జిల్లా అంతటా 144 సెక్షన్
ఉదయం 6 నుంచి 12 వరకూ కర్ఫ్యూ సడలింపు
కర్ఫ్యూలో అత్యవసర సేవలకు మినహాయింపు
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్
విజయనగరం, మే 05 (ప్రజా అమరావతి) ః జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉందని, ఈ మేరకు పోలీసు అధికారులకు, మండల మేజిస్ట్రేట్‌లకు ఉత్తర్వులు పంపించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఉదయం 6 నుంచి 12 గంటలు వరకూ కర్ఫ్యూ సడలింపు ఉన్నప్పటికీ, ప్రజలు ఒకేచోట గుంపులుగా చేరకూడదని స్పష్టం చేశారు. విధిగా ప్రతీఒక్కరూ మాస్కులను ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ, తమ పనులు చేసుకోవాలని సూచించారు. కొనుగోలు, విక్రయాల్లో కూడా తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. తరచూ చేతులను శానిటైజ్ చేసుకోవాలన్నారు.
అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సంస్థలు, మద్యం షాపులు మధ్యాహ్నం 12 గంటలకల్లా మూసివేయాలని స్పష్టం చేశారు. కర్ఫ్యూ సమయంలో ఆసుపత్రులు, మందుల షాపులు, ఇతర అత్యవసర సేవలకు మినహాయింపు నిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ పనులు, ఉపాధి పన
addComments
Post a Comment