గుంటూరు (ప్రజా అమరావతి);
గుంటూరు కలెక్టరేట్ లో జరిగిన మూడవ విడత జగనన్న వాహన మిత్ర కార్యక్రమంలో హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మాత్యులు శ్రీమతి మేకతోటి సుచరిత గారు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యే లు ముస్తఫా, మద్దాలి గిరిధర్, నంబూరి శంకర్ రావు, బొల్లా బ్రహ్మనాయుడు, మేయర్ కావటి మనోహర్ నాయుడు, కలెక్టర్ వివేక్ యదవ్, జేసీ ప్రశాంతి, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మొదటగా గౌరవ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ వీడియో ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తరువాత గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలో లబ్ధిదారులకు వాహనాలను పంపిణీ చేశారు. హోం శాఖ మాత్యులు మేకతోటి సుచరిత గారు జండా ఊపి వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం
జరిగింది.
ఈ సందర్భంగా హోంమంత్రి గారు మాట్లాడుతూ.. సీఎం గారు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అర్హులైన వారికి వాహనాలు అందించారు. ఒక్క గుంటూరు జిల్లా లోనే 22,512 మంది లబ్ధిదారులకు వాహనాలను అందించడం జరిగింది. అర్హత ఉన్న వారు ఇంకా ఎవరైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోవాలని స్వయానా సీఎం గారే పేర్కొన్నారు. కరోనా విపత్కర సమయంలో కూడా ఇచ్చిన మాట ప్రకారం మూడవ విడత వాహన మిత్ర కార్యక్రమాన్ని సీఎం గారు పెద్ద మనస్సు తో ప్రారంభించారు. ఆటో నడుపుతున్న వారు మద్యం తగకుండా ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేసారు. ప్రతి ఒక్క ఆటో సోదరుడు సీఎం గారి విజ్ఞప్తి ని తప్పక పాటించాలని కోరుతున్నాను.
ఈ ఆటో లలో ప్రయాణిస్తున్న మహిళల రక్షణ కోసం అభయం అనే యాప్ ను రూపొందించడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు లక్ష ఆటో లలో అభయం అనే పరికరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఆపదలో ఉన్న మహిళా గట్టిగా అరిచినా కూడా ఈ పరికరం ఆక్టివేట్ అయ్యి పోలీసులకు సమాచారాన్ని అందిస్తుంది. ఇప్పయికే విశాఖపట్నం లో పైలట్ ప్రాజెక్టు కింద అభయం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కరోనా విపత్కర కాలం లో కూడా గొప్ప గొప్ప పథకాలకు శ్రీకారం చుడుతున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరం రుణపడి ఉండాలని హోంమంత్రి సుచరిత గారు స్పష్టంచేశారు.
addComments
Post a Comment