ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లు నిలిపేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌పై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు


అమరావతి (ప్రజా అమరావతి);


ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లు నిలిపేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌పై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు

జూన్‌ 17కు తదుపరి విచారణ వాయిదా

తెలంగాణ ప్రభుత్వ చర్యలను సవాల్‌ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌

ఈ పిటిషన్లో జోక్యంచేసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వవం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం


తెలంగాణ హైకోర్టులో ఏపీ వాదనలు 

ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వెళ్లడం, ప్రయాణాలు చేయడం అన్నది పౌరులకున్న ప్రాథమిక

రాజ్యంగంలోని 19, 21 అధికరణాల ప్రకారం దేశంలో ఏ పౌరుడైనా ఎక్కడికైనా వెళ్లవచ్చు

తెలంగాణ ప్రభుత్వం నియంత్రణలు రాజ్యాంగ విరుద్ధం

ఎపిడిమిక్‌ యాక్ట్, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌–2005లు ఆధారంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌ చెల్లదు

రోగులు నివాసం ఆధారంగా వారిపై వివక్ష చూపడమన్నది వారిహక్కులకు భంగం కలిగించడమే

ఎపిడిమిక్‌ యాక్ట్, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌–2005లు ఆధారంగా చేసుకుని పౌరుల్లో వీరు మావాళ్లు, వీరు మావాళ్లు కాదు అన్న వర్గీకరణ చేయడం అన్నది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది

తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు అన్న వేటినైతే చెప్తోందో అవి తెలంగాణలో నివాసం ఉన్నవారికి వర్తించవా? కేవలం నివాస స్థలం ఆధారంగా హైదరాబాద్‌లో చికిత్సకు రావొచ్చో, లేదో అర్హతలు నిర్ణయిస్తారా?

వైద్యంకోసం వస్తున్న పౌరుల కదిలికలపై నియంత్రణ లేదా ఆంక్షలు విధించండం అన్నది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం

వేరే రాష్ట్రానికి చెందినవారన్న కారణంతో వారికోసం ప్రత్యేకంగా ఆంక్షలు నియంత్రణలు విధించడం రాజ్యాంగ విరుద్ధం, ఏ చట్టం కింద కూడా అలాంటి నియంత్రణలు వి«ధించకూడదు.

వైద్యపరంగా మౌలికసదుపాయాలు అన్నవి రాష్ట్రాలతో సంబంధంలేకుండా ఏర్పాటైనవి, ఇవి జాతి మొత్తానికి సంబంధిచిన ఆస్తులు

రాష్ట్రాల మధ్య నిరంతరం చక్కటి సమన్వయం ఉండాలని ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీచేసింది.

అంబులెన్సులు నిలిపేయరాదంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మే 11న ఈ సర్క్యులర్‌ జారీచేశారు, కోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం నియంత్రకూడదు

గతరాత్రి ఈ సర్క్యులర్‌ ఏపీ ప్రభుత్వానికి మెయిల్‌ చేశారు, ఉదయం నుంచే అంబులెన్స్‌లను నిలిపేయడం మొదలుపెట్టారు

హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదు, చట్టాలతో సంబంధం లేకుండా నడుచుకున్నారు.

Comments