మూడో విడత వాహనమిత్ర కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)


అమరావతి (ప్రజా అమరావతి);


*వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ వాహనమిత్ర*


*మూడో ఏడాది వైఎస్సార్‌ వాహనమిత్రలో భాగంగా క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి సుమారు 2.48 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా రూ.248.47 కోట్లు జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*మూడో విడత వాహనమిత్ర కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)


..*


ముఖ్యమంత్రిగారు పాదయాత్రలో సుదీర్ఘంగా నడుస్తూ.. ప్రజల కష్టాలను వింటూ ఏలూరు చేరుకున్నప్పుడు ఆయన ఆటో డ్రైవర్లందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఫిట్నెస్‌ సర్టిఫికేట్‌ కోసం ప్రతి బండి రిపేరు చేయాలి కాబట్టి దానికోసం, ఇన్సూరెన్స్‌ ఇలాంటి అవసరాల కోసం ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పారు.ఈ డబ్బులు వడ్డీకి తేకుండా ఆర్ధిక బాధలను తట్టుకుని నిలబడ్డానికి అవకాశం ఉంటుందని ఆ రోజు మనసులో అనిపించి ఆ మాట చెప్పారు. ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి అయిన వెంటనే అక్టోబరు 4 వ తేదీన ఎక్కడైతే మాటిచ్చారో ఆదే ఊరులో ఈ పథకాన్ని ప్రారంభించారు.  మొదట విడతగా ఓనర్‌ కం డ్రైవర్లు అందరికీ  కూడా రూ.10 వేలు వాహనమిత్ర ద్వారా ఇచ్చారు. మరలా రెండో సంవత్సరం 2020లో ఆటోలు తిరగడం లేదు, ట్రాఫిక్‌ ఆంక్షలు ఉన్నాయి,  కోవిడ్‌ వలన ఇబ్బందుల్లో ఉన్నారు, జీవనం కష్టంగా ఉందన్న పరిస్థితులు. అప్పుడు నాలుగు నెలలు ముందుగా జూన్‌లో మరలా రూ.10 వేలు అందజేశారు. 


మరలా రెండో విడత కరోనా వచ్చింది. వారి ఇబ్బందులు దృష్ట్యా ముఖ్యమంత్రిగారే పెద్దమనసుతో ఆలోచన చేసి ఒక నెల ముందుగానే జూలైలో అనుకున్నది జూన్‌లోనే ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. డబ్బున్న వాళ్లకే ఇచ్చారని అనిపించుకోకుండా...  అత్యంత పారదర్శకంగా ఇవాళ 2,48,468 మందికి సాయం చేయడం జరుగుతోంది. వీరిలో 2,17,086 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన ఆటో ఓనర్‌ కం డ్రైవర్లు ఉన్నారు. మరో 26,397 మంది కాపు వర్గం నుంచి ఆటో నడిపే వృత్తిలో ఉన్నారు. ముఖ్యమంత్రిగారి ఆలోచనకనుగుణంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ వృత్తిలోకి రావడం, భర్త ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు ఆ కుటుంబ బాధ్యతను భుజానకెత్తుకుని ఆటో నడిపే వాళ్లు వందల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఇది శుభపరిణామం. బ్రేక్‌  ఇన్స్ఫెక్టర్లు అందరితో మాట్లాడితే మగ డ్రైవర్లకే ఎక్కువ చలానాలు వేయాల్సి వస్తుంది. మహిళా డ్రైవర్లు మాత్రం తప్పు చేయరని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఆటో నడుపుతున్నారని చెబుతున్నారు. గత ప్రభుత్వాన్ని నడిపిన తెలుగుదేశం వాళ్లు ఈ పథకం మీద, ఈ ప్రభుత్వం మీద సెటైర్లు వేస్తున్నారు. వాస్తవమేమిటంటే ఈ ప్రభుత్వ హాయంలో ఆటో డ్రైవర్ల మీద ఫైన్లు వేయడం తగ్గింది. రాజకీయంగా బురద జల్లడానికి ఈ ఆరోపణలు చేస్తున్నారు. రవాణాశాఖ అనేది కేవలం కాకీ బట్టలు వేసుకుని ఫైన్లు వసూలు చేయడం, ఎక్కడ చెయ్యి ఎత్తి ఆపుతారనే భయ పడే స్ధితి, అలాంటి ముద్ర ఉన్న ఈ శాఖను కూడా సంక్షేమకార్యక్రమాల్లో జగన్‌ గారి ప్రభుత్వం భాగం చేస్తుంది. బ్రేక్‌ ఇన్స్ఫెక్టర్లుతో కూడా ఆటో కార్మికుల వివరాలు తీసుకుని వారికి ఆర్ధిక సహాయాన్ని అందించే సంక్షేమ కార్యక్రమాన్ని చేయిస్తున్నారు. ఇందుకు రవాణాశాఖ తరపున ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 


*ఎంటీ కృష్ణబాబు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి.* 


ముఖ్యమంత్రిగారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో లక్షలాది మంది ప్రజలతో మమేకమవుతూ అనేక వర్గాల ప్రజల సమస్యలను ఆకలింపు చేసుకుని వారి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్న తర్వాత కొన్ని సంక్షేమపథకాలను ప్రకటించారు. అధికారంలోకి రాగానే వాటన్నింటి మీద ఆదేశాలు ఇచ్చారు. సర్,   నవరత్నాలులో భాగం కానప్పటికీ కూడా మా శాఖకు 2019లో తొలి సంక్షేమపథకానికి అవకాశం ఇచ్చారు. రెండు సంవత్సరాల పాలన పూర్తైంది. మూడోసారి వాహనమిత్ర అందిస్తున్నాం. ఒక్కో ఆటో, టాక్సీ, మ్యాక్సీ కేబ్‌ ఓనర్‌ కం డ్రైవర్లకు రూ.10 వేలు ప్రకటించారు. అది మూడో సంవత్సరం ఈరోజు మీ చేతుల మీదుగా ఇవ్వడం సంతోషం. 

దేశం మొత్తం చూస్తే ఇలాంటి పథకం, డ్రైవర్లు, వారి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చేయడం ఎక్కడా లేదు. 

కేవలం కర్నాటకలో తొలివిడత కరోనా టైంలో రూ.5వేలు అడ్‌హాక్‌గా ఇచ్చారు. సెకెండ్‌ వేవ్‌లో ఈ సంవత్సరం రూ.3వేలు ఒక స్కీంలా కాకుండా అడ్‌హాక్‌గా ఇచ్చారు. కానీ మన రాష్ట్రంలో కరోనా వల్ల ఉన్న ఆర్ధిక ఇబ్బందులను కూడా లెక్కచేయకుండా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఈ సంవత్సరం రూ.10వేలు ఇవాళ ఇస్తున్నారు. వలంటీర్లు ప్రతి లబ్ధిదారుడి దగ్గరకు వెళ్లి వాహనంతో పాటు ఫోటో తీసి, పారదర్శకంగా అర్హతను తనిఖీ చేసి ఆన్‌లైన్‌లో ఉన్న డేటాబేస్‌ క్రాస్‌ చెక్‌ చేసుకుంటూ అప్‌లోడ్‌ చేశారు.  ఇంకా ఎవరైనా మేం అర్హులం అని అనుకుంటే మరలా గ్రామసచివాలయంలో అఫ్లై చేసుకోవచ్చని మీరు ఆదేశించారు. దాని ప్రకారం వారి అర్హతను బట్టి వారికి కూడా ఈ బెనిఫిట్‌ అందే ఏర్పాటు చేస్తాం.

Comments