విజయవాడ (ప్రజా అమరావతి);
*కరోనా తో మరణించినవారి అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం*
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కరోనా బారినపడి మరణించిన వారి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు వారి కుటుంబ సభ్యులకు అందించబడతాయని డియంహెచ్ఓ డా.యం.సుహాసిని ఒక ప్రకటన లో తెలిపారు.
కరోనా మూలంగా మరణించినట్లు సంబంధిత వైద్యుని ధృవీకరణ పిమ్మట వారి కుటుంబ సభ్యుల నామిని దారులకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు అందజేయబడుతుందన్నారు. దీనికిగాను వైద్యుడు ధ్రువీకరించిన మరణ ధ్రువీకరణ పత్రం,తహసీల్దార్ చే ధృవీకరించబడి మంజూరు చేయబడిన కుటుంబ సభ్యుల పత్రం తప్పనిసరి.
పై ధ్రువీకరణ పత్రాలను సంబంధిత సచివాలయ, ఆరోగ్య కార్యకర్తల ద్వారా సంబంధిత పి హెచ్ సి వైద్యాధికారి వారికి అందజేయాలన్నారు. వారి యొక్క బ్యాంకు ఖాతా నెంబరు ఐఎఫ్ఎస్ సి కోడ్ బ్యాంక్ పేరు మరియు బ్రాంచ్ వివరాలను జతపరిచి అందజేయాల్సి వుందన్నారు. ఈ విధంగా సమర్పించిన పత్రాలను సంబంధిత అధికారులు పరిశీలించి అర్హులైన వారి ఖాతాలోకి 15 వేల రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నారు. కావున బాధిత కుటుంబ సభ్యులు పైన పేర్కొన్న వివరములను గమనించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి సుహాసిని తెలియజేశారు.
addComments
Post a Comment