అసమానతలు, సాంఘిక దూరాచారలను రూపుమాపి దళితుల బంగారు భవిష్యత్తు కు పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి 

 ఏలూరు, ఏప్రిల్ 14 (prajaamaravathi),   అసమానతలు, సాంఘిక దూరాచారలను రూపుమాపి దళితుల బంగారు భవిష్యత్తు కు పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి


భారత రత్న బాబా సాహెబ్ డా. బి ఆర్ అంబేద్కర్ అని ఇంచార్జి కలెక్టర్ శ్రీ హిమాన్సు శుక్లా కొనియాడారు. బుధవారం డా బి ఆర్ అంబేద్కర్ 130 జయంతి సందర్భంగా ఏలూరు కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంచార్జి కలెక్టర్ శ్రీ హిమాన్సు శుక్లా, జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ ) శ్రీ కె వెంకట రమణా రెడ్డి, జాయింట్ కలెక్టర్ ( వెల్ఫేర్) శ్రీ నంబూరి తేజ్ భరత్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ శ్రీ హిమాన్సు శుక్లా మాట్లాడుతూ డా బి ఆర్ అంబేద్కర్ విద్య కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. విద్య ఉంటే ఏదైనా సాదించవచ్చునని , విద్య విలువ పూర్తిగా తెలిసిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. ప్రతీ ఒక్కరూ కుల మతాలకు అతీతంగా, ఎటువంటి వివక్షకు తావులేకుండా, సమానత్వం తో మంచి విధానాలతో జీవించాలని కోరుకున్న వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అందుకే దేశం గర్వించదగ్గ మహా వ్యక్తిగా ఎదిగారన్నారు . నేడు ప్రపంచ మేధావిగా దేశాలన్నీ డా అంబేద్కర్ ను ఎంతో కొనియాడుతున్నాయని చెప్పారు. రాజ్యాంగం రచించి మనకు అందించడం ద్వారా దేశం సుస్థిరంగా, సుభిక్షంగా ఉండేందుకు బాటలు వేశారన్నారు. అంబేద్కర్ జీవితాన్ని ప్రతీ ఒక్కరూ చదవాలని, అర్థం చేసుకోవాలన్నారు. వారు చూపిన బాటలో నడిచి జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్నారు. మనం ఎంతకాలం జీవించామన్నదికాదు, చరిత్రలో నిలిచిపోయేలా ఎంతగొప్ప వ్యక్తులుగా జీవించామన్నదే ముఖ్యమని చెప్పారు. అంబేద్కర్ సూచించిన విధంగా ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడని, మరో వెయ్యేళ్లు కూడా అంబేద్కర్ అందరి హృదయాల్లో నిలిచి ఉంటారని ఇంచార్జి కలెక్టర్ శ్రీ హిమాన్సు శుక్లా చెప్పారు. జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ ) శ్రీ కె వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ జీవితాన్ని స్పూర్తి గా తీసుకుని విద్యార్ధిని, విద్యార్థులు ముందుకు వెళ్లాలన్నారు. మహనీయుని కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జాయింట్ కలెక్టర్( వెల్ఫేర్)శ్రీ నంబూరి తేజ్ భరత్ మాట్లాడుతూ పేదరికం లో పుట్టి ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని దేశాన్ని దిశా నిర్దేశం చేసే స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి డా అంబేద్కర్ అని కొనియాడారు. దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తో అంబేద్కర్ జయంతి కి అత్యంత ప్రాముఖ్యత నిచ్చి ఘనంగా ఉత్సవాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతీ ఒక్కరూ సంపూర్ణంగా ఆచరణలోకి తీసుకుని రావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి , పూలుజల్లి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జె డి శ్రీ ఎస్ మధుసూదనరావు, జెడ్పీ సిఇఓ శ్రీ పి శ్రీనివాసులు, అడిషనల్ ఎస్ పి శ్రీ సుబ్బరాజు, డిపిఓ శ్రీ రమేష్ బాబు, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి పద్మావతి, సెట్వెల్ మేనేజర్ శ్రీ కె సూర్య ప్రభాకర రావు, డిసిహెచ్ఎస్ డా ఏ వి ఆర్ మోహనరావు, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు శ్రీ మేతర అజయ్ బాబు, శ్రీ పొలిమేర హరికృష్ణ, శ్రీ ఎం సంతోష్ కుమార్ , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

Comments