సంతాపం మాజీ మంత్రి మహ్మద్ జానీ మృతికి గుంటూరు(prajaamaravati);
నగరపాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర నాయుడు గారు విచారం వ్యక్తం చేశారు. ఆదివారం అనందపేట లోని జానీ గారి నివాసంలో ఆయన పార్దివ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా, మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ప్రజలకు సేవలందించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (శ్రీ కావటి శివ నాగ మనోహర నాయుడు, మేయర్, గుంటూరు నగరపాలక సంస్థ)
addComments
Post a Comment