విఎంసి మేయర్ భాగ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలిపిన కలెక్టర్ ఇంతియాజ్



విజయవాడ (ప్రజా అమరావతి);


విఎంసి మేయర్ భాగ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలిపిన కలెక్టర్ ఇంతియాజ్




వెన్యూ కన్వెన్షన్ లో  విజయవాడ జి జి హెచ్ కు విస్తరణ గా కోవిడ్ వైద్య సేవలు అందించేందుకు ఆక్సిజన్ సరఫరా కోసం ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ తెలిపారు.



స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఆదివారం ఉదయం ఫోన్లో మేయర్ రాయన భాగ్యలక్ష్మి వారితో కలెక్టర్ మాట్లాడారు.


కోవిడ్ స్ట్రెయిన్ వలన చికిత్స నిమిత్తం వొచ్చే వారిలో కొందరికి ఆక్సిజన్ అందించడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. కొత్త జి జి హెచ్ వైద్య సేవలు విస్తరణ కోసం  వెన్యూ కన్వెన్షన్ సెంటర్ నందు 100 బెడ్ల కు ఆక్సిజన్ సరఫరా చేసే  పైపు లైన్స్ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందుకోసం  విఎంసి నిధులు రూ.20 లక్షలు వెచ్చించేందుకు మేయర్ ముందుకు రావడం హర్షదాయకం అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సహాయం అందించి మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు తన పెద్ద మనస్సును చాటుకొన్నారని కలెక్టర్ పేర్కొన్నారు.  వెన్యూ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుపత్రికి  ఆక్సిజన్ సరఫరా పైప్ లైన్ ఏర్పాటు కోస విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్  ముందుకు వచ్చి, స్ఫూర్తి కలిగించిందని తెలిపారు. ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీఠ వేస్తూ విజయవాడ నగర  మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో స్పందించి నిధులను అందించిన మేయర్ భాగ్యలక్ష్మి గారికి  కృష్ణా జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ న్నామన్నారు.



Comments