ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష:


అమరావతి (ప్రజా అమరావతి);


ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష:


*యూనివర్సిటీలలో అన్ని ప్రమాణాలు పెరగాలి*

*దేశంలో టాప్‌ టెన్‌లో మన యూనివర్సిటీలు నిలవాలి*

*ఆ మేరకు కార్యాచరణ రూపొందించండి*

*ఐఐటీల స్థాయిలో ట్రిపుల్‌ ఐటీలు ఉండాలి*

*ఆ విధంగా విద్యా సంస్థలను తీర్చి దిద్దండి*

*సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశం*

*విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం*

*ఆ దిశలోనే పెద్ద ఎత్తున నాడు–నేడు కార్యక్రమం*

*విద్యార్థులకు మేలు చేసేలా ప్రమాణాలు పెంచాలి*

*ఉన్నత విద్యపై సమీక్షలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌*


నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో  యూనివర్శిటీలను ఉన్నత స్థానానికి తీసుకెళ్లడంపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ప్రమాణాలను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు.


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..*:


*కార్యాచరణ రూపొందించండి:*

జేఎన్టీయూ రెండు యూనివర్సిటీలు (కాకినాడ, అనంతపురం), ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీతో పాటు, ట్రిపుల్‌ ఐటీలను ఇప్పడున్న పరిస్థితి నుంచి మెరుగైన పరిస్థితిలోకి తీసుకువెళ్లడంపై కార్యాచరణ రూపొందించండి.

ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎన్ని నిధులు అవసరమో చెప్పండి.

కడపలో రానున్న ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి.

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో ఏయూ ప్రస్తుతం 19వ స్థానంలోనూ, ఎస్వీ యూనివర్సిటీ 38వ స్థానంలోనూ ఉన్నాయి.

రెండేళ్లలో వీటి స్థానాలు గణనీయంగా మెరుగుపడడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టండి.


*ప్రతిభావంతుల ఎంపిక:*

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో ఉత్తమ స్థానాల్లో ఉన్న యూనివర్సిటీలలో పద్ధతులను అధ్యయనం చేయండి.

మౌలిక సదుపాయాలు, బోధనా పద్ధ్దతులు, బోధనా సిబ్బంది తదితర అంశాల్లో తీసుకోవాల్సిన పద్దతులపై దృష్టి పెట్టండి:

ప్రతిభ ఉన్న వారినే యూనివర్సిటీల్లో బోధనా సిబ్బందిగా నియమించాలి.

ప్రతిభావంతులను ఎంపిక చేయడానికి తగిన చర్యలు తీసుకోండి.

రిక్రూట్‌మెంట్‌ కోసం పటిష్టమైన పద్దతులను రూపొందించండి.


*విదేశీ వర్సిటీలతో భాగస్వామ్యం*:

విదేశాల్లోని అత్యుత్తమ యూనివర్సిటీల పద్దతులను, విధానాలను కూడా అధ్యయనం చేసి వాటిని మన యూనిర్సిటీల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.

వారి పాఠ్య ప్రణాళికలను ఇక్కడ అనుసంధానం చేసుకోవడంపైనా దృష్టి పెట్టాలి.

బోధనతో పాటు, కోర్సులకు సంబంధించి విదేశీ వర్సిటీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోండి.


*ట్రిపుల్‌ ఐటీలపైనా సీఎం సమీక్ష*:

ట్రిపుల్‌ ఐటీల్లో ప్రస్తుతం 22,946 మంది విద్యార్థులు.

శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్‌ ఐటీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి: సీఎం

గత ప్రభుత్వ హయాంలో ట్రిపుల్‌ ఐటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.

ట్రిపుల్‌ ఐటీలకు సంబంధించి రూ.180 కోట్లకు పైగా నిధులను మళ్లించారు. 

మళ్లీ ట్రిపుల్‌ ఐటీలు మెరుగు పడాలి. ఇప్పుడున్న మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి:

దీని కోసం కార్యాచరణ రూపొందించండి:

ట్రిపుల్‌ ఐటీల్లో మంచి బిజినెస్‌ కోర్సులను ప్రవేశపెట్టడంపైనా దృష్టి పెట్టండి:

ఈ కోర్సులు అత్యుత్తమంగా ఉండాలి:

ఇంజినీరింగ్‌ కోర్సులు కూడా మంచి నైపుణ్యం ఉన్న మానవవనరులను అందించేలా చూడాలి:


*వైద్య విద్య*:

రాష్ట్రంలో ఇప్పటివరకూ 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా మరో 16 మెడికల్‌ కాలేజీలను తీసుకువస్తున్నాం.

మెడికల్‌ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగబోతోంది.

ఆ కాలేజీలను మెరుగ్గా నిర్వహించడానికి చక్కటి విధానాలు పాటించాలి.

ఆ కాలేజీల్లో 70 శాతం సీట్ల కన్వీనర్‌ కోటాలోనూ, మిగిలిన 30 శాతం సీట్లు పేమెంటు కోటాలో ఉండేలా ఆలోచన చేయండి.

సీట్ల సంఖ్య పెరుగుతుండడంతో పేద విద్యార్థులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయి:

అంతే కాకుండా ప్రతి కాలేజీ కూడా స్వయం సమృద్ధితో నడుస్తుంది. దీంతో నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.


*ఈ వ్యవస్థలు బాగుండాలి*:

విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ బాగు పడాలనే తపనతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.

అందు కోసం పెద్ద ఎత్తున నాడు–నేడు కార్యక్రమం అమలు చేస్తున్నాం.

ఈ సంస్థలన్నింటినీ అత్యుత్తమంగా నడుపుకునేలా చక్కటి విధానాలను తీసుకురావాలి:

వీటన్నింటిపైనా అధికారులు మూడు, నాలుగు సార్లు సమావేశమై విధానాలు రూపొందించాలి.

అదే విధంగా సంస్కరణలు తీసుకు రావాలి. ఆ మేరకు అవసరమైన బిల్లులను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలి.

ఇంకా గ్రామ సచివాలయాల సిబ్బందికి ఇచ్చే శిక్షణను ట్రిపుల్‌ ఐటీలతో కలిసి నిర్వహించాలి.

ఉపాధ్యాయులకు శిక్షణ కార్యాక్రమాలను కూడా ట్రిపుల్‌ ఐటీలు నిర్వహించాలని సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నిర్దేశించారు.


విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) ఛైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, ఆర్‌జీయూకేటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కెసి రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image