ఈ ఏడాది రాష్ట్రానికి కేంద్రం 20 కోట్ల పనిదినాలను కేటాయించింది


అమరావతి (ప్రజా అమరావతి);


ఉపాధిహామీ, ఇసుక పాలసీ, వైయస్‌ఆర్‌ జలకళ, వైయస్‌ఆర్ జల్‌జీవన్‌ మిషన్‌పై జిల్లాల జెసిలు, డిఆర్‌డిఎ పిడిలు, మైనింగ్, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్‌


- వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్‌ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, మైన్స్‌ అండ్ జియాలజీ డైరెక్టర్ (డిఎంజి) విజి వెంకటరెడ్డి, నరేగా డైరెక్టర్ చిన్నతాతయ్య, వాటర్‌షెడ్ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇఎన్‌సి కృష్ణారెడ్డి, పిఆర్ చీఫ్‌ ఇంజనీర్ రఘుబాబు తదితరులు.


వీడియో కాన్ఫెరెన్స్‌లో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ....


- ఈ ఏడాది రాష్ట్రానికి కేంద్రం 20 కోట్ల పనిదినాలను కేటాయించింది.

- దానిని అధిగమించి రాష్ట్రంలోని గ్రామీణ పేదలకు ఉపాధిని కల్పించాలనే లక్ష్యంతో పనిచేయాలి.

-  జూన్ 21 నాటికి ప్రతి జిల్లాలోనూ కోటి పనిదినాలు కల్పించాలని అధికారులకు ఆదేశం.

- నేటి వరకు (13.5.2021) వేతనాల కింద ఉపాధి కూలీలకు చెల్లించినది రూ. 4900 కోట్లు 

- నేటి వరకు మెటీరియల్ కాంపోనెంట్ కింద చేసిన వ్యయం రూ.3268 కోట్లు

- మే నెలాఖరు నాటికి 1046 లక్షల పనిదినాలు పూర్తి చేయాలని లక్ష్యంను సాధించేందుకు ప్రణాళికాయుతంగా పని చేయాలి.

- నేటి వరకు పూర్తి చేసిన పనిదినాలు 518 లక్షలు

- ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గ్రామీణ కూలీలకు ఉపాధి పనులు కల్పించాలి

- పనులు లేక ఏ ఒక్కరూ పస్తులు ఉండాల్సిన పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

- నిన్న (12.5.2021) ఒక్కరోజే 29.52 లక్షల మంది కూలీలకు పనులు కల్పించారు.

- ఇదే స్పూర్తితో ఉపాధి హామీని సద్వినియోగం చేసుకోవాలి.

- ఈ ఏడాది మొత్తం 27 కోట్ల పనిదినాలను సాధించాలనే లక్ష్యంతో జిల్లాల్లో పనిచేయాలి.

- జిల్లా జాయింట్ కలెక్టర్లు (డెవలప్‌మెంట్), డిఆర్‌డిఎ పిడిలు, నరేగా సిబ్బంది దీనికి బాధ్యత వహించాలి.

- ఇప్పటి వరకు (13.5.2021) ఉపాధి హామీ కూలీలకు వేతనాలుగా చెల్లించింది రూ.1132.53 కోట్లు.

- మెటీరియల్ కాంపోనెంట్ కింద ఖర్చు చేసింది రూ.636.50 కోట్లు

- ఉపాధి హామీ కింద రాష్ట్ర వ్యాప్తంగా 10,929 గ్రామసచివాలయ భవనాల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

- రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నిర్మాణం పూర్తియిన గ్రామసచివాలయాలు : 5961

- సచివాలయాల నిర్మాణంకు ఖర్చుచేసిన మొత్తం : రూ. 1400.19 కోట్లు

- వివిధ దశల్లో వున్న మిగిలిన భవనాలను కూడా వేగంగా పూర్తి చేయాలి.

- రాష్ట్రంలో 10,408 రైతుభరోసా కేంద్రాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

- దీనిలో రూ.474.98 కోట్లతో 2934 రైతుభరోసా కేంద్రాల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. 

- రాష్ట్ర వ్యాప్తంగా 8585 వైయస్‌ఆర్‌ హెల్త్ క్లీనిక్స్‌ నిర్మాణం చేపట్టాలని లక్ష్యం.

- దీనిలో రూ. 254.59 కోట్లతో 1938 వైయస్‌ఆర్‌ హెల్త్ క్లీనిక్స్‌ నిర్మాణం దాదాపు పూర్తి.

- రూ. 1529.75 కోట్ల అంచనాలతో 9899 బల్క్‌ మిల్క్‌ కూలింగ్ యూనిట్లు

- ఇప్పటి వరకు నరేగా మెటీరియల్ కాంపోనెంట్‌ కింద రూ.635.50 కోట్లు ఖర్చు చేశాం.


*వైయస్‌ఆర్ జలకళపై...*

- వైయస్‌ఆర్‌ జలకళ కింద బోర్ల డ్రిల్లింగ్ వేగవంతం చేయాలి

- రాష్ట్ర వ్యాప్తంగా 1,60,974 దరఖాస్తులు రైతుల నుంచి వచ్చాయి.

- వాటిల్లో 21,659 గ్రౌండ్ వాటర్ సర్వే పూర్తి చేసుకున్నాయి.

- దాదాపు 12,048 దరఖాస్తులకు పరిపాలనా అనుమతులు ఇచ్చాం.

- మిగిలిన దరఖాస్తులను కూడా వీలైనంత తొందరగా అన్ని అనుమతులు ఇచ్చి, బోర్ల డ్రిల్లింగ్ పూర్తి చేయాలి.


*ఇసుక విక్రయాలపై...*

-  రాష్ట్రంలోని అన్ని రీచ్‌ల్లో జెపి సంస్థ ఇసుక ఆపరేషన్లు చేపట్టేందుకు సిద్దంగా వుందని, ఈ మేరకు సోమవారం నుంచి జెపి సంస్థ ఇసుక తవ్వకాలు, విక్రయాలు ప్రారంభిస్తుందని మంత్రికి వివరించిన డిఎంజి, ఎపిఎండిసి విసి అండ్ ఎండి విజి వెంకటరెడ్డి

- ఈ మేరకు ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తులకు పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు వెల్లడించిన డిఎంజి

- రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 లక్షల టన్నుల ఇసుకను వర్షాకాలం కోసం రిజర్వు స్టాక్‌ గా సిద్దంగా ఉంచామన్న డిఎంజి

- అయితే రిజర్వు స్టాక్‌ను 30 లక్షల టన్నుల వరకు పెంచాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశం

-  జెపి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఇసుక తవ్వకాలు, విక్రయాలకు సంబంధించి పూర్తి నిబంధనలు సదరు సంస్థకు అందచేశామని, టన్ను ఇసుక రూ.475 చొప్పున వినియోగదారులకు అందిస్తామన్న డిఎంజి

- అలాగే నియోజవకర్గాల్లోని స్టాక్‌ పాయింట్ల వద్ద ఇసుక గరిష్ట విక్రయ రేట్ల కన్నా ఎక్కువకు ఎవరూ విక్రయించకూడా రేట్లను ఖరారు చేశామని వివరించిన డిఎంజి

- అన్ని రీచ్‌లు, స్టాక్‌ పాయింట్ల వద్ద సిసి కెమేరాలు, వేయింగ్ యంత్రాలు పకడ్భందీగా పనిచేయాలని ఆదేశించిన మంత్రి

- ఇసుకకు సంబంధించి ఎక్కడా అక్రమ తవ్వకాలు, రవాణా జరగకుండా ఎస్‌ఇబితో పాటు జిల్లాల్లోని జాయింట్ కలెక్టర్లు, మైనింగ్ అధికారులు నోడల్ అధికారులుగా బాధ్యత తీసుకుని తనిఖీలు నిర్వహించాలన్న మంత్రి

- వినియోగదారులకు ఇసుక కొరత అనేది ఏర్పడకుండా ప్రణాళికను సిద్దం చేసుకోవాలని మైనింగ్ అధికారులకు ఆదేశం.

Comments