గూడూరు నుంచి ఆత్మకూరు నియోజకవర్గానికి ఆక్సిజన్ : మంత్రి మేకపాటిగూడూరు నుంచి ఆత్మకూరు నియోజకవర్గానికి ఆక్సిజన్ :  మంత్రి మేకపాటి*ప్రతీరోజూ 100 సిలిండర్లు  తెచ్చుకునే ఏర్పాట్లు*


*విశాఖ మెడ్ టెక్ జోన్ నుంచి నెల్లూరు జిల్లాకు ఇంకో రెండు రోజుల్లో 10-15 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు*


*ఆత్మకూరు టిడ్కో క్వారంటైన్ సెంటర్ లో 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశం*


*ఆత్మకూరు ఏరియా ఆసుపత్రి, టిడ్కో కోవిడ్  సెంటర్ లలో కొరత ఉన్న ఎంఎన్వో, సహాయక సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేసేలా చూడాలని ఆర్డీవోను  ఆదేశించిన మంత్రి మేకపాటి*


*వ్యాక్సిన్ ప్రక్రియ అర్హత ప్రాధాన్యతలను బట్టి జరుగుతున్న విధానాలను నమోదు చేయాలని సూచన*


*నియోజకవర్గంలో కోవిడ్ కేసుల నమోదు, తీవ్రత, మరణాలు, కారణాలను ఏరియా ఆసుపత్రి ఆర్ఎమ్వో ఉషాను అడిగి తెలుసుకున్న మంత్రి గౌతమ్ రెడ్డి*


*కోవిడ్ తో మరణించిన వారి అంతిమ సంస్కారాలు సహా వాహనాల ఏర్పాటు గురించి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుతో ఆరా*


*కోవిడ్ సోకినట్లు అనుమానం ఉన్న వారికి ప్రత్యేక వాహనాలలో పంపించి వారికి పరీక్షలు నిర్వహించి , ఇంటికి చేర్చి, ఫలితాలు వచ్చే వరకు బయట తిరగకుండా హోమ్ సొల్యూషన్ కి పరిమితం చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి దిశానిర్దేశం*


*డివిజన్ స్థాయి అధికారులతో నెల్లూరు జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వీడియో కాన్పరెన్స్*


*కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలు వెల్లడించని ప్రైవేట్ ల్యాబ్ లకు ప్రత్యేక మార్గదర్శకాలు ఇచ్చి వాటిని పాటించేలా చూసి అమలు చేయని పక్షంలో చర్యలు తీసుకోవడానికి వెనకాడవద్దని నియోజకవర్గ అధికార యంత్రాంగానికి ఆదేశాలు*


*రెమెడిసివిర్ ఇంజక్షన్ ఇవ్వడానికి అనుసరిస్తున్న మార్గదర్శకాలపై మంత్రి ఆరా*


*కోవిడ్ పై సమీక్ష అనంతరం నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాల గురించి సమీక్షించిన మంత్రి మేకపాటి*


*ఆత్మకూరు చెరువు(ట్యాంక్), బట్టేపాడు జంక్షన్ పార్కు, ఆత్మకూరు ఔటర్ రింగ్ రోడ్డు కు సంబంధించిన పనులపై పరిశీలన*


*సకల హంగులతో పార్కును అభివృద్ధి చేసి సుందరీకరణ గా మార్చేందుకు మంత్రి ప్రత్యేక దృష్టి*


*రూ.5కోట్ల సీఎస్ఆర్ నిధులు సమకూరుస్తామని, వాటితో పాటు నగర సుందరీకరణ పనులకు కేటాయించిన నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు 6 నెలల్లో పూర్తి అవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించిన పరిశ్రమల శాఖ మంత్రి*


*నగర సుందరీకరణ లో భాగంగా నియోజకవర్గంలో మొత్తంగా రూ.10 కోట్ల అభివృద్ధి పనుల లక్ష్యానికి దిశానిర్దేశం*


*నగర సుందరీకరణ పనుల నిధులతో పాటు పరిశ్రమల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ( సీఎస్ఆర్- కార్పొరేట్ సామాజిక బాధ్యత) నిధులు*


*మూడు ప్రాజెక్టులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ నమూనాలను పరిశీలించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*


*బట్టే పాడు జంక్షన్ పార్కులో చిన్నారులు ఆడుకోవడానికి, వాకింగ్ ట్రాక్, ఆహ్లాదకరమైన వాతావరణంలో తినే వీలుగా ఫుడ్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, వ్యాయామం చేసుకునే స్థలం,కళా ప్రదర్శన వేదిక, పార్కు నిండా నీడనిచ్చే పచ్చని చెట్లు, ఓ ఆలయం, కాలాన్ని బట్టి కాసే పండ్ల చెట్లు వంటి అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకోవాలని మంత్రి ఆదేశం*


*18కి.మీ మేర నిర్మించబోయే ఆత్మకూరు ఔటర్ రింగ్ రోడ్డు మణిహారంగా ఉండాలి*


*అవుటర్ రింగ్ రోడ్డు పొడవునా రెండు వైపుల మన స్థానికతను ఇనుమడింపజేసే చెట్లకు ప్రాధాన్యత*


ఆత్మకూరు, నెల్లూరు జిల్లా, మే 13 (ప్రజా అమరావతి):  ఆత్మకూరు డివిజన్ పరిధిలో ప్రస్తుతం ఆక్సిజన్ కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.  గురువారం ఆత్మకూరు డివిజన్ స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు కేంద్రంగా ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ తో పాటు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు అవసరమైన ఆక్సిజన్ సిలెండర్లను అదనంగా సమకూర్చేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లో గూడూరు మెడ్ టెక్ నుండి 100 ఆక్సిజన్ సిలెండర్లు ప్రతి రోజు రీఫిల్ చేసి తెచ్చుకునే విధంగా పరిశ్రమల శాఖ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఆక్సిజన్ కొరత లేకుండా ఉండాలంటే దాని వృధాను సైతం అధికారు తగ్గించాల్సిన అవసరం ఉందని వారికి  ఆదేశించారు.  ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలోని కోవిడ్ కేర్ సెంటర్ కు లాంటి ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని,  అధికారుల సమన్వయంతోనే ది సాధ్యమవుతుందని వివరించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఆర్డీఓ ఏ చైత్రవర్షిణిని ప్రతి రోజు నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల వివరాలు, డిశార్చి అవుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ కేర్ సెంటర్ లో ప్రస్తుతం జరగుతున్న వైద్య సహాయంపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా చూడాలని ఆదేశించారు.  ప్రస్తుతం కోవిడ్ రోగులకు అత్యవసరంగా కావాల్సిన రెమీడెసివర్ ఇంజెక్షన్లు అదనంగా ఉంచుకునేలా ఏర్పాటు చేసుకోవాలని ఆర్డీఓకు సూచించారు. డివిజన్ కు మరో 150 రెమీడెసివర్ ఇంజెక్షన్లు అవసరమవుతాయని ఆర్డీఓ తెలపడంతో వెంటనే  అందించే ఏర్పాటు చేస్తామని వారికి మంత్రి తెలిపారు. అనంతరం రెండవ విడత వ్యాక్సినేషన్ జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మర్రిపాడు మండలం కృష్ణాపురం, అనంతసాగరం, సీతారామపురం, ఉదయగిరి ప్రాంతాలలో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి రెండవ విడత త్వరతగతిన పూర్తి చేయాలని, అనంతరం ఒకటవ డోస్ వ్యాక్సిన్ వేసేందుకు సన్నధమవ్వాలని సూచించారు.  ఈ సందర్భంగా ఆర్డీఓ చైత్రవర్షిణి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బంది కొరత విషయమై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో కలెక్టర్ తో విషయమై ఇప్పటికే చర్చించామని, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  కరోనా మృతదేహాల ఖననం విషయంలో నిధుల లేమి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు మంత్రి మేకపాటి దృష్టికి తీసుకురావడంతో కలెక్టర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చూస్తామన్నారు.  కోవిడ్ లక్షణాలు ఉన్న వారి అందరితో కలసి  ప్రభుత్వ, ప్రైవేట్ రవాణాల్లో తిరుగుతున్నారని, దీంతో కేసులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, దీనిపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు డిఎస్పీ కె వెంకటేశ్వరరావు మంత్రి మేకపాటిని కోరారు. స్పందించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెంటనే డివిజన్ వ్యాప్తంగా కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని సమీపంలో టెస్టింగ్ కేంద్రాలకు తరలించే విధంగా ప్రత్యేక కాల్ సెంటర్, వాహనాలను ఏర్పాటు చేయాలని ఆత్మకూరు ఆర్డీఓ చైత్రవర్షిణిని ఆదేశించారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వారు టెస్ట్ కు వచ్చిన అనంతరం వారి ఫలితాలు వచ్చేంత వరకు హోం ఐసోలేషన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రైవేట్ ల్యాబ్ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయడం లేదని, దీని వల్ల సమస్యలు వస్తున్నాయని కమిషనర్ రమేష్ బాబు తెలపడంతో అధికారులు సమన్వయం చేసుకుని ప్రైవేట్ ల్యాబ్ లపై గట్టి నిఘా ఉంచాలని,  ఆన్ లైన్ లో నమోదు చేయకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలని సూచించారు. కరోనా మరణాల విషయంలోనూ వైద్యాధికారులు 100 పడకల ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఉషాసుందరి, అభిరాం ఆసుపత్రి అధినేత డాక్టర్ కెవి శ్రావణ్ కుమార్ ను అడిగి వివరంగా తెలుసుకున్నారు. కోవిడ్ వచ్చిన వారు నిర్లక్ష్యం లేకుండా వెంటనే వైద్యాధికారులను స్పందించి వైద్యం చేయించుకునే విధంగా వైద్యసిబ్బంది పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కల్పించాలని సూచించారు.  ప్రస్తుతం కరోనా నివారణకు అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ నోడల్ అధికారి బాపిరెడ్డి,  మున్సిపల్ చైర్ పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ సర్థార్ లు ఉన్నారు.