తిరుపతి (prajaamaravathi); తిరుపతిలోపి పీఎల్‌ఆర్ కన్వెన్షన్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్: తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నాం మా అభ్యర్థి గెలిస్తే.. టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలి టీడీపీ అభ్యర్థి గెలిస్తే.. మా పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారు ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా? సూటిగా ప్రశ్నించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ, బీజేపీ, పవన్ లోపాయికారి ఒప్పందంతో పని చేస్తున్నారు ప్రత్యేక హోదాను ఇవ్వలేని బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతోంది? ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు ఆనాడు పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు పవన్‌కు తాజాగా కనిపిస్తున్నాయా? పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్ కోవిడ్ వల్లే సీఎం బహిరంగ సభను రద్దు చేసుకున్నారు ప్రభుత్వం చేస్తున్న మేలును లేఖ ద్వారా సీఎం వివరిస్తున్నారు ప్రెస్‌మీట్‌లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టీకరణ తిరుపతి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్: – తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. మేం చాలా ధైర్యంగా ప్రజల ముందుకు పోయి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని అడుగుతున్నాం. ఈ 22 నెలల్లో సీఎం గారు చేసిన ప్రజాహిత కార్యక్రమాలే మా ఆయుధాలు. ఈ నియోజకవర్గంలో మేం చేసిన అభివృద్ధి ఇదీ అంటూ సీఎం గారు ప్రజలకు లేఖ రాశారు. – ఈనెల 14న తిరుపతిలో నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచార బహిరంగ సభను కరోనా కారణంగా నిపుణుల సలహాలు తీసుకున్న తరువాతే సీఎం గారు రద్దు చేసుకున్నారు. ఏ కుటుంబానికి కోవిడ్ వల్ల ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో బహిరంగ సభను రద్దు చేసుకున్నట్లు సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రకటించారు. బాధ్యత కలిగిన సీఎంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. – తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి గెలిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని చంద్రబాబు, అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నాం. తిరుపతి ఉపఎన్నికను రెఫరండంగా తీసుకుంటున్నాం. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిస్తే.. మా పార్టీకి చెందిన 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారు. మరి మా పార్టీ అభ్యర్థి గెలిస్తే.. టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసి.. చంద్రబాబు అనుంగు అనుచరుడు రఘురామకృష్ణంరాజుతో కూడా రాజీనామా చేయిస్తారా?. అని చంద్రబాబును సవాల్ చేస్తున్నాం. – రాత్రి సమయాల్లో విగ్రహాలను పగలకొట్టడం, పగటి పూట ఆ విగ్రహాలను సందర్శించి ఏడవడం తెలుగుదేశం నాయకులకు అలవాటుగా మారింది. అచ్చెన్నాయుడి అనుచరులు శ్రీకాకుళంలో ఏ విధంగా విగ్రహాలను రోడ్డు మీద పడేశారో ప్రజలు గమనించారు. ఆ ఘాతుకానికి సంబంధించిన సీసీ ఫుటేజీని అధికారులు బయట పెట్టారు. ఈ రాష్ట్రంలో మతపరమైన ఘర్షణలు చెలరేగేలా చేసి తమ ఉనికిని కాపాడుకోవడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. ఆ దిశలోనే సీఎం శ్రీ వైయస్ జగన్‌పైనా మతపరమైన బురద చల్లేందుకు కుట్ర చేస్తోంది. – బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఒకే వేదిక మీద మోదీతో కలిసి ప్రత్యేక హోదా గురించి గతంలో ఏం మాట్లాడారు? ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా ఏమైంది?. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని మీరు తిరుపతి ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అడుగుతారు? పవన్ కళ్యాణ్ పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్. 2019 ఎన్నికల ముందు ఆయన బీజేపీ గురించి ఏమన్నారు. ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ పేరుతో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని విమర్శించారు. ఇప్పుడు అవే పాచిపోయిన లడ్డూలు పవన్ కళ్యాణ్ కు తాజాగా కనిపిస్తున్నాయా? పవన్, టీడీపీ, బీజేపీ ఒకే పంథాలో లోపాయికారీ ఒప్పందంతో ఈ ఎన్నికల్లో పని చేస్తున్నారు. – మన రాష్ట్రానికి బీజేపీ చేసిన మంచి ఏమిటి? గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇచ్చారా? విభజన చట్టంలోని అంశాలను అమలు చేశారా? ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారు? ఇక రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ సునిల్ దేవధర్ ఒక డ్రామా ఆర్టిస్ట్. పవన్ కళ్యాణ్ సినిమా స్పెషల్ షో లేని చోట వీడియోలు తీయించుకుని, ఈ ప్రభుత్వం పవన్‌కు అన్యాయం చేస్తోందని గగ్గోలు పెట్టారు. సునిల్ దేవ«ధర్ ఎంతగా దిగజారిపోయి మాట్లాడుతున్నాడో ప్రజలు గమనిస్తున్నారు. మా పార్టీ అభ్యర్థి కుటుంబ నేపథ్యం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. – కేంద్రం ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినా దానిని ప్రశ్నించే సమయం చంద్రబాబుకు లేదు. రాష్ట్ర ప్రయోజనాల పైన ఏనాడైనా చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశాడా? దేనిపైనా మాట్లాడకుండా మౌనంగా వుంటాడు. తాను అధికారంలో వున్నప్పుడు ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టాడు. ప్రత్యేక ప్యాకేజీ బాగుందని అన్నాడు. ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఏం వచ్చిందో చెప్పే ధైర్యం చంద్రబాబుకు వుందా? అప్పుడు హోదా అవసరం లేదని అన్నాడు. ఇప్పుడు ప్రత్యేకహోదా సాధిస్తానని హామీలు ఇస్తున్నాడు. చంద్రబాబును ప్రజలు ఎందుకు నమ్మాలి? – 2014, 2019లో మేం ఒంటరిగా పోటీ చేశాం. టీడీపీ మాదిరిగా పవన్, బీజేపీతో కలిసి పోటీ చేయలేదు. ఆనాడు ఎన్నికల ముందు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చాడు. ఈ రోజు పూర్తిగా బీజేపీతో కలిసి లోపాయికారిగా టీడీపీ కోసం పని చేస్తున్నారు. ఒంటరిగా పోటీ చేసే సంస్కృతి అటు చంద్రబాబుకు, ఇటు పవన్‌కళ్యాణ్‌కు లేదు. – ఈ రోజు ప్రత్యేకహోదా గురించి మా ఎంపీలు మాట్లాడటం లేదని విమర్శిస్తున్నారు. 2019 ఎన్నికల్లో బిజెపికి చాలా ఎక్కువ మెజారిటీ వచ్చింది. వారికి ఎవరితోనూ అవసరం లేదు. అయినా కూడా మా ఎంపీలు ప్రత్యేకహోదా గురించి పార్లమెంటులో ఎన్నిసార్లు కేంద్రాన్ని నిలదీశారు?. ఎన్నిసార్లు ప్రశ్నించారో చంద్రబాబుకు తెలియదా? – మేం ధైర్యంగా ప్రజలను ఓట్లు అడుగుతున్నాం. రాష్ట్రంలో అర కోటికి పైగా రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.13,500 చొప్పున రైతు భరోసాను అందిస్తున్నాం. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఆర్బీకేలను ఏర్పాటు చేసి రైతులకు నాణ్యతమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందిస్తున్నాం. రైతుల ముంగిటకే వెళ్ళి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం. మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటున్నాం. లక్షలాది తల్లులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నాం. 61 లక్షలకు పైగా పెన్షన్లను ప్రతినెలా ఒకటో తేదీనే వారి ఇంటికి వెళ్ళి మరీ అందిస్తున్నాం. కార్పోరేట్ పాఠశాలల మాదిరిగా ప్రభుత్వ స్కూళ్ళను ఆధునీకరించి, ఇంగ్లీష్ మీడియంలో బోధన అందిస్తున్నాం. నాడునేడు తో పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మారుస్తున్నాం. ఆరోగ్యశ్రీ, 108, 104, మహిళలకు చేయూత, ఆసరా వంటి పథకాలతో ఆర్థిక స్వావలంబన కలిగిస్తున్నాం. సీఎం శ్రీ వైయస్ జగన్ విప్లవాత్మక ఆలోచనల నుంచి గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ పుట్టింది. వాటి ద్వారా ప్రజల ముందుకే పాలనను తీసుకువెళ్ళాం. అందుకే ధైర్యంగా మా పాలన చూసి మాకు ఓట్లు వేయాలని అడుగుతున్నాం. – రాయలసీమలోని తాగు, సాగునీటి అవసరాలను గుర్తించి ప్రాజెక్టుల నిర్మాణాన్ని సీఎం శ్రీ వైయస్ జగన్ యుద్దప్రాతిపదికన చేపట్టారు. కరువు పీడిత ప్రాంతాల్లో డ్రౌట్ మిటిగేషన్ కింద వేల కోట్లతో ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంట్లో మంచినీటి కుళాయి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ సీఎం శ్రీ వైయస్ జగన్ పాలనను ముందుకు తీసుకుపోతున్నారు. – తిరుపతి నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల కోసం నిత్యం తపిస్తున్న సీఎం శ్రీ వైయస్ జగన్ రుణం తీర్చుకునేందుకు ఇది ఒక అవకాశం. ఈ ఎన్నికల్లో ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సీఎంకు మద్దతుగా వైయస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. – చంద్రబాబు, బిజెపి, పవన్ అవకాశవాదంతో పని చేస్తున్నారు. రానున్న 2024 ఎన్నికల్లో ఈ ముగ్గురూ కలిసే పోటీ చేస్తారు. మాలాగా ఒంటరిగా పోటీ చేసే ధైర్యం వారికి లేదు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు. ఎక్కడో పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోతే, జాతీయ పార్టీకి అధ్యక్షుడిని అని చెప్పుకునే చంద్రబాబు దానిని ఒక దేశ సమస్యగా తీసుకుని మాట్లాడుతున్నాడు. – వృథ్ధాప్యంలో కూడా వచ్చి ప్రజలను ఓట్లు అడుగుతున్న చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నాడు. అసలు చంద్రబాబును ఎన్నికల ప్రచారానికి ఎవరు రమ్మన్నారు? ఇన్ని రోజులు హైదరాబాద్‌లో వున్నాడు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు కూడా హైదరాబాద్‌లో వుండి ముఖం చాటేశాడు. ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల సమయంలో కూడా ఆయన హైదరాబాద్‌లోనే వుంటాడు. ఇక ఆయన కుమారుడు లోకేష్ తెలిసీ తెలియని ఒక అజ్ఞాని. లోకేష్ గురించి మాట్లాడటం కూడా దండగే.
తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నాం మా అభ్యర్థి గెలిస్తే.. టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలి
addComments
Post a Comment