కోవిడ్, కర్ఫ్యూ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, విజయోగదారుల పై ఎటువంటి దుష్ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నాం : మంత్రి కన్నబాబు
కోవిడ్ పరిస్థితుల్లో రైతులకు ఎటువంటి నష్టం రాకుడదని సీఎం ఆదేశించారు
వ్యవసాయ పనులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలి
కోవిడ్ వల్ల రైతు ఉత్పత్తుల ధరలు పడిపోకుండా చూడాలి
అమరావతి.(ప్రజా అమరావతి);... వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు మంత్రి కన్నబాబు. కోవిడ్, కర్ఫ్యూ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, విజయోగదారుల పై ఎటువంటి దుష్ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాయితీపై విత్తనాలు పంపిణి కార్యక్రమం, రబి 2020-21 పంట ఉత్పత్తి కొనుగోలు అంశాల పైన కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కోవిడ్ పరిస్థితుల్లో రైతులకు ఎటువంటి నష్టం రాకుడదని సీఎం ఆదేశించారని స్పష్టం చేశారు. వ్యవసాయ పనులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్ రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు ఆటంకాలు కలిగితే ప్రజలకు ఇబ్బంది అని ఆయన తెలిపారు. ఆ వాహనాలు ఇబ్బంది లేకుండా తిరుగెలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
సబ్సిడీ విత్తనాల సరఫరాకు ఎటువంటి రవాణా ఆటంకాలు తలేత్తకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా నిత్యావసర వస్తువులు రవాణాకు కూడా తగిన అనుమతులు కల్పించాలి ఆదేశించారు. రైతులకు అవసరమైన ఎరువులు, రసాయనాల దుకాణాలు కూడా సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కోవిడ్ వల్ల రైతు ఉత్పత్తుల ధరలు పడిపోకుండా చూడాలని, టమోటా ధరలు తగ్గకుండా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.
కర్ఫ్యూ నేపథ్యంలో పరిస్థితులు మారుతున్నాయని, ఎప్పటికప్పుడు పరిస్థితి ని సమీక్షించి చర్యలు చేపట్టాలన్నారు. మామిడికాయల రవాణాలో వచ్చే ఇబ్బందులను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసే పాసులు పోలీసులు కచ్చితంగా అనుమతించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే విధివిధానాలు కలెక్టర్ తో పాటు ఎస్పీలకి పంపాలని, తద్వారా అది క్రింది స్థాయి పోలీస్ అధికారులకు చేరడంతో ఎవరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. ఇవన్నీ చేస్తూనే ఇతర రాష్ట్రాల మండీలతో కూడా అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు మంత్రి. గుంటూరు, పలమనేరు, మదనపల్లి లాంటి పెద్ద మార్కెట్లలో ప్రత్యేక విధివిధానాలు ఖరారు చేసి ముందుకు సాగాలని సూచించారు. ఈ అంశాల తో పాటు మార్కెట్ల వికేంద్రీకరణ, ఆక్వా రైతుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై కూడా సమీక్ష లో ప్రస్తావించారు మంత్రి కన్నబాబు
ఈ సమీక్ష లో స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య, మార్కెటింగ్ స్పెషల్ సెక్రెటరీ మధుసూదన్ రెడ్డి, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment