అన్నింటికీ ఒక్కటే మార్గం 'వైఎస్ఆర్ ఏపీ వన్' : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.అమరావతి (ప్రజా అమరావతి);


అన్నింటికీ ఒక్కటే  మార్గం 'వైఎస్ఆర్ ఏపీ వన్' :  పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.ఏపీకి భారీ పెట్టుబడులు, మెగా పరిశ్రమలు తీసుకువచ్చేందుకు చేపట్టవలసిన సూచనలను మంత్రి మేకపాటికి ప్రజంటేషన్ ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్.


ఏపీలోని 20కి పైగా స్టేక్ హోల్టర్లు, ఏపీ సహా ఇతర రాష్ట్రాలలోని 50కి పైగా ఎమ్ఎస్ఎమ్ఈ యూనిట్లు, 30 పైగా సీఎక్స్ వోలతో సంప్రందించిన అనంతరం పీపీటీ రూపొందించినట్లు మంత్రికి బీసీజీ వెల్లడి.


మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అవలంభిస్తున్న మంచి విధానాలను స్టడీ చేసినట్లు మంత్రి గౌతమ్ రెడ్డికి  బీసీజీ వెల్లడి


సింగపూర్, వీట్నమ్, ఇజ్రాయెల్ వంటి దేశాల విధానాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపిన బీసీజీ


తమిళనాడు గైడెన్స్, గుజరాత్ ఇండెక్స్టీబి, మైత్రి, సింగపూర్ ఈడీబీ,  ఇన్వెస్ట్ వీట్నమ్, ఇన్వెస్ట్ తైవాన్,తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్(టీఐహెచ్ సీ)లకోసం ఇప్పటికే పని చేసి బెంచ్ మార్క్ సెట్ చేసిన బీసీజీ.


వైఎస్ఆర్ ఏపీ వన్ కోసం 6 ప్రతిపాదనలను మంత్రి మేకపాటి ముందుంచిన బీసీజీ.


పరిశ్రమల శాఖలో తక్షణం చేపట్టవలసిన మార్పులు, కేటాయించవలసిన అదనపు బాధ్యతలు, కీలక సంస్కరణలపై ప్రాథమికంగా నివేదిక అందించిన బీసీజీ.


పరిశ్రమల స్థాపనలో కీలకమైన సింగిల్ డెస్క్ పోర్టల్ ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఎలా ఉందని అడిగి తెలుసుకున్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి


ఒకే గొడుకు కిందకు తీసుకురావాలనే ఒకే మంత్రిత్వశాఖ కిందకు పరిశ్రమలు, నైపుణ్య శాఖను ముఖ్యమంత్రి తీసుకువచ్చారన్న మంత్రి మేకపాటి


ప్రజంటేషన్ ను పరిశీలించిన అనంతరం వైఎస్ఆర్ ఏపీ వన్ అంతకు మించి ఉండాలన్న పరిశ్రమల శాఖ మంత్రి


ప్రాథమిక దశలో ఉన్నందున మరింత సంప్రదింపులు, పరిశోధన, సలహాలు, సూచనలు, పరిశీలన అవసరమన్న మంత్రి మేకపాటిపరిశ్రమల శాఖలోని ఈడీబీ విభాగం శక్తి సామర్థ్యం మరింత పెంచాలని మంత్రికి తెలిపిన బీసీజీ.


రిలేషన్ షిప్ మేనేజర్ చాలా కీలకం కాబట్టి, ప్రభుత్వంలో ప్రతి అంశంపై అవగాహన అవసరమని సూచించిన మంత్రి*


రేపేంటో ముందే ఊహించి, ప్రస్తుతం మనం ఎక్కడున్నామో గమనించి మార్గాలు అన్వేషించాలి


బీసీజీ పరిశీలన , పరిశోధన బాగుంది. కానీ, ఆకాశమే హద్దుగా ఉండాలన్నదే తాపత్రయం.


పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,ఏపీఐఐసీ ఎండీ, పరిశ్రమల శాఖ డైరెక్టర్ లతో మరింత లోతుగా చర్చించాలని సూచించిన మంత్రి గౌతమ్ రెడ్డి


పరిశ్రమల ద్వారా ఏపీ అభివృద్ధి పరుగులు పెట్టించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి.


నెల రోజుల్లో మరోసారి సమావేశమవుదామన్న మంత్రి గౌతమ్ రెడ్డి.


కార్యక్రమానికి హాజరైన పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండీ రవీన్ కుమార్ రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, జాయింట్ డైరెక్టర్ పద్మావతి, పరిశ్రమల శాఖ సలహాదారులు కృష్ణ జీవి గిరి, లంకా శ్రీధర్,  వాషింగ్టన్ కు చెందిన బీసీజీ సీనియర్ సలహాదారులు అనబెల్ గోన్జలెజ్ , ఇతర బీసీజీ ప్రతినిధులు.