రియల్ టైమ్ గవర్నెన్స్ ను సందర్శించిన నేషనల్ డిఫెన్స్ కలశాల బృందం
అమరావతి,8ఏప్రిల్ (prajaamaravathi):న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్సు కళాశాల ఫ్యాకల్టీ ఇన్చార్జి మేజర్ జనరల్ మనోజ్ కుమార్(సేవా మెడల్)నేతృత్వంలోని 19 మంది బృందం గురువారం అమరావతి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజిఎస్)ను సందర్శించి ఆకేంద్రం పనిచేస్తున్న తీరును పరిశీలించింది.ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ఆర్టీజిఎస్ ఏవిధంగా పనిచేస్తుంది వారికి వివరించారు.ముఖ్యంగా తుఫానులు,వరదలు తదితర విపత్తుల సమయంలో ఏవిధంగా ప్రజలను అప్రమత్తం చేస్తుంది వివరించారు.అలాగే ప్రజా సమస్యలను స్పందన ఫిర్యాదులు పరిష్కారం విధానంలో ఏవిధంగా పరిష్కరిస్తుంది వివరించారు.ప్రభుత్వం అమలు చేస్తున్నవివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలకు లబ్దిదారులను ఏవిధంగా ఎంపిక చేస్తుంది తెలిపారు. ఆర్టీజిఎస్ సిఇఓ జె.విద్యాసాగర్ ఆర్టీజిఎస్ పనితీరును వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గల 14,700 సిసిటివి కెమెరాలను ఈఆర్టీజిఎస్ కమాండ్ కేంద్రంతో అనుసంధానించడం జరిగిందని వివరించారు.ముఖ్యంగా తుఫానులు,వరదలు,వడగాల్పులు వంటి సమయాల్లో ప్రజలను ముందుగా ఎస్ఎంఎస్ లు ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగు తుందని తెలిపారు.అలాగే డేటా ఎనలటిక్స్ ఈకేంద్రం ప్రధాన విధని పేర్కొన్నారు.మూడు షిప్టుల్లో పనిచేసే కాల్ సెంటర్ ఇక్కడ పనిచేస్తోందని బృందానికి వివరించారు.గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా సుమారు 500 వరకూ పౌర సేవలను ప్రజలకు అందించడం జరుగుతోందని ఆయా సేవలను నిరంతరం మానిటర్ చేసేందుకు ఈకేంద్రం కృషి చేస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో నేషనల్ డిఫెన్స కళాశాల టూర్ కోఆర్డినేటర్ అమన్ దీప్ చత్తా(Aman Deep Chatha)బ్రిగేడియర్లు గగన్ దీప్,ఆశిశ్ భరద్వాజ్,నవరాజ్ ధిల్లాన్,రవరూప్ సింగ్,జెపిసి పెర్రిస్,ఎఎ సాధే,సమీర్ శ్రీవాస్తవ,కెఎస్ గ్రేవాల్,ఇండియన్ కోస్టుగార్డు డిఐజి అనురాగ్ కౌసిక్, ఎయిర్ కమడోర్లు వికాస్ ద్వివేది,వికాస్ శర్మ ఇంకా నేపాల్,కజకిస్తాన్,బంగ్లాదేశ్ లకు చెందిన ఆర్మీ,ఎయిర్ ఫోర్సు,నేవీ ప్రతినిధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment