తెనాలి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో తాత్కాలికంగా నిర్మించ తలపెట్టిన 50పడకల ఆస్పత్రి

 సబ్ కలెక్టరు తనిఖీ


తెనాలి (ప్రజా అమరావతి);  సబ్ కలెక్టర్, మయూర్ అశోక్  ఆదివారం డివిజన్లోని దుగ్గిరాల,కొల్లిపర, మండలములలోని పలుగ్రామాలలో జరుగు తున్నఫీవర్ సర్వే జరుగుతున్న తీరుపై తనిఖీ నిర్వహించారు. సర్వే చేస్తున్న సిబ్బంది ఉద్దేశించి కోవిడ్ రెండో దశ ఉథృతిగా వ్యాపిస్తున్న నేపథ్యంలో  ఫీవర్ సర్వె ను ప్రభుత్వం నిర్దేశించినసమయంలో పూర్తి చేయాలని ఏమాత్రం నిర్లక్ష్యం కూడదని సబ్ కలెక్టర్  అన్నారు. కార్యక్రమంలోఆయా మండలాల తాసిల్దారులు,  తెనాలిDy DMHO నరసింహనాయక్ ,  దుగ్గిరాల తహసిల్దారు మల్లేశ్వరి, కొల్లిపర MPDO శ్రీనివాసరావు ,PHC డాక్టర్లు,ANMలు,  తదితర సిబ్బంది పాల్గొన్నారు. 



అనంతరం సబ్ కలెక్టరు తెనాలి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో తాత్కాలికంగా నిర్మించ తలపెట్టిన 50పడకల ఆస్పత్రి


ప్రాంతాన్ని  పరిసరాలను మున్సిపల్ కమిషనరు జస్వంతరావు తో కలసి ప్రాంత పరిశీలన చేశారు.

Comments