-వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ మూడో ఏడాది మొదటి విడత పెట్టుబడి సహాయం.
రైతన్నలకు కొండంత అండగా...నవరత్నాలలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా - అన్నదాతల పంటల సాగుకు...చెప్పిన దానికంటే ముందుగా.. మాట ఇచ్చిన దానికంటే మిన్నగా మూడో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ కింద అర్హులైన రైతన్నలకు జగనన్న పెట్టుబడి సాయం
2021-22 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్ రైతు భరోసా ద్వారా నేడు కర్నూలు జిల్లాలో 5,00,216 మంది రైతన్నలకు మొదటి విడత కింద రూ.275,23,30,000 కోట్లు జమ
కరోనా విపత్తు వేళ రైతుకు అండగా రాష్ట్ర ప్రభుత్వం :-
రైతన్నల హర్షం.. రైతన్నల స్పందన :-
కర్నూలు, మే 13 (ప్రజా అమరావతి);
*కరోనా ఉధృతి కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం’ అమలు చేస్తోంది. వ్యవసాయం తప్ప మరో ప్రత్యామ్నాయం తెలియని రైతన్నలు పట్టువదలని విక్రమార్కుల్లా వ్యవసాయం చేస్తూ రైతన్నలు పడుతున్న కష్టాలను తన పాదయాత్రలో స్వయంగా చూసి నేను విన్నాను..నేను ఉన్నాను..అంటూ సీయం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతన్నలకు కొండంత అండగా..చెప్పినదానికంటే ముందుగా...మాట ఇచ్చినదానికంటే మిన్నగా ఏడాదికి రూ.13500/- ల పెట్టుబడి సాయాన్ని అందించడానికి వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా శ్రీకారం చుట్టి వ్యవసాయాన్ని పండుగ చేస్తూ....రైతన్నల గౌరవాన్ని పెంచారు.. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ రోజు మూడో ఏడాది మొదటి విడత సొమ్ము రూ.7,500 చొప్పున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా రైతుల ఖాతాల్లో కంప్యూటర్ బటన్ నొక్కి నగదు జమ చేశారు. ఆపద వేళ ప్రభుత్వం అండగా నిలవడం రైతుల్లో ఆనందం నింపింది...*
*2021-22 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 7.11 లక్షల మంది రైతులకు ఖాతాలు ఉండగా అందులో 5,00,216 మంది రైతన్నలకు మొదటి విడత కింద రూ.275,23,30,000 కోట్ల పెట్టుబడి సాయం అందింది. గురువారం నాడు వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతన్నకు రూ.7,500/- ల పెట్టుబడి సాయాన్ని కరోనా కష్ట కాలంలో అందజేయడంతో రైతుల ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. సీఎం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని...సంతోషంగా పంటను సాగు చేసుకుంటామని చెపుతున్నారు కర్నూలు జిల్లా రైతన్నలు. రైతన్నల అభిప్రాయం వారి మాటల్లోనే...*
*రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది....కురువ పెద్ద ఈశ్వరయ్య రైతు :-*
నా పేరు కురువ పెద్ద ఈశ్వరయ్య, కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో నివసిస్తున్నాను. నాకు మా ఊరిలో మూడున్నర ఎకరాల పొలం ఉంది. నేను ఉల్లి పంటను సాగు చేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ.13,500 ల పెట్టుబడి సాయం అందజేయడం మాకు ఓ వరం. వై ఎస్ ఆర్ రైతు భరోసా క్రింద ఈ రోజు మూడో ఏడాది మొదటి విడత కింద రూ.7500 లను మా ఖాతాలో జమ చేశారు. ఇదేఉత్సాహంతో పంటల సాగు చేస్తా...కరోనా కష్ట కాలంలో అప్పుల కోసం చేయి చాపే పరిస్థితిని కొంతైనా తగ్గించి మా రైతన్నల ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన సీఎం జగనన్న కు ఋణపడి ఉంటాం. *-కురువ పెద్ద ఈశ్వరయ్య రైతు, కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం, కర్నూలు జిల్లా.*
*రైతు భరోసా ఓ వరం ... గొల్ల ఎల్లప్ప రైతు :-*
నా పేరు గొల్ల ఎల్లప్ప. కర్నూలు జిల్లా గూడూరు మండలం గూడూరు గ్రామానికి చెందిన రైతును. తరతరాల నుంచి మా కుటుంబం వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. నాకు 5 ఎకరాల పొలం ఉంది. పంట సాగు చేస్తే తప్ప బువ్వ దొరకని పరిస్థితి. పంట సాగు చేద్దామంటే డబ్బుల్లేవ్. ఇటువంటి సమయంలో మూడో ఏడాది మా జగనన్న వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద 7500 రూపాయలు మా ఖాతాలో జమ చేశారు. చాలా సంతోషంగా ఉంది. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయం, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పేర్ల నమోదు ఇలా ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా చేపట్టింది. రైతుల ముంగిటకే అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. పంట బీమా, పంట నష్ట పరిహారం, పంటల నమోదు వంటి ప్రక్రియ సాగుతోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం మేము పండించిన పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. రైతన్న గౌరవాన్ని పెంచారు. వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారు. *-గొల్ల ఎల్లప్ప రైతు, గూడూరు మండలం, గూడూరు గ్రామం, కర్నూలు జిల్లా.
మాట తప్పని సీఎం జగనన్న...మద్దిలేటి రైతు :-
నా పేరు మద్దిలేటి. కర్నూలు జిల్లా రుద్రవరం గ్రామం నివాసిని. నాకు మా ఊరిలో రెండు ఎకరాల పొలం ఉంది. ప్రతి ఏటా ఉల్లి పంట సాగు చేస్తాను. పంట వేసేటప్పుడు విత్తనాలకు, ఎరువులు, దుక్కి ఎకరాకు 50 వేల రూపాయలు ఖర్చు వచ్చేది. పంట వేయాలంటే భయమేసేది. ఖరీఫ్ సీజన్లో పంటలు పెట్టుకోవడానికి పెట్టుబడికి ఇబ్బందులు పడుతూ వచ్చాము. ప్రతిసారి అప్పులు చేసి విసుగు వచ్చేసింది. పంట పెట్టాలంటే అప్పు చేయాల్సిందే. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పంట పెట్టుబడి కింద సంవత్సరానికి ఒక రైతు కుటుంబానికి మూడు విడతల్లో 13500 ల రూపాయల పెట్టుబడి సాయం ఇవ్వడం వల్ల ఖరీఫ్ , రబీ సీజన్లలో పంట పెట్టుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మూడో ఏడాది 7,500 రూపాయలు డబ్బులు మా ఖాతాలో జమ అయ్యాయి. ఇప్పుడు అప్పుల బాధ కొంచెం తగ్గింది. చాలా సంతోషంగా ఉంది. *-మద్దిలేటి రైతు, రుద్రవరం గ్రామం, కర్నూలు జిల్లా.
addComments
Post a Comment