కోవిడ్ కేర్ సెంటర్ ద్వారా వైద్యుల పర్యవేక్షణ లో వైద్య సేవలు



విజయవాడ (ప్రజా అమరావతి);


కోవిడ్ కేర్ సెంటర్ ద్వారా వైద్యుల పర్యవేక్షణ లో వైద్య సేవలు


కోవిడ్ బాధితులు నిర్లక్ష్యం వహించ వద్దు


సీసీసి ల ద్వారా ఆక్సీజన్ కాంసెంట్రేషన్స్ ఏర్పాటు


జిల్లాలో సీసీసి ల్లో వైద్య సేవలు పొంది డిచార్జీ ఐన వారికి నగదు పురస్కారం


ప్రతి సోమవారం విజేతలను ప్రకటిస్తాము..


కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్


జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ ల యందు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు అందుబాటులో ఉన్నారని కలెక్టర్ ఏఎండి. ఇంతియాజ్ తెలిపారు.


శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటన లో  జిల్లాలో ఏడు కోవిడ్ కేర్ సెంటర్ల ద్వారా ప్రజలకు మెరుగైన కోవిడ్ వైద్య సేవలు అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.  కోవిడ్ లక్షణాల స్థితి, మెడికల్  నివేదికలు ఆధారంగా వైద్య సేవలు అందించడం చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ బారిన పడిన వారు ఆసుపత్రిలో చేరి వైద్య సేవకు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఐతే సిసిసి ద్వారా వైద్య సేవలు పొంది రికవరీ ఐనా వారిని గుర్తించి, నగదు పురస్కారాన్ని అందజేయ్యడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా డిచార్జీ ఐన వారి నుంచి ముగ్గురిని లక్కీ డీప్ ద్వారా ప్రతి సోమవారం ప్రకటన చేస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. వారికి రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున నగదు పురస్కారాన్ని అందించనున్నామన్నారు.  సిసిసి కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం తో పాటు పౌష్టికాహారం, మందులు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అపోహలు వీడి జిల్లాలో మీకు అందుబాటులో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ ద్వారా వైద్య సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కేంద్రాల్లో ఆక్సిజన్ కాంసెంట్రేషన్స్ ఏర్పాటు చేసి, ఆక్సిజన్ కొరత వల్ల ఇబ్బందులు ఎదురవ్వకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.  కోవిడ్ బారిన పడిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వ్యహరించ వద్దన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే గూడవల్లి, జెఎన్ఎన్-యూఆర్ఎం , లేడీ అంప్తిల్, మచిలీపట్నం, జగ్గయ్యపేట వంటి 7 కేంద్రాల్లో సిసిసి వైద్య సేవలు . నూజివీడు త్రిబుల్ ఐటి నందు మరో  సిసిసి కేంద్రం అందుబాటులో రానున్నది అని తెలిపారు.


Comments