తమిళనాడు రాష్ట్రం నుంచి నెల్లూరు జిల్లాకు ఆక్సిజన్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


తశ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);తమిళనాడు రాష్ట్రం నుంచి నెల్లూరు జిల్లాకు  ఆక్సిజన్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసుతో మాట్లాడిన మంత్రి గౌతమ్ రెడ్డి.


నెల్లూరు జిల్లాకు 6 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందించమని కోరిన మంత్రి మేకపాటి.


ఆక్సిజన్ సరఫరాకోసమే ప్రత్యేకంగా నియమించిన పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ నేతృత్వంలో ఆక్సిజన్ కొరత రాకుండా చేస్తాం.


కరోనా దృష్ట్యా జనం వస్తే స్థలం చాలని మండలాలలోని పీహెచ్ సీలకి బదులు భౌతిక దూరం పాటించడానికి అనువైన విశాలమైన పాఠశాల ఆవరణల్లో, ఇతర స్థలాల్లో వాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని మంత్రి మేకపాటి వెల్లడి.


మండలంలోని సుదూర ప్రాంతాల ప్రజలకు వాక్సిన్ వేసే స్థలం అందుబాటులో ఉండేలా ఒక్కో మండలంలో రెండు చోట్ల వాక్సిన్ వేసే ఏర్పాట్లు చేయాలని మంత్రి మేకపాటి సూచన.


మొదటి వేవ్ లోని కోవిడ్ వ్యాధి లక్షణాలకు, మరణాలకు.., రెండో వేవ్ లో నమోదవుతున్న వ్యాధి లక్షణాలు, మరణాలకు ఎంతో వ్యత్యాసం ఉంది.


జిల్లాలో ఎన్ని నోటిఫైడ్ కోవిడ్ ఆస్పత్రులు ఉన్నాయి..? నోటిఫైడ్ కోవిడ్ ఆస్పత్రుల్లో ఎన్ని ఆక్సిజన్..? ఎన్ని ఐ.సి.యు..బెడ్స్ అందుబాటులో ఉన్నాయి..? అనే వివరాలు జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, టాస్క్ ఫోర్సు అధికారులను అడిగి  తెలుసుకున్న మంత్రి.


రోగులకు అందించడానికి ప్రతిరోజూ ఎన్ని మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోంది..? ప్రస్తుతం ఎంత ఆక్సిజన్ జిల్లాకు సరఫరా అవుతోంది.. ? అనే వివరాలు అడిగి తెలుసుకున్న పరిశ్రమల శాఖామంత్రి.


కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలతో మాట్లాడి ఆ కొరతను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటానని వెల్లడి.


 ప్రతిరోజూ ఎన్ని మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉందా..? అనేది ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించాలన్నారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ గురించి ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోడీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారని.., కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా ప్రభుత్వం, జిల్లా అధికారులు అహర్నిశలు పనిచేస్తున్నారు.  


కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స, బెడ్ లు కావాలంటే డబ్బులు వసూలు చేస్తున్న విషయం ప్రస్తావిస్తూ ఇలాంటి సున్నితమైన అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు  మంత్రి మేకపాటి ఆదేశం.


చిన్న చిన్న ఆసుపత్రులలో తక్కువ బెడ్లు ఉన్న వాటిలో కోవిడ్ చికిత్సకు బదులు పెద్ద ఆసుపత్రులు, అన్ని వసతులున్న పెద్ద ఆసుపత్రులలో మరిన్ని బెడ్ల సంఖ్యను పెంచే అవకాశాలను పరిశీలించాలన్న మంత్రి గౌతమ్ రెడ్డి.


ఇలా చేస్తే సిబ్బంది కొరత రాకుండా చేయడం , సమయం వృథా కాకుండా ఉండడం, వసతుల కల్పన పెంచడం చేయవచ్చనే అభిప్రాయాన్ని కలెక్టర్ కి తెలిపిన మంత్రి గౌతమ్ రెడ్డి.   


 రెమెడిసివిర్ ఇంజక్షన్లు సహా ఔషధాలకు లోటు లేదని అధికారులు చెప్పడంపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి.


ఫ్రంట్ లైన్ లో పని చేస్తున్న వారికి ప్రత్యేక వసతులు, కోవిడ్ చికిత్స అందించే అవకాశాలను అన్వేషించాలన్న మంత్రి. 


జీజీహెచ్ లో మరిన్ని వసతులు ఏర్పాటు చేయాలని, అక్కడ ఎటువంటి ఫిర్యాదులు రాకుండా దృష్టి సారించాలన్న మంత్రి గౌతమ్ రెడ్డి.


కఠిన పరిస్థితుల్లో సమయాసమయాలు చూడకుండా శ్రమిస్తోన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపిన మంత్రి మేకపాటి.


రాబోయే రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో నెల్లూరు జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి మేకపాటి దిశానిర్దేశం.


శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని తిక్కన భవన్ లో మంత్రి అనిల్ యాదవ్ తో కలిసి జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించిన మంత్రి గౌతమ్ రెడ్డి. 


జిల్లా మంత్రుల సమీక్షలో  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్, మరో జాయింట్ కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్  దినేష్ కుమార్, గూడూరు సబ్ కలెక్టర్  ఆర్. గోపాల కృష్ణ, నోడల్ అధికారులు, టాస్క్ ఫోర్సు అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇతర  నెల్లూరు జిల్లా అధికారులు పాల్గొన్నారు..


Comments