విజయవాడ (ప్రజా అమరావతి);
ఆక్సిజన్ వినియోగం -- పూర్తి స్థాయిలో పర్యవేక్షణ
24 x 7 అధికారులు, సిబ్బంది తో సమన్వయం
కృష్ణ జిల్లా ఆక్సిజన్ వార్ రూమ్ పనితీరును పరిశీలించిన మంత్రులు
కృష్ణా జిల్లాలో ఆక్సిజన్ వినియోగంపై నిశితంగా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు.
శనివారం జాయింట్ కలెక్టర్ కార్యాలయం లోని ఆక్సిజన్ వార్ రూమ్ ను కలెక్టర్, జేసి లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని వెంకట్రామయ్య మాట్లాడుతూ, జిల్లాలో నే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత లేకుండా జిల్లా కలెక్టర్ లు పోటీ తత్వం తో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మిగిలిన జిల్లాలో అమలు చేస్తున్న ఉత్తమ కార్యచరణ ప్రణాళికలను తమ జిల్లాలో అమలు చేస్తూ, కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారన్నారు. కోవిడ్ స్ట్రెయిన్ వల్ల ఎక్కువ మంది ఆక్సిజన్ కోసం ఆందోళన పడుతుంటే, వాటిని తొలగించె దిశలో ఆక్సిజన్ బెడ్స్ పెద్ద ఎత్తున అందుబాటులో కి తీసుకు రాగలిగా మన్నారు. ఆక్సిజన్ కొరత, వృధా కాకుండా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తు, రోగులకు అవగాహనా కల్పించడం చేస్తున్నామని తెలిపారు. సగటున రోజుకు ఎంత ఆక్సిజన్ అవసరం ఉంటుంతుంది అనే వాటిపై అంచనాలు వేసుకుని, సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు, వారిలో ఆక్సిజన్ అందిస్తున్న వివరాలు ఆధారంగా ఆక్సిజన్ వాడకంపై ఆడిట్ చేస్తున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఎక్కడ స్థాయి కి మించి ఎక్కువ వినియోగించారో తెలుసుకుని, అక్కడ సిబ్బంది తో పాటు చికిత్స పొందుతూన్న వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆక్సిజన్ వినియోగంలో లీకులు, వృధా కాకుండా చెయ్యడం జరిగింది. ఇంకా ఎక్కడైనా లోపాలు ఉంటే ఆయా ఆసుపత్రులకు హెచ్చరికలు చేసేందుకు ఒక టీం అటువంటి వారికి తెలుపుతూ నియంత్రణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
అనంతరం ఆక్సీజన్ వార్ రూమ్ రవాణా, రూట్ ట్రాకింగ్, ఆసుపత్రిలో ఆక్సీజన్ నిల్వలు, లిక్విడ్ ఆక్సిజన్, ఫిల్లింగ్ పాయింట్స్, ఆసుపత్రి లకు అవసరం అయ్యే ఆక్సిజన్ వివరాలు, వంటి ప్రతి ఒక్క అంశం కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.
మంత్రి పేర్ని నాని తో పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని),
.
addComments
Post a Comment