రాష్ట్రవ్యాప్తంగా 40.34 లక్షల కుటుంబాలకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేశాం- రాష్ట్రవ్యాప్తంగా 40.34 లక్షల కుటుంబాలకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేశాం 


- నిత్యావసరాల వంపిణీ ప్రక్రియ 27.31 శాతం పూర్తి 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 


గుడివాడ, జూన్ 5 (ప్రజా అమరావతి): రాష్ట్రవ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించి ఇప్పటి వరకు 40 లక్షల 34 వేల 535 బియ్యం కార్డుదారులకు ఉచితంగా నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని పంపిణీ చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. గత మే నెల్లో బియ్యం కార్డులున్న కుటుంబాల్లో ఒక్కో సభ్యుడికి 10 కేజీలు చొప్పున బియ్యాన్ని పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 47 లక్షల 73 వేల 660 బియ్యం కార్డులు ఉన్నాయని తెలిపారు. గత ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ఆంక్షల కారణంగా పేదలు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశ్యంతో 16 విడతలుగా నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేశామన్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మరోసారి ఉచితంగా మే, జూన్ నెలల్లో నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా కర్నూలు జిల్లాలో మొత్తం 12 లక్షల 18 వేల 884 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 64 వేల 457 కార్డులకు ఉచితంగా బియ్యాన్ని సరఫరా చేశామని తెలిపారు. అలాగే ప్రకాశం జిల్లాలో మొత్తం 9 లక్షల 99 వేల 724 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 2 లక్షల 89 వేల 795 కార్డులకు, పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 12 లక్షల 45 వేల 356 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 52 వేల 345 కార్డులకు, వైఎస్సార్ కడప జిల్లాలో మొత్తం 8 లక్షల 16 వేల 930 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 2 లక్షల 26 వేల 912 కార్డులకు, చిత్తూరు జిల్లాలో మొత్తం 11 లక్షల 59 వేల 252 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 2 లక్షల 96 వేల 395 కార్డులకు, విశాఖపట్నం జిల్లాలో మొత్తం 12 లక్షల 75 వేల 895 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 48 వేల 833 కార్డులకు, విజయనగరం జిల్లాలో మొత్తం 6 లక్షల 97 వేల 598 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు ఒక లక్షా 82 వేల 292 కార్డులకు, అనంతపూర్ జిల్లాలో మొత్తం 12 లక్షల 22 వేల 637 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 42 వేల 132 కార్డులకు, గుంటూరు జిల్లాలో మొత్తం 14 లక్షల 83 వేల 459 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 4 లక్షల 18 వేల 041 కార్డులకు, తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 16 లక్షల 48 వేల 507 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 4 లక్షల 02 వేల 744 కార్డులకు, కృష్ణాజిల్లాలో మొత్తం 13 లక్షల 01 వేల 929 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 83 వేల 412 కార్డులకు, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8 లక్షల 14 వేల 257 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు ఒక లక్షా 97 వేల 579 కార్డులకు, నెల్లూరు జిల్లాలో మొత్తం 8 లక్షల 89 వేల 232 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 2 లక్షల 29 వేల 598 కార్డులకు ఉచితంగా బియ్యాన్ని అందజేసినట్టు తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీ సక్రమంగా సాగుతోందన్నారు. కర్నూలు జిల్లాలో 29.90 శాతం, ప్రకాశం జిల్లాలో 28.99 శాతం, వైఎస్సార్ కడప జిల్లాలో 27.78 శాతం, అనంతపూర్ జిల్లాలో 27.98 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 28.29 శాతం, చిత్తూరు జిల్లాలో 25.57 శాతం, గుంటూరు జిల్లాలో 28. 18 శాతం, విజయనగరం జిల్లాలో 26.13 శాతం, విశాఖపట్నం జిల్లాలో 27.34 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 24.43 శాతం, కృష్ణాజిల్లాలో 29.45 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 24.26 శాతం, నెల్లూరు జిల్లాలో 25.82 శాతం పంపిణీ ప్రక్రియ పూర్తయినట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు.

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image