విద్యార్థినులు ఉన్నతమైన చదువులు చదివి విద్యావంతులుగా ఎదగాలని, అలానే ప్రతి తల్లి వారి పిల్లల పట్ల శ్రద్ధ వహించి సన్మార్గంలో నడిచే విధంగా సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేస్తున్నారని ప్రతి సంక్షేమ పథకం మహిళల పేరునా అంద చేస్తున్నారని, అమ్మ ఒడి గాని, ఇళ్ల పట్టాలు గానీ, సున్న వడ్డీలు గాని, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రినే అని తెలిపారు. ప్రతి తల్లి తమ పిల్లలు ఏ కళాశాలలో చదువుతున్నారు ఆ కళాశాలకు వెళ్లి ఆ కళాశాల యొక్క స్థితిగతులు పిల్లల బాగోగుల పై తల్లిదండ్రుల పర్యవేక్షణ చేయాలని, కుటుంబ ఉన్నా అర్హులైన పిల్లలందరికీ ఉన్నత విద్యాచదివే అవకాశం కలిగిస్తుందని వ్యక్తం చేశారు. అనంతరం పార్వతీపురం నియోజకవర్గం కి సంబంధించిన 6161 మంది విద్యార్థులకు సంబంధించిన 3.31 కోట్ల చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి, సబ్ కలెక్టర్ విదెహ ఖరె మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఉన్నత విద్యను అభ్యసంచాలని హితవు పలికారు. ప్రస్తుతం మన ప్రభుత్వం విద్యకు ఆధిక ప్రాధాన్యతనిస్తుంది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియో గించుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. అలాగే ప్రస్తుతం గౌరవ ముఖ్య మంత్రి విద్యకు ఎక్కువ గా ఆసక్తి చూపుతున్నారని, ఉన్నత మైన విద్యను అందించడమే లక్ష్యంగా పలు పథకాలు అమలు చేశారని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియో గించుకోని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. *1) నిత్య ప్రసన్న, మొదటి సంవత్సరం బి. కామ్* కార్యక్రమము నిత్య ప్రసన్న మొదటి సంవత్సరం బి. కామ్ విద్యార్థిని మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమ్మవడి,విద్యా దీవెన, విద్యా వసతి, విద్యా కానుక వంటి పథకాలు అందజేయడం వలన చాలా మంది పేద కుటుంబాల పిల్లలు చదువుకొని మంచి ఉన్నత స్థాయిని అందిపుచుకోవడనికి మంచి అవకాశం కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. *2) నిమ్మక కిరణ్ డిగ్రీ విద్యార్థి* నేను చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి చదువుకుంటూ న్నానని నిరుపేద కుటుంబానికి చెందిన వాడనని జగనన్న చదువు నిమిత్తం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తద్వారా నిరుపేద కుటుంబాల పిల్లల చదువు మంచి అవకాశం దొరకడం ప్రతి ఒక్కరి అదృష్టం అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బొంగు గౌరీశ్వరి, వైస్ చైర్ పర్సన్ కొండపల్లి రుక్మిణీ, మున్సిపల్ కమిషనర్ కె కనక మహాలక్ష్మి, మూడు మండలాల తహసీల్దార్లు, ఎం.పి.డి.ఓ లు, ఎం. ఈ. ఓ లు విద్యార్థిని, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment