శ్రీవారికి అభిషేకానంతరం స్పెషల్ స్టోరి.

 శ్రీవారికి అభిషేకానంతరం స్పెషల్ స్టోరి.


       


       తిరుమల (ప్రజా అమరావతి);   శ్రీవారి స్వామివారి నొసటన ఉండే నామాలను  'తిరుమణికాప్పు' (ఊర్థ్వపుండ్రాలు)

అంటారు. 

 వారంలో లో ఒకసారి అంటే శుక్రవారం నాడు అభిషేకానంతరం శ్రీవారి నొసటన ఈ తిరుమణికాప్పు సమర్పిస్తారు. 

 దీనికి 16 తులాల పచ్చ కర్పూరం,

 1.5 తులాల కస్తూరి వినియోగిస్తారు. 


 కన్నులు పూర్తిగా కప్పబడినట్లుగా అలంకరించే ఈ తిరునామాలు మరలా గురువారం వరకు యథావిధిగా ఉండి, గురువారం నాటి నేత్ర దర్శనం సందర్భంగా సడలించబడతాయి.


 బ్రహ్మోత్సవాల ఆ సమయంలో మాత్రం ఈ నామం సమర్పణ రెట్టింపుగా ఉంటుంది.


 ప్రతి ఏటా 10 రోజుల

 (తొమ్మిది రోజులుగా వ్యవహారం) పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే శుక్రవారం నాడు - మధ్యలో వచ్చే శుక్రవారం నాడు - ముగింపు తర్వాత వచ్చే శుక్రవారం నాడు - 


ఇలా 3 లేదా 4 శుక్రవారాల్లో స్వామివారి నామాల అలంకరణ రెట్టింపుగా ఉంటుంది. 


ఇందుకుగాను ...

◆ 32 తులాల పచ్చకర్పూరం,

◆ 3 తులాల కస్తూరి వినియోగించబడుతుంది. 

అందువల్లే బ్రహ్మోత్సవ సమయాల్లో వచ్చే 3 లేదా 4 శుక్రవారాలను 'రెట్టింపు శుక్రవారాలు' అని తిరుమల ఆలయ సాంప్రదాయంలో ప్రతీతి.


 ఈ పచ్చకర్పూర నామం తిరుమల ఆలయంలో అనుసరించే వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం అలంకరిస్తారు.


 స్వామి వారి కృప మనందరిపై మెండుగా ఉండాలని కోరుకుంటూ...