40 ఏళ్ళ ఇండస్ట్రీ జూమ్ చంద్రబాబుది అర్ధం కాని బతుకు

 

- 40 ఏళ్ళ ఇండస్ట్రీ జూమ్ చంద్రబాబుది అర్ధం కాని బతుకు 


- బాబు మాడు పగలగొట్టడానికి సిద్ధంగా ప్రజలు 

- అన్నం తినే వాడెవడూ చంద్రబాబుతో కలవడు 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తాడేపల్లి, మే 30 (ప్రజా అమరావతి): 40 ఏళ్ళ ఇండస్ట్రీగా చెప్పుకునే జూమ్ యాప్ చంద్రబాబుది అర్ధం కాని బతుకని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. నెల్లూరులో సొంబేరు రెడ్డి, వార్డు మెంబర్ గా గెలవని వర్ల రామయ్య, తీసేసిన తహసీల్దార్, 20 ఏళ్ళుగా నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా రాని యనమల రామ కృష్ణుడు లాంటి వాళ్ళతో చంద్రబాబు జూమ్ యాప్ పెట్టుకుని చర్చించే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చాడన్నారు. బీజేపీతో అంశాలవారీ మద్దతిస్తామని చెప్పిన చంద్రబాబుకు ఆ పార్టీ అగ్ర నేతల దగ్గర నుండి గల్లీ నాయకుల వరకు నమస్కారం పెట్టి మద్దతు వద్దు, చంద్రబాబు కూడా వద్దని చెప్పారన్నారు. చంద్రబాబు అంత నీచుడు, వెన్నుపోటుదారుడు ఎవడూ లేడని తిట్టినా సిగ్గు, శరం లేకుండా ఉంటున్నాడన్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రజల, దేవుని ఆగ్రహానికి గురై దిక్కులేని బతుకు బతుకుతున్నారని, అటువంటి వాళ్ళ దగ్గర మేం చెప్పించుకునే పరిస్థితులో లేమన్నారు. చంద్రబాబు దేశంలో ఉన్న పార్టీలన్నింటినీ కలుపుకుని వచ్చినా ఏమీ జరగదన్నారు. గతంలో 2009 ఎన్నికల్లో వైఎస్సార్ పోటీ చేసినపుడు తుప్పునాయుడు మహాకూటమి అని పెట్టాడని, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్, టీడీపీలు కలిసి రాజశేఖరరెడ్డిని ఢీ కొట్టాయన్నారు. చంద్రబాబు, ఆయన కూటమి తునాతునకలు అయిందన్నారు. 2018 లో కలిసొచ్చే పార్టీలతో వెళ్తానని చెప్పి సోనియాగాంధీ ఇంటికి వెళ్ళి సంకనాకి, రాహుల్ గాంధీ సూట్ కేసులు మోసి కాంగ్రెస్ తో కలిశాడని, తెలంగాణాలో పొత్తు పెట్టుకుని కేసీఆర్ మీదకు వెళ్ళాడన్నారు. చంద్రబాబును కలుపుకున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులందరికీ కలిపి తెలంగాణా ప్రజలు మాడు పగలగొట్టి బుద్ధి చెప్పారన్నారు. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడని, నేటికీ జగన్ ను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలూ కలిసిరావాలని చంద్రబాబు కోరుకుంటున్నాడన్నారు. ప్రజలైతే జగనను గెల్పించడానికి, చంద్రబాబు మాడు పగలగొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబుతో కలిసివస్తే ప్రజల చీత్కారానికి మిగిలిన పార్టీలు కూడా గురవుతాయని, చంద్రబాబుకు ఏ గతి పట్టిందో ఆ గతే మిగతా పార్టీలకు కూడా పడుతుందన్నారు. అందరికన్నా బీజేపీకి ఆ సంగతి బాగా తెలుసని అన్నారు. చంద్రబాబును నమ్మి ఎవరైనా పనికిమాలిన, డిపాజిట్లు రాని పార్టీలు ఒకరిద్దరు వెళ్తారేమో గాని, అన్నం తినేవాడెవడూ కలవడన్నారు.