ఈ నెల 3న వర్చువల్ పద్ధతిలో నన్నూరు జగనన్న హౌసింగ్ కాలనీలో ఇంటి నిర్మాణం పనులను ప్రారంభించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిఈ నెల 3న వర్చువల్ పద్ధతిలో నన్నూరు జగనన్న హౌసింగ్ కాలనీలో ఇంటి నిర్మాణం పనులను ప్రారంభించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి :-


నన్నూరు గ్రామం జగనన్న హౌసింగ్ కాలనీ ఇంటి నిర్మాణం పూజా కార్యక్రమానికి హాజరు కానున్న జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రులు, ఎంపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు :-


కర్నూలు, జూన్ 02 (ప్రజా అమరావతి);


నవరత్నాల పథకాల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణ పనులలో భాగంగా ఈ నెల 3వ తేదీ వర్చువల్ విధానంలో పాణ్యం నియోజకవర్గం, ఓర్వకల్లు మండలం, నన్నూరు గ్రామం జగనన్న హౌసింగ్ కాలనీలో ఇంటి నిర్మాణ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.


జిల్లా వ్యాప్తంగా జగనన్న హౌసింగ్ కాలనీలో 631 లేఅవుట్ లలో 98,388 ఇళ్లను నిర్మించడానికి తలపెట్టారు. ఈ నిర్మాణాలకు సంబంధించి మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు మ్యాపింగ్ 90,673, జియో ట్యాగింగ్ 58,697 రిజిస్ట్రేషన్స్ 71,441 గృహాలకు పూర్తి చేశారు. ఇప్పటికే జిల్లాలోని వివిధ కాలనీల్లో 9,646 గృహల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆయా కాలనీలలో గృహాలు నిర్మించుకునేందుకు లేఅవుట్ ల్లో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు బోర్లు వేసి, త్రాగు నీటి సదుపాయం కల్పించారు.


నన్నూరు జగనన్న హౌసింగ్ కాలనీ :-


గృహ నిర్మాణ పనులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, ఓర్వకల్లు మండలం, నన్నూరు గ్రామం జగనన్న హౌసింగ్ కాలనీలో ముఖ్యమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ లైవ్ కార్యక్రమాన్ని లబ్ధిదారులు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. నన్నూరు గ్రామ సమీపం జగనన్న హౌసింగ్ కాలనీ లేఔట్ లో 478 ఇళ్ల నిర్మాణ పనులు తల పెట్టనున్నారు. హౌసింగ్ కాలనీలో ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు త్రాగునీటి సదుపాయం కల్పించారు. ఈ నిర్మాణాలకు సంబంధించి మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు మ్యాపింగ్ 478, జియో ట్యాగింగ్ 478, రిజిస్ట్రేషన్స్ 459 గృహాలకు పూర్తిచేశారు.


ఈ నెల 3వ తేదీ నన్నూరు జగనన్న హౌసింగ్ కాలనీ ఇంటి నిర్మాణం పూజా కార్యక్రమానికి హాజరు కానున్న జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రులు, ఎంపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు.