శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం, శ్రీకాళహస్తి (ప్రజా అమరావతి);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ దృష్ట్యా తేది.11.06.2021 నుండి మధ్యాహ్నం 2.00 గం.ల వరకు ప్రభత్వము వారు కర్ఫ్యూ సడలించి నందున దేవస్థానమునకు వచ్చు భక్తుల సౌకర్యం కొరకు తేది 11.06.2021 నుండి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం లో covid 19 నిబంధనలకు లోబడి మరియు భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆలయ దర్శన సమయంలో మార్పు చేయడమైనది. భక్తుల కోరిక మేరకు ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు. యదావిధిగానే భక్తులను దర్శనమునకు అనుమతించ బడును మరియు ఉదయం 6.00 గం.ల నుండి మధ్యాహ్నం 1.30 గం.ల వరకు రాహు కేతు పూజలకు భక్తులను అనుమతించబడును. మిగిలిన అన్ని ఆర్జిత సేవలన్నియు కోవిడ్ నిబంధనల మేరకు ఏకాంతముగానే నిర్వహించ బడును. ఆర్జిత సేవలలో భక్తులకు అనుమతి లేదు. అదేవిధముగా ఈ కోవిడ్ సందర్భములో భక్తుల ఆరోగ్యం దృష్ట్యా మరియు భక్తుల సౌకర్యం కొరకు శ్రీయుత దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు దేవాదాయ శాఖ కమీషనరు గార్ల సూచనల మేరకు online లో పరోక్ష పద్ధతి https://tms.ap.gov.in/User/os/SevaParoksha ద్వారా భక్తులు పూజలు జరిపించుకొనుటకు రాహు కేతు పూజతో సహా 12 రకములైన సేవలను ప్రవేశ పెట్టియున్నారు. భక్తులందరూ ఈ online సేవల ద్వారా వారికి కావలసిన సేవలకు అవసరమైన రుసుమును https://tms.ap.gov.in/User/os/SevaParoksha ద్వారా చెల్లించి వారి పేరు మరియు గోత్ర నామములతో పూజలు జరిపించుకొను విధముగా ఏర్పాట్లు చేయబడినది. పరోక్ష సేవలకు సంబంధించిన వివరములు దేవస్థానం ఫోన్. 08578-222240 ద్వారా తెలుసుకొనవచ్చును. ఈ విషయమును ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది ద్వారా భక్తులకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము.
కార్యనిర్వహణాధికారి
శ్రీకాళహస్తి దేవస్థానం
addComments
Post a Comment