- రాష్ట్రవ్యాప్తంగా 84.87 లక్షల కుటుంబాలకు ఉచితంగా బియ్యం అందజేశాం
- నిత్యావసరాల పంపిణీ ప్రక్రియ 57.45 శాతం పూర్తి
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, జూన్ 10 (ప్రజా అమరావతి)
: రాష్ట్రవ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించి ఇప్పటి వరకు 84 లక్షల 87 వేల 960 బియ్యం కార్డుదారులకు ఉచితంగా నాణ్యమైన సార్టెక్స్ బియ్యం అందజేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 47 లక్షల 73 వేల 660 బియ్యం కార్డులు ఉన్నాయని, ఈ కార్డుల్లోని ఒక్కో కుటుంబ సభ్యుడికి గత మే, ప్రస్తుత జూన్ నెలల్లో 10 కేజీలు చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందజేయడం జరుగుతోందన్నారు. గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ఆంక్షల కారణంగా పేదలు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశ్యంతో 16 విడతలుగా నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేశామన్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మరోసారి నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా కర్నూలు జిల్లాలో మొత్తం 12 లక్షల 18 వేల 884 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 7 లక్షల 55 వేల 136 కార్డులకు ఉచితంగా బియ్యాన్ని సరఫరా చేశామని తెలిపారు. అలాగే ప్రకాశం జిల్లాలో మొత్తం 9 లక్షల 99 వేల 724 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 5 లక్షల 99 వేల 586 కార్డులకు, పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 12 లక్షల 45 వేల 356 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 7 లక్షల 28 వేల 510 కార్డులకు, వైఎస్సార్ కడప జిల్లాలో మొత్తం 8 లక్షల 16 వేల 930 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 4 లక్షల 73 వేల 041 కార్డులకు, చిత్తూరు జిల్లాలో మొత్తం 11 లక్షల 59 వేల 252 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 6 లక్షల 46 వేల 629 కార్డులకు, విశాఖపట్నం జిల్లాలో మొత్తం 12 లక్షల 75 వేల 895 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 7 లక్షల 32 వేల 784 కార్డులకు, విజయనగరం జిల్లాలో మొత్తం 6 లక్షల 97 వేల 598 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 93 వేల 914 కార్డులకు, అనంతపూర్ జిల్లాలో మొత్తం 12 లక్షల 22 వేల 637 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 7 లక్షల 27 వేల 448 కార్డులకు, గుంటూరు జిల్లాలో మొత్తం 14 లక్షల 88 వేల 459 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 8 లక్షల 76 వేల 642 కార్డులకు, తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 16 లక్షల 48 వేల 507 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 8 లక్షల 48 వేల 601 కార్డులకు, కృష్ణాజిల్లాలో మొత్తం 13 లక్షల 01 వేల 929 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 7 లక్షల 79 వేల 834 కార్డులకు, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8 లక్షల 14 వేల 257 బియ్యం కార్డులు ఉ ండగా ఇప్పటి వరకు 4 లక్షల 47 వేల 341 కార్డులకు, నెల్లూరు జిల్లాలో మొత్తం 8 లక్షల 89 వేల 232 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 78 వేల 503 కార్డులకు ఉచితంగా బియ్యాన్ని అందజేసి తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీ సక్రమంగా సాగుతోందన్నారు. కర్నూలు జిల్లాలో 61.95 శాతం, ప్రకాశం జిల్లాలో 59.97 శాతం, వైఎస్సార్ కడప జిల్లాలో 57.90 శాతం, అనంతపూర్ జిల్లాలో 59. 49 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 58.49 శాతం, చిత్తూరు జిల్లాలో 55.77 శాతం, గుంటూరు జిల్లాలో 59,09 శాతం, విజయనగరం జిల్లాలో 56 .46 శాతం, విశాఖపట్నం జిల్లాలో 57.43 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 51.47 శాతం, కృష్ణా జిల్లాలో 59.89 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 54. 93 శాతం, నెల్లూరు జిల్లాలో 53.81 శాతం పంపిణీ ప్రక్రియ పూర్తయినట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు.
addComments
Post a Comment