తిరుపతిలో బంది'ఓటు' దొంగలు పడ్డారు... పురందేశ్వరి వ్యంగ్యం*

 *తిరుపతిలో బంది'ఓటు' దొంగలు పడ్డారు... పురందేశ్వరి వ్యంగ్యం* తిరుపతి (prajaamaravathi);


లో ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్ భారీగా దొంగ ఓట్లు పడ్డాయంటూ విపక్షాల ధ్వజం ఓట్ల దోపిడీకి పాల్పడ్డారన్న పురందేశ్వరి *ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని వెల్లడి* నిన్న జరిగిన తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక పోలింగ్ లో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు పడ్డాయని విపక్షాలు ఇప్పటికీ గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. తిరుపతిపై బందిపోటు దొంగలు దాడి చేశారని వ్యంగ్యం ప్రదర్శించారు. "వాళ్లు ఇళ్లలోని వస్తువులు ఎత్తుకెళ్లే దొంగలు కాదు, మన ఓట్లను దోపిడీ చేసే దొంగలు వాళ్లు. ఈ దొంగ ఓట్ల దందా మీడియా ముందు బట్టబయలు చేసినా, ఇదో కుట్ర అంటూ అధికార పార్టీ కొట్టిపారేస్తోంది. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది" అని పురందేశ్వరి పేర్కొన్నారు. కాగా, తిరుపతి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు వచ్చే నెల 2న చేపట్టనున్నారు.