కోవిడ్ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
అమరావతి (ప్రజా అమరావతి);
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే..:*
–ఏపీలో కర్ఫ్యూ జూన్ 20వరకూ పొడిగింపు
–కోవిడ్‌పై సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్ జగన్ నిర్ణయం
–జూన్10 తర్వాత కర్ఫ్యూ సడలింపు సమయం పొడిగిస్తూ నిర్ణయం
–ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపు
–కార్యాలయాలలో పనివేళలు ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటలవరకూ
–కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్న సీఎం
–పాజిటివిటీ రేటు తగ్గేంతవరకూ, పరిస్థితి అదుపులోకి వచ్చేంతవరకూ అధికార యంత్రాంగం అలసత్వం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం
*థర్డ్‌వేవ్‌పై ప్రభుత్వ సన్నద్ధత:*
కోవిడ్ మూడో వేవ్‌పై సీఎం శ్రీ వైయస్.జగన్ సమగ్ర సమీక్ష
మూడో వేవ్‌పై అనాలసిస్, డేటాలను సీఎంకు వివరించిన అధికారులు
థర్డ్‌వేవ్ వస్తేకనుక పిల్లలకు అందించాల్సిన అంశంపై సమావేశంలో చర్చ
థర్డ్ వేవ్ వస్తుందా? లేదా? అన్నదానిపై శాస్త్రీయ నిర్ధారణ లేదని వెల్లడించిన అధికారులు
అయినా ఒకవేళ వస్తే కనుక తలెత్తే పరిణామాలు, ప్రభావితమయ్యే వారి వివరాలపై అంచనాలను ముఖ్యమంత్రికి వివరించిన సీఎం
ఈ నేపథ్యంలో పోషకాహార కార్యక్రమం కొనసాగాలని, టీకాల కార్యక్రమం కూడా కొనసాగించాలన్న అధికారులు
వినియోగించాల్సిన మందులు, పరికరాలు, బయోమెడికల్ ఎక్విప్‌మెంట్, తదితర అంశాలపైకూడా చర్చ
*థర్డ్‌వేవ్‌పై సీఎం ఆదేశాలు:*
ఒకవేళ థర్డ్‌వేవ్‌కనుక వస్తే పిల్లల్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది, తీవ్రత ఏ రకంగా ఉంటుందన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్న సీఎం
పీడియాట్రిక్ సింప్టమ్స్‌ను గుర్తించడానికి ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలన్న సీఎం
ఈమేరకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం
*టీచింగ్ ఆస్పత్రులు-పీడియాట్రిక్ వార్డులు*
అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయాలన్న సీఎం
పిల్లలకు అత్యుత్తమ వైద్యం అందించడానికి వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధిచేయాలని ఆదేశాలు
జాతీయ ప్రమాణాలను అనుసరించి పీడియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేయాలి:
పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులను పరిశీలించి అవకాశం ఉన్నచోట పిల్లలకు చికిత్స అందించాలన్న సీఎం
థర్డ్‌వేవ్ వస్తుందనే అనుకుని కావాల్సిన మందులను ముందే తెచ్చి పెట్టుకోవాలని ఆదేశాలు
అప్పటికప్పుడు మందులు కావాలంటే దొరకవు, ముందుగానే కావాల్సిన నాణ్యమైన మందులను తెచ్చుకోవాలని, డాక్టర్లను గుర్తించాలన్న సీఎం
వారిని రిక్రూట్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం
అలాగే ప్రస్తుతం సంపూర్ణ పోషణ్ కింద డ్రైరేషన్ సవ్యంగా ఇస్తున్నామా? లేదా?అలాగే గోరుమద్దకింద కూడా డ్రైరేషన్ సవ్యంగా ఇస్తున్నామా? లేదా? అన్నదానిపై పర్యవేక్షణ చేయాలన్న సీఎం
ఇవన్నీ సక్రమంగా చేసుకుని ముందుకు వెళ్తే... మనం ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంటామన్న ముఖ్యమంత్రి
పిల్లలకు వైద్యం అందించాల్సిన ఆస్పత్రులను ముందుగానే ఎంపానెల్ కోసం గుర్తించాలని సీఎం ఆదేశాలు
ప్రైవేటు టీచింగ్ ఆస్పత్రులకు కూడా థర్డ్‌వేవ్‌పై సమాచారం ఇచ్చి సన్నద్ధంచేయాలన్న సీఎం
ఆస్పత్రుల వారీగా ఏర్పాటు చేయదలచిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లపై కూడా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
వీటికి సంబంధించి జరుగుతున్న పనులపై తనకు ఎప్పటికప్పుడు నివేదించాలన్న సీఎం
*చిన్న పిల్లల కోసం మూడు నూతన ఆస్పత్రులు:*
చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి రాష్ట్రంలో మూడు కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు
అత్యుత్తమ పీడియాట్రిక్ కేర్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టిపెట్టాలన్న సీఎం
ఒకటి వైజాగ్‌లో, రెండోది కృష్ణా–గుంటూరు ప్రాంతంలో, మూడోది తిరుపతిల్లో అత్యుత్తమ పీడియాట్రిక్ కేర్‌సెంటర్‌లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం
దాదాపు రూ.180 కోట్ల చొప్పున ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధంచేయాలన్న సీఎం
*రాష్ట్రంలో మరింత తగ్గుముఖం పట్టిన కేసులు:*
- రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న కోవిడ్ కేసుల సంఖ్య
– పాజిటివిటీ రేటు 10.73శాతానికి తగ్గుదల, మే 16న ఇది 25.56శాతం
– యాక్టివ్ కేసులు 1.23లక్షలకు తగ్గుదల, మే 17న యాక్టివ్ కేసులు 2.11లక్షలు.
– రికవరీ రేటు 92.33శాతానికి చేరిక,
– జూన్ 6న నాటికి అందుబాటులోకి 1753 బెడ్లు. మే 15న కేవలం 380 బెడ్లు మాత్రమే అందుబాటులో.
– ప్రస్తుతంఅందుబాటులో ఆక్సిజన్ బెడ్లు 8701. మే 17 న కేవలం 433 మాత్రమే అందుబాటులో ఉన్న బెడ్లు.
– ప్రస్తుతం అందుబాటులోని సాధారణ బెడ్లు 11,125. మే 15న కేవలం 4978 మాత్రమే అందుబాటులో.
– అన్ని జిల్లాల్లోనూ తగ్గుముఖం పట్టిన కేసులు.
– హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు 90,553
– 104కు జూన్ 6న వచ్చిన కాల్స్ కేవలం 2,462 మాత్రమే. మే 3న 19,175 కాల్స్.
– బ్లాక్ ఫంగస్ కేసులు 1551 కేసులు. 98 మంది బ్లాక్‌ఫంగస్‌తో మృతి. మిగిలిన వారికి చికిత్స.
ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఛైర్‌పర్సన్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం.టీ.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ మరియు వాక్సినేషన్) ఎం.రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జ్ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ.మల్లిఖార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఏపీ హెల్త్ సిస్టం స్ట్రెంగ్తనింగ్ ప్రాజెక్టు (ఏపీహెచ్‌ఎస్‌ఎస్‌పి) ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఆయుష్ కమిషనర్ వి.రాములుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.
addComments
Post a Comment