పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (పాడా)పై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష.

 అమరావతి (prajaamaravathi);  పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (పాడా)పై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష.


పాడా సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..: – కడప జిల్లాలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదించిన పనులు త్వరితగతిన ప్రారంభించాలన్న సీఎం. – ఎర్రబల్లి ఎత్తిపోతల పథకం, గాలేరు నగరి నుంచి హంద్రీనీవా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం పనులను వేగవంతం చేయాలన్న సీఎం – గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, గండికోట–పైడిపాలెం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంల పనులను త్వరిత గతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన సీఎం. – ఆయా ప్రాజెక్ట్‌లకు సంబంధించిన టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తి అయిన నేపథ్యంలో వాటిని 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్న సీఎం. – పీబీసీ, సీబీఆర్, జికెఎల్‌ఐ కింద సూక్ష్మ నీటిపారుదల పథకాల పనులు కూడా త్వరగా ప్రారంభించాలన్న సీఎం. – పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో ఇప్పటికే శిలా ఫలకాలు ఆవిష్కరించిన పలు అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశం – ముద్దనూరు నుంచి కోడికొండ చెక్‌పోస్ట్‌ వరకు జరిగే రోడ్డు ఆధునీకరణ పనులను జాతీయ రహదారి ప్రాజెక్ట్‌ కింద చేపట్టేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్దం చేయాలని సీఎం ఆదేశం. – వేంపల్లి భూగర్భ డ్రైనేజీ పనుల కోసం రూ.92 కోట్లు వెంటనే నిధులను మంజూరు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించిన సీఎం. – పులివెందుల మెడికల్‌ కాలేజీ నిర్మాణం కోసం చేసిన భూసేకరణకు డబ్బు చెల్లించడం జరిగిందని, కాలేజీ పనులు త్వరగా మొదలు పెట్టాలన్న సీఎం – ఈ వారంలో కాలేజీ నిర్మాణంకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించాలన్న సీఎం. – వేంపల్లి, పులివెందుల్లో ఒక్కోటి కోటి రూపాయల వ్యయంతో మోడల్‌ రైతుబజార్లను మంజూరు చేసిన సీఎం. – ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌కు అప్పగించేందుకు పులివెందుల క్రికెట్‌ స్టేడియంకు 14 ఎకరాల భూమిని పులివెందుల్లోనే కేటాయించమని అధికారులకు ఆదేశం. – పులివెందుల మోడల్‌ టౌన్‌కు సంబంధించి అన్ని టెండర్లు ఈ నెల 25వ తేదీ లోగా పిలిచి, టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు పనులు కూడా ప్రారంభించాలన్న సీఎం. – 2019, 2020ల్లో మైదుకూరు, రాయచోటి, కడప, పులివెందుల పర్యటనలో భాగంగా జిల్లాలో చేసిన శంకుస్థాపనలు, వాటికి సంబంధించిన పనుల ప్రగతిని సమీక్షించిన సీఎం. – ఆయా పనులు అనుకున్న సమయం నాటికి పూర్తి చేయాలని ఆదేశం. – జమ్మలమడుగు స్టీల్‌ ప్లాంట్‌ భూసేకరణ పనులను పూర్తి చేయాలని సీఎం ఆదేశం. – బద్వేల్, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు సంబంధించిన అవసరమైన అభివృద్ధి పనులను సమీక్షించిన సీఎం. – బద్వేల్‌ మున్సిపాలిటీలో రోడ్ల అభివృద్ది పనులు, దిగువ సకిలేరు ప్రాజెక్ట్‌ విస్తరణ పనులు, బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ డయాఫ్రం పనులు, పోరుమామిళ్ళ పట్టణంలో రోడ్డు విస్తరణ, సకిలేరు మీద అట్లూరు, కలసపాడు మండలాల్లో రెండు వంతెనలు, బద్వేలు నియోజకవర్గంలో మూడు మార్కెటింగ్‌ గిడ్డంగులు పనుల ఆవశ్యతను సీఎంకు వివరించిన అధికారులు. – వీటన్నింటికి త్వరితగతిన పరిపాలనా అనుమతులు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు సీఎం ఆదేశాలు. – అలాగే ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి తాగునీరు, డ్రైనేజీ పనులపై సీఎంకు వివరించిన అధికారులు. ఆయా పనులకు వెంటనే ఆర్థిక అనుమతులు ఇవ్వాలని ఫైనాన్స్‌ అధికారులను ఆదేశించిన సీఎం. – పెన్నా నదిపై ఆర్టీపిపి, కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టీల్‌ప్లాంట్‌కు వెళ్ళేందుకు రహదారి, హైలెవల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణంకు సీఎం ఆదేశం. – ఎప్పటి నుంచో ఆగిపోయిన వైయస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ కొత్త భవనాలకు రూ.66 కోట్లు మంజూరు ఇవ్వమని ఫైనాన్స్‌ అధికారులకు సీఎం ఆదేశం. – కడప ఎయిర్‌పోర్ట్‌లో విమానాల నైట్‌ ల్యాండింగ్‌ కోసం భూసేకరణకు సంబంధించి డబ్బులు చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులకు సీఎం ఆదేశం. – కడపలో రోడ్ల విస్తరణ సందర్భంగా భూసేకరణకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని, కడప నగరంలో బుగ్గవంక వరద నుంచి రక్షణ కోసం రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంకు సీఎం ఆదేశాలు. కడప ఎంపి వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఉన్నత విద్య స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వి.ఉషారాణి, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జి.జయలక్ష్మి, ట్రాన్స్‌పోర్ట్, ఆర్‌అండ్‌బి ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటి కృష్ణబాబు, మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వై.మధుసూధన్‌ రెడ్డి, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామ్‌గోపాల్, ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, పిఆర్‌ కమిషనర్‌ గిరిజాశంకర్, కడప కలెక్టర్‌ హరికిరణ్, పాడా స్పెషల్‌ ఆఫీసర్‌ అనిల్‌కుమార్‌ రెడ్డి తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

Comments