రామతీర్థం లోని శ్రీరాముల వారి ఆలయాన్ని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు

 విజయనగరం (ప్రజా అమరావతి);

 రామతీర్థం లోని శ్రీరాముల వారి ఆలయాన్ని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు



 మంత్రి వెంట ఆలయాన్ని దర్శించిన ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు, దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున రావు, ప్రత్యేక అధికారి భ్రమరాంబ


 ఆలయంలో పూజలు నిర్వహించిన మంత్రి వెలంపల్లి


మీడియాతో మాట్లాడిన మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు:


వచ్చే జనవరి నాటికి రామతీర్థం కొండపై రాముల వారి ఆలయ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తాం: దేవాదాయ మంత్రి వెలంపల్లి


 కొండపైన ఆలయ నిర్మాణానికి అవసరమైన వసతులు సమకూర్చి అనుకున్న సమయానికి ఆలయం పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నాం


 ఆగమ శాస్త్ర ప్రకారం పలువురు పండితులు, స్వామీజీ లను సంప్రదించి వారి సూచనలు, సలహాలు మేరకు శాస్త్రోక్తంగా రూ. 3 కోట్ల వ్యయంతో ఆలయాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పునర్నిర్మాణం చేస్తున్నాం: మంత్రి వెలంపల్లి


 చిలకలూరిపేట నుంచి రాతి పని వారిని రప్పించి పూర్తి రాతి కట్టడంగా రూపొందిస్తున్నాం


 రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను సిసి కెమెరాల పర్యవేక్షణలో వుంచి దేవాలయాల్లో భద్రతను పటిష్టం చేశాం


🔸 దేవాలయాల్లో భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం: మంత్రి వెలంపల్లి


🔸 రామతీర్థంలో నిర్మించనున్న ఆలయ నమూనా లను విడుదల చేసిన మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు

Comments