తిరుపతి ఉప ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోనివ్వద్దు.. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ ఆదేశం

 తిరుపతి ఉప ఎన్నికల్లో

అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోనివ్వద్దు..

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ ఆదేశం 

సచివాలయం, ఏప్రిల్ 17 (ప్రజా అమరావతి) : తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చిత్తూరు, నెల్లూరు జిల్లాల అధికారులను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ ఆదేశించారు. ఈ మేరకు ఆయనొక ప్రకటన విడుదల చేశారు. వివిధ ప్రసార మాధ్యమాల్లో నకిలో ఓట్లు పోలవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పటిష్ట బందోబస్తు నడుమ ఉప ఎన్నిక నిర్వహించాలని ఆదేశాంచారు. నకిలీ ఓట్లు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ఆదేశించినట్లు ఆ ప్రకటనలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ తెలిపారు. 


Comments