కరోనా విపత్కర సమయంలో పరిశ్రమలు మరింత 'సామాజిక బాధ్యత' చాటాలి : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.



అమరావతి (ప్రజా అమరావతి).


కరోనా విపత్కర సమయంలో  పరిశ్రమలు మరింత 'సామాజిక బాధ్యత' చాటాలి : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


ఆత్మకూరు చేరుకున్న మరో వంద మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు: మంత్రి మేకపాటి.


ఇటీవల ఆత్మకూరు నియోజకవర్గానికి 100 ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చిన డీఆర్ డీవో ఛైర్మన్.


సీఎస్ఆర్ నిధుల ద్వారా చెరో 50 ఆక్సిజన్ సిలిండర్లను ఆత్మకూరు నియోజకవర్గానికి పంపిన ఏషియన్ పెయింట్స్,ఆర్‌వీఆర్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థలు.


కష్ట కాలంలో సాయానికి ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అభినందనలు.


అడిగిన వెంటనే స్పందించి సహకరించిన డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డికి కృతజ్ఞతాభినందనలు.


ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని మంత్రి పిలుపు.


ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ డీఆర్ డీఈవో ఛైర్మన్ సాయం  కోరడం , సామాజిక బాధ్యత నిధుల కింద సహకరించాలని  మంత్రి మేకపాటి ఉత్తరం రాసి తెప్పిచడంతో విశాఖ నుంచి మెట్ట ప్రాంతానికి చేరిన సిలిండర్లు.


పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మంత్రిగారి పిలుపు మేరకు ఇప్పటికే సాయానికి ముందుకొచ్చిన డీఆర్‌డీవో, ఏషియన్‌ పెయింట్స్,ఆర్‌వీఆర్‌ ప్రాజెక్ట్స్‌ సహా కాల్గేట్‌ పామాయిల్, , జిందాల్‌ స్టీల్, దాల్మియా సిమెంట్స్, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌), అర్జాస్‌ స్టీల్,  వంటి అనేక సంస్థలు.


కోవిడ్‌ నియంత్రణ, చికిత్సలో కార్పొరేట్‌ సంస్థలను భాగస్వాములను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం  ప్రయత్నాలు.


 కరోనా నియంత్రణ కోసం అందించే వైద్య సంబంధిత సేవలకు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్‌) ఫండ్‌ నిధులను వినియోగించుకోవడానికి కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ అనుమతి ఇచ్చింది.


ప్రజలను ఆదుకోవడం కోసం  రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్‌ కంపెనీలు 'సీఎస్‌ఆర్‌'లో భాగంగా వైద్య సేవల్లో పాలుపంచుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిన ఏపీ ఎకనావిుక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఏపీఈడీబీ).


ఆక్సిజన్‌ యూనిట్ల నిర్వహణ కూడా..జిల్లాలవారీగా కోవిడ్‌ చికిత్స కోసం అవసరమైన ఆక్సిజన్, కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు,పడకల సంఖ్య వంటి అన్ని వివరాలను సేకరిస్తున్న ఏపీఈడీబీ.

 

కొన్ని జిల్లాల్లో ఆక్సిజన్‌ యూనిట్లు ఏర్పాటు చేసి.. వాటి నిర్వహణను కూడా ఆయా కంపెనీలకే అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం.


ప్రస్తుత సంక్షోభంలో కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని ఈడీబీ.. ఇప్పటివరకు 500కు పైగా కంపెనీలకు లేఖలు రాయగా పలు కంపెనీలు ముందుకొచ్చాయి.


వారం క్రితం వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పినట్లుగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇప్పటికే ఆత్మకూరు నియోజకవర్గానికి 200 ఆక్సిజన్‌ సిలిండర్ల అందజేత.

 

 ఒడిశాలోని అంగుల్‌లో ఉన్న ఫ్యాక్టరీ నుంచి ఏపీకి ట్యాంకర్‌ ద్వారా ఏప్రిల్‌ 24 నుంచి రోజూ 20 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. ఆక్సిజన్‌ కొరత తీరే వరకు సరఫరా చేస్తామని కంపెనీ యాజమాన్యం హామీ ఇచ్చింది.


విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో కోవిడ్‌ చికిత్స కోసం ఆక్సిజన్‌తో కూడిన 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తోంది. మే 15 నాటికి అదనంగా మరో 150, మే 30 నాటికి 250, జూన్‌ నాటికి 600 పడకలు అందుబాటులోకి తెచ్చే విధంగా విశాఖ స్టీల్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది.


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు 100 ఆక్సిజన్‌ సిలిండర్లను అందించడంతోపాటు అనంతపురం జిల్లాలో ఒక ఆక్సిజన్‌ యూనిట్‌ను విశాఖ స్టీల్ ఏర్పాటు చేస్తోంది.


ఏషియన్ పెయింట్స్ సంస్థ ..50 ఆక్సిజన్‌ సిలిండర్లను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో అందజేసింది.*


విశాఖ లోని ఆర్‌వీఆర్‌ ప్రాజెక్ట్స్ సంస్థ 50 ఆక్సిజన్‌ సిలిండర్లను ఆత్మకూరు నియోజకవర్గానికి అందించింది.


ఓయో' సంస్థ కోవిడ్‌ నియంత్రణలో ముందుండి పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ విశ్రాంతి కోసం ఉచితంగా తమ హోటల్‌ గదులను వినియోగించుకోవడానికి అనుమతించింది.


ఈ కరోనా విపత్తును ఎదుర్కోవడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలి.



Comments