మరో ముప్పై ఏళ్ళ పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి

 గుంటూరు జిల్లా, గురజాల  (ప్రజా అమరావతి);  శాసనసభ్యులు  కాసు మహేష్ రెడ్డి మీడియాతో  మాట్లాడుతూ
మరో ముప్పై ఏళ్ళ పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరీ ముఖ్యంగా యరపతినేని శ్రీనివాసరావు వంటి నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఒక అద్భుతమైన పాలన ఇచ్చినమాట నిలబెట్టుకోవడానికి సంక్షేమ పథకాలే కాకుండా అన్ని మౌలిక వసతులు కూడా కల్పిస్తూ మంచి నీళ్లు, రోడ్లు, హాస్పిటల్స్ స్కూల్స్ ఇలా అన్నిరంగాల్లో కూడా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు.


.ఈ కరోనా అనే మహమ్మారి కొన్ని రాష్ట్రాలు చేతులెత్తేసిన ఇక్కడ సమర్థవంతంగా చేతనైనంత మేరకు ఈ కరోనా అనే మహమ్మారిని ఎదుర్కొంటున్నాం వీలైనంతవరకు మెరుగైన సౌకర్యాలను అందిస్తున్నాం, ఒప్పుకుంటాం ఈరోజు ఈ విపత్తు యావత్ దేశాన్ని, ప్రపంచాన్ని కుదేలుచేస్తుంది కానీ ఇటువంటి సమయంలో కూడా నిలబడి దాని ఎదుర్కొంటూ వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ చేయాలి,ఆక్సిజన్ అందించాలి , బెడ్లు ఇంకా ఎక్కువ చేసుకుంటూ పోతున్నాడు.


 ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో వైద్య రంగాన్ని పూర్తి నిర్లక్ష్యం చేయడానికే ఈ రోజు ప్రజలు అనుభవిస్తున్న ఈ పాపం. ఎక్కడ ఒక్క హాస్పిటల్ కట్టలేదు, ఒక్క బెడ్ పెంచలేదు. ఈరోజు మీరు పల్నాడు చూస్తే 10 లక్షల జనాభా ఉన్న పల్నాడులో కేవలం 60 పడకల లేదు,100 పడకల ఉన్నాయి అంతే.


 ఎక్కడా కూడా వీళ్ళ జీవితంలో కట్టిన దాఖలాలు లేవు, ఏ రోజు అయినా వీళ్ళు ఒక బెడ్ హాస్పిటల్  కట్టిన వాళ్లు కాదు ఆక్సిజన్ గురించి, సిలిండర్ గురించి మాట్లాడుతున్నారు ప్రజలు నవ్వుకుంటున్నారు.


 మాట్లాడితే పదహారు వందల కోట్లతో సుమారు 2 కోట్లు, 3కోట్లు డోసులు కోన వచ్చు కదా అని తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, బహుశా వీళ్లకు తెలియదేమో ఈరోజు కూడా నెలకి వచ్చే యావత్ భారతదేశం మీద  మహా అయితే ఏడు కోట్లు లేదా పది కోట్లు. ఎవరిస్తారు 3 కోట్లు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి చెప్పమనండి, 

కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో  ఈ డోసులన్ని కొని  వాళ్ళు రాష్ట్రాలకి పంచుతున్నారు లేదు, స్వయానా రాష్ట్రాలు కూడా ఉన్నది రెండు కంపెనీలు  అంటే ఆ రెండుకంపెనీలు  యావత్ దేశం మొత్తం డోసులు ఇవ్వక్కర్లేదా, తయారు చేస్తుంది కేవలం రెండు కంపెనీలు కేవలం వారంలో ఇంపోర్ట్ చేయడానికో, కొనడానికో కుదరదు. 


ఒకప్పుడు వ్యాక్సినేషన్ లు ఇస్తే జనం ముందుకు రాలా భయపడి ఎవరూ వేసుకోలా కరెక్టుగా నెల, రెండు నెలల క్రితమే ఎన్నిసార్లు చేసినా  స్వయానా  ముఖ్యమంత్రే వ్యాక్సినేషన్ వేసుకున్నాడు ప్రజల్లో అవగాహన పెంచడానికి. 


ఈ రోజున అందరూ కూడా సమిష్టిగా కూర్చొని ఈ వ్యాక్సినేషన్ ఉత్పత్తిని పెంచడం ఎలా అవసరమైతే దీన్ని దిగుబడి చేసుకోవడం ఎలా ఇవన్నీ కూడా చేయాల్సిన ఆస్కారం ఉంది అది చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు ఇతర నాయకులు అందరూ కూడా తప్పకుండా వచ్చే రెండు మూడు నెలల్లోనే దీనికి పరిష్కారం  అందుతుంది అని ఆశిద్దాం,ఈ లోపల దీన్ని ఎదుర్కోవడానికి కూడా అన్ని విధాలుగా సమాయాత్తం అవుతోంది ఈ ప్రభుత్వం.


 అధికారంలోకి  వస్తే  అది చేస్తాం,ఇది చేస్తాం  అని ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు ఆ

మిమ్మల్ని ఎదురుంచి

మిమ్మల్ని ఓడించి

మీతో పోరాడి గెలుచుకున్న నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు మీ ఉత్తర ప్రగల్భాలకు ఇక్కడ భయపడే వాడెవ్వడు లేడు.


 తప్పు చేస్తే ఎవరైనా చట్టం ముందు ఒక్కటే అది సంగం డైరీ కావచ్చు, అమరరాజా బ్యాటరీ కావచ్చు, మరో సంస్థ కావచ్చు కేవలం సంస్థలు ఉన్నాయి కదా అని ఇష్టానుసారం దొచుకుంటామంటే కుదరదు.

. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కరోనా అనే మహమ్మారి తగ్గిన వెంటనే బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి చూపెడతాం 

తప్పకుండా 2024 ఎలక్షన్ లో మళ్ళీ వైఎస్ఆర్సిపి జెండాని రెపరెపలాడించి ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా వాలంటరీ రిటైర్మెంట్ తప్పదు కాస్త ఓపిక పట్టండి 1,2 సంవత్సరాలు మీకు తప్పకుండా రిటైర్మెంట్  పెట్టించి మీ ఇళ్ళలో  మిమ్మల్ని కూర్చోబెట్టెట్టు చేస్తాం అని తెలియజేస్తున్నాను.