కోవిడ్ వార్డుల్లో రోగులు మాత్రమే ఉండాలే తప్ప సహాయకులు ఉండటానికి వీల్లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు.


జిజిహెచ్ (ప్రజా అమరావతి);కోవిడ్ వార్డుల్లో రోగులు మాత్రమే ఉండాలే తప్ప సహాయకులు ఉండటానికి వీల్లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. 


సోమవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తో కల్సి ఆయన కోవిడ్ వార్డులను పరిశీలించారు.


కోవిడ్ వార్డుల్లో రోగుల సహాయకులు ఉండటం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ సహాయకులు బయటకు వెళ్లడం వల్ల మరికొంతమంది కి రోగ లక్షణాలు వచ్చే అవకాశం ఉందని ..ఇలా రోగాలు పెరగడమే తప్ప తగ్గే సూచనలు కనపడవు. వార్డుల్లో సహాయకులను ఎందుకు అనుమతి ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. 


పాస్ లు లేకుండా వార్డుల్లో ఎవరు కనిపించిన సెక్యురిటి గార్డులను సస్పెండ్ చేస్తానని ఆయన హెచ్చరించారు. భోజనం రోగులకు ఆసుపత్రి నుంచి అందడం లేదా ..బయట నుంచి ఎలా తీసుకుని వస్తారని ఆయన అన్నారు. 

రోగాలను తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఆయన గుర్తు చేశారు.