జిల్లాలో గత 4 రోజుల్లో రెండు శాతం పాజిటివ్ రేట్ తగ్గుదల..


విజయవాడ (ప్రజా అమరావతి); జిల్లాలో  గత  4 రోజుల్లో  రెండు శాతం పాజిటివ్ రేట్ తగ్గుదల..
 *సర్వే ద్వారా 11,504 జ్వరపీడితులను గుర్తించాం* .


 *4,776 శాంపిల్స్ రిపోర్టు రాగా, వారిలో 385 మందికి పాజిటివ్ నిర్ధారణ* 


 *జిల్లాలో  జ్వరపిడితులు,స్వల్ప లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకు సర్వే వేగవంతం చేశాం* . 


 *ఇప్పటి వరకు 4,93,734 కుటుంబాలను నుంచి వివరాలు సేకరించం* 


 *జిల్లాకలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్* కరోనా స్ట్రెయిన్ లక్షణాలల్లో భాగంగా జ్వరాలు, కోవిడ్ లక్షణాలు ఉండేవారిని గుర్తించేందుకు క్షేత్ర స్థాయిలో సర్వ్ బృందాలు ఆదివారం 2,90,380 ఇళ్లను సందర్శించి 2,398 మందిని లక్షణాలు ఉన్నవారి ని గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు.


ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్,రాష్ట్ర కోవిడ్ పర్యవేక్షణ చైర్మన్ కె.ఎస్.జవహర్ రెడ్డి,ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ కుమార్ సింఘాల్ కృష్ణా జిల్లా లో కోవిడ్ పరిస్థితులపై జూమ్ కాన్ఫెరెన్సు ద్వారా సమీక్షించారు. నగరంలో ని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ గత 4 రోజుల్లో  పాజిటివ్ కేసుల్లో 2  శాతం తగ్గుదల వుందన్నారు. జిల్లాలో మే 2 నుంచి  8 వరకు 56,575 కరోనా పరిక్షలు నిర్వహించగా 6,821 (12.06 శాతం) పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు.


మే 9 నుంచి 15 వరకు 57,055 పరీక్షలు నిర్వహించాగా 6,311 (11.06 శాతం) కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు.


గత 4 రోజులుగా జిల్లాలో 37,281 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాగా 3,700 మంది పాజిటివ్ కేసులు గుర్తించమన్నారు. ఈ పరీక్షల్లో 9.92 శాతం మాత్రమే కోవిడ్ ఉన్నట్లు తేలిందని కలెక్టర్ వివరించారు.


పాజిటివ్ కేసుల తగ్గుదల ఆశ ఆశావహంగా వుందన్నారు. కోవిడ్ స్ట్రెయిన్ నియంత్రణ కు జిల్లా యంత్రాంగం  పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు జిల్లాలోని 14,96,181 ఇళ్లను సర్వే   బృందాలు సందర్శించడం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసికున్నామన్నారు.


గత రెండు రోజులుగా 4,93,734 (33 శాతం) ఇళ్లను నుంచి సమాచారం సేకరించమన్నారు.


ఈ సర్వేలో 4,111 మంది కుటుంబాల్లో జ్వరం, కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్య అధికారుల ద్వారా సూచనలు, సలహాలు అందించమన్నారు.గత రెండు వారాల్లో 7,026 మంది హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాము.ఈరోజు 828


4,506 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు - 


ఆక్సీజన్ బెడ్లు 729,నాన్ ఆక్సీజన్ 2,107,జనరల్ 1670


 జిల్లాలోని 76 కోవిడ్ ఆసుపత్రులలో 4,875 బెడ్స్ ద్వారా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వాటిలో 729 ఐసీయూ బెడ్స్ విత్ ఆక్సిజన్ , 2107 ఐసీయూ విత్  నాన్ ఆక్సిజన్ బెడ్స్ , 1670 సాధారణ బెడ్స్ పై భాదితులకు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇంకా జిల్లాలో 211 బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.  వాటిలో నాన్ ఐసీయూ, జనరల్ బెడ్స్ ఉన్నట్లు తెలిపారు.


 జిల్లాలో ఏప్రిల్ 28 నుంచి ఈ రోజు వరకు మొత్తం 8,659 మందికి హోమ్ ఐసోలేషన్ ఉన్నారని, వారికి ఉచితంగా కిట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు.  ఈ రోజు 828 మందికి హోమ్ ఐసోలెషేన్ కిట్స్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. 


జిల్లాలో ఇప్పటివరకు 7,01,371 మందికి వాక్సినేషన్ వేసామన్నారు. 


డివిస్ లాబ్రోరెటరీ వారు 200 ,గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 100 ఆక్సీజన్ సీలిండర్లు జిల్లాకు అందించారన్నారు.

సమావేశంలో   డిప్యూటీ డియంహెచ్ ఓ డా.ఉషారాణి,డా.నవీన్ పలువురు వైద్య అధికారులు పాల్గొన్నారు.