వ్యాక్సిన్‌కు ఆర్డర్లు పెట్టని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం..

 అమరావతి (ప్రజా అమరావతి):  వ్యాక్సిన్‌కు ఆర్డర్లు పెట్టని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. కేం


ద్రానికి కేవలం లేఖలు రాయడం వల్ల వ్యాక్సిన్ సరఫరా చేస్తారా? అని  తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. సోమవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీరం, భారత్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్‌లో.. 50% రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చే విధంగా కేంద్రం విధానం చేసిందని చెప్పారు. కోట్ల డోసుల వ్యాక్సిన్ కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌కు పలు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్డర్లు ఇచ్చాయన్నారు. ఆయా రాష్ట్రాల్లో 18-45 ఏళ్ల వయసు వారికి  ఆయా ప్రభుత్వాలు వ్యాక్సిన్ అందిస్తున్నాయని తెలిపారు. ‘నేను వ్యాక్సిన్ ఇప్పిస్తే వేస్తామనడం జగన్ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. నేను టీకా తెప్పిస్తే మరి మీరెందుకు సీఎంగా ఉండటం?’అని ప్రశ్నించారు. వ్యాక్సిన్ కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేయలేరా? అని ప్రశ్నించారు. టీకా కోసం కేటాయించిన రూ.45 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? అని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారుప్రజల ప్రాణాలంటే జగన్‌మోహన్ రెడ్డికి లెక్కలేనితనంగా ఉందన్నారు. ప్రతిపక్షాలపై కుట్రలు ఆపి వ్యాక్సిన్ కోసం ఆర్డర్లు పెట్టాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో 10 వేల ఎకరాల అసైన్ మెంట్ భూములను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను తెరిచి పేదల ఆకలి బాధ తీర్చాలని తెలిపారు. కరోనా బాధితులకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే 500మందికి పైగా వైద్య సేవలు అందించామని ప్రకటించారు. కరోనా దెబ్బకు గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image