2 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను జాయింట్ కలెక్టర్ కు వితరణ చేసిన జిఎం మాడ్యులర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు

 


2 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను జాయింట్ కలెక్టర్ కు వితరణ చేసిన జిఎం మాడ్యులర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు 


జిఎం మాడ్యులర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులను అభినందించిన జాయింట్ కలెక్టర్ :-కర్నూలు, జూన్ 9 (ప్రజా అమరావతి);  


జిఎం మాడ్యులర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ రమేష్ జైన్ ఆదేశాల మేరకు ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ వారి చాంబర్లో ప్రస్తుత కోవిడ్ సమయంలో చాలామంది ఆక్సిజన్ తో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ సంస్థ తరఫున ఐదు లీటర్ల సామర్థ్యం, ఒక లక్ష 36 వేల విలువగల 2 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ్ సుందర్ రెడ్డి వారికి వితరణ చేశారు.


జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ జిఎం మాడ్యులర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు 2 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను వితరణ చేయడం చాలా అభినందించదగ్గ విషయమని వారు కొనియాడారు.


ఈ కార్యక్రమంలో జిఎం మాడ్యులర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు కే. శ్రీనివాసులు, డీలర్స్ కే. శ్రీనివాస్ రెడ్డి, దినేష్, మగన్ తదితరులు పాల్గొన్నారు.Comments