అమరావతి (ప్రజా అమరావతి);
*రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 14 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు శంకుస్థాపన:*
*క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శిలాఫలకాలు ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్ జగన్:*
*ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం (వైద్య ఆరోగ్య శాఖ మంత్రి) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడారు.*
ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మారుతోంది: ఆళ్ల నాని. డిప్యూటీ సీఎం.
– ‘ఇవాళ ఇది దేశ చరిత్రలో గతంలో ఏనాడూ జరగలేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఇది చారిత్రక నిర్ణయం. ప్రజలకు ఒక నూతన సువర్ణ అధ్యాయం. గతంలో మహానేత వైయస్సార్ హయాంలో మాత్రమే వైద్య ఆరోగ్య రంగంలో కొంత అభివృద్ధి చెందింది. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ఇక గత 5 ఏళ్లలో ఈ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కానీ మీరు వచ్చాక నాడు–నేడుతో ఆస్పత్రుల సమగ్ర రూపురేఖలు మారుస్తున్నారు. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు మొదలు టీచింగ్ ఆస్పత్రుల వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు. గత సీఎం చంద్రబాబు, చివరకు ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా ఇవ్వలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చాక, అన్నింటి పరిస్థితి మారుస్తున్నాము. కరోనా సమయంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాము. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం మారుతోంది’.
*మీ స్ఫూర్తిగా ఇతర రాష్ట్రాలు పని చేస్తున్నాయి: ఏకే సింఘాల్. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి.*
– ‘ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్న మీరు నిజంగా ఒక చరిత్ర సృష్టిస్తున్నారు. మొత్తం రూ.7,880 కోట్లతో 16 మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తున్నారు. చాలా మంది ముఖ్యమంత్రులకు నిజంగా ఇది ఒక కల. వచ్చే కొన్నేళ్లలో రాష్ట్ర విద్యార్థులెవ్వరూ వైద్య విద్య కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం రానప్పుడు, వారు కచ్చితంగా ఈరోజును తల్చుకుంటారు. ఆ తర్వాత కొన్నేళ్లకు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి పూర్తి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. నైపుణ్యం కలిగిన సిబ్బంది లోటు అస్సలే ఉండదు’.
‘గత రెండేళ్లుగా మన ప్రభుత్వం ఈ రంగంలో మీరు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు చెప్పాలంటే ఎంతో సమయం పడుతుంది. ఈ రంగంలో మీ నిర్ణయాలు చాలా రాష్ట్ర ప్రభుత్వాలకు స్ఫూర్తిగా నిల్చాయి.
ఉదాహరణకు.. 45 ఏళ్లకు పైబడిన వారికే తొలుత వాక్సిన్ ఇవ్వడం. దేశంలో కొవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగేలా భారత్ బయోటెక్‌కు సంబంధించి ఐపీఆర్ ఇష్యూ సెటిల్ చేయాలని కేంద్రాన్ని కోరడం, ద్వారా, ఇతర సంస్థలు కూడా వాటిని ఉత్పత్తి చేసి, దేశంలో వాక్సిన్ల ఉత్పత్తి పెంచేలా చేయడం. వాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లకు వెళ్లడం. కోవిడ్ వల్ల తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు రూ.10 లక్షల డిపాజిట్. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఆక్సీజన్ ఉత్పత్తి. దీన్ని అమలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది’.
‘6 గంటల రిలీఫ్‌తో 18 గంటల కర్ఫ్యూ మంచి నిర్ణయం. దీన్ని మీడియాలో ఒక వర్గం దుష్ప్రచారం చేయాలని చూసినా, ఆ తర్వాత వెనక్కు తగ్గారు. కర్ఫ్యూ వల్ల కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి.
ఒక ఆస్పత్రిలో మనం ఏ విధమైన చికిత్స, స్పందన కోరుకుంటామో, సరిగ్గా ప్రతి నిరుపేదకు కూడా వైద్య సేవలు అందాలన్న మీ మాట, మీ సంకల్పం, లక్ష్యం మాకు ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది’.
addComments
Post a Comment