నేను రాజకీయంగానే ఓడిపోయాను

 నేను రాజకీయంగానే ఓడిపోయాను...నన్ను, నా కుటుంబాన్ని హీనంగా, నీచాతినీచంగా తిట్టి నువ్వు మానవత్వంలో ఓడిపోయావ్..గోవర్ధన్ రెడ్డీ..

నెల్లూరు (ప్రజా అమరావతి);


మా అమ్మానాయన ఏం పాపం చేశారు....చనిపోయినవాళ్లను కూడా వదలవా.


చాలా దారుణంగా మాట్లాడావు..మేం తిరిగి అలా మాట్లాడలేం..మా తల్లిదండ్రులు అలాంటి భాష మాకు నేర్పించలేదు..


Chilldeal.in వెబ్ సైట్ విషయంలో నేను చేసిన ఆరోపణలన్నీ నిజాలే..


పబ్లిక్ వెబ్ సైట్ లోని వివరాలను మీడియా ముందు పెడితే నా మీద అర్ధరాత్రి నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా..


నేను ఎక్కడికీ పారిపోలేదు..వచ్చి అరెస్ట్ చేసుకోండి...మళ్లీ ఎక్కడికైనా పోతే పారిపోయానంటావ్...


నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి



నన్ను, మా కుటుంబాన్ని, మా తల్లిదండ్రులను బూతులు తిట్టి తిరిగి మాపైనే కేసులు పెట్టిస్తారా...


అక్రమంగా వెబ్ సైట్ ప్రారంభించిన వారిపై కేసులు నమోదు చేయరా...సైబర్ క్రైమ్ కేసు ఎవరి మీద పెట్టాలి...


ఆనందయ్య మందు పంపిణీకి ఆన్ లైన్ లో ఏర్పాట్లు ప్రారంభించామని ఎమ్మెల్యేనే సెలవిచ్చాడు...


ఎమ్మెల్యేని కలిశానని సెశ్రిత కంపెనీ ఎండీ నర్మద్ రెడ్డినే ఒప్పుకున్నాడు..అక్కడి నుంచే అధికారుల వద్దకు వెళ్లానని కూడా అంగీకరించాడు...


గోవర్ధన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇవ్వాలనే వెబ్ సైట్ ను తయారుచేశానని కూడా చెప్పాడు...


బావ కళ్లల్లో ఆనందం చూడటానికి హత్యలు చేశానని అప్పట్లో మొద్దు శీను చెప్పిన తరహాలో ఉంది ఇదంతా..


జూన్ 2న చిల్ డీల్ వెబ్ సైట్ ఓపెన్ చేసి బహిరంగంగా అందరికీ అందుబాటులో ఆన్ లైన్ లో ఉంచారు..


ఉచితంగా ఇచ్చే ఆనందయ్య మందు ధరను షిప్పింగ్ ఖర్చులతో కలిపి రూ.167గా అందులో చూపారు...


ఇదంతా ఆనందయ్య  కుటుంబం అనుమతి లేకుండానే జరిగింది...


వెబ్ సైట్ లైవ్ లో ఉన్నప్పుడు తీసిన స్ర్కీన్ షాట్లను మీడియా ముందు పెట్టా...


దీనిపై చర్యలు తీసుకోమంటే గోవర్ధన్ రెడ్డీ.. నా గురించి, నా కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన మాటలు అత్యంత నీచాతినీచం, జుగుస్సాకరం..


నేను ఓడిపోయి..నువ్వు గెలిస్తే నోటికి ఎలా వస్తే అలా తిడతావా..నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతావా..


వెబ్ సైట్ కి సంబంధించి ఈ రోజు పోలీసు అధికారులకు పిటీషన్ ఇవ్వాలని రోజంతా ఎదురుచూశాం..ఒక్క అధికారి కూడా అందుబాటులోకి రాలేదు..


మధ్యాహ్నం 3.30 గంటలకు మెయిల్ ద్వారా మా పిటీషన్ జిల్లా ఎస్పీకి పంపాం..


ఆనందయ్య మందు పంపిణీని మే 17న ఆపించింది ఎవరు...22 రోజుల తర్వాత ప్రారంభించారు


మందు పంపిణీ ఎందుకు ఆపారు అని నేను ప్రశ్నించాను..


ఆపిన వెంటనే కేంద్ర సంస్థలు విచారణ జరిపి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదేశించారు..


టీడీపీ కళ్యాణదుర్గం ఇన్ చార్జి ఉమామహేశ్వర నాయుడు మా తరఫున కోర్టులో పిటీషన్ వేశారు..ఆనందయ్య కూడా కోర్టును ఆశ్రయించారు..


వెంకయ్య నాయుడు ప్రత్యేక చొరవ, మేమంతా పోరాడబట్టి అనుమతులు త్వరగా వచ్చాయి...


ఎంతో కష్టపడ్డామని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు...ఫొటోలు వేసుకుని పంపిణీ చేసుకుంటున్నారు..


ఆనందయ్య మందు పంపిణీకి మా కారణంగా ఎలాంటి ఇబ్బంది అయినా వచ్చిందా..మేం పూర్తి సహకారం అందించాం..


క్రిష్ణపట్నంలోని టీడీపీ కార్యకర్తలు కూడా స్వచ్చందంగా రాత్రింబవళ్లు పనిచేసి ఆనందయ్యకు సహకరిస్తున్నారు..


ఆనందయ్య కి స్వేచ్చ ఇవ్వాలని మాత్రమే మేము అడిగాము...ఇది కూడా తప్పా..మేమైనా మీరు ఎత్తుకెళ్లిన బకెట్ల బకెట్ల మందులో భాగం అడిగామా...


పబ్లిక్ వెబ్ సైట్ లో స్క్రీన్ షాట్స్ తీసి మీడియా ముందు పెట్టాను...దానికి నా మీద దొంగతనం, ఫోర్జీరీతో పాటు ఐటీ యాక్ట్ లతో కేసులు పెడతారా..


సెశ్రీత టెక్నాలజీ కార్యాలయం నెల్లూరు సుజాతమ్మ కాలనీలో ఉంటే గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో ఉండే కృష్ణాపట్నం పోలీసుస్టేషన్ లో కేసు పెడతారా..


అర్ధరాత్రి మినర్వా హోటల్ కి పోలీసులను పిలిపించి నాన్ బెయిలబుల్ కేసులు రిజిస్టర్ చేశారు..


నర్మద రెడ్డి వెనుక ఉండి నడిపిస్తున్నది..అతనితో కూడా నోటికొచ్చినట్టు మాట్లాడించింది గోవర్ధన్ రెడ్డే...


మీరు మందు పంపిణీని 22 రోజులు ఆపితే కంటి చుక్కలను బాధితులు రూ.25 వేలకి బ్లాక్ లో కొనుగోలు చేశారు..


ఇలాంటి పరిస్థితి తెచ్చింది ఎవరు..మేమా...


ఏడేళ్లుగా కాకాణి ని చూస్తున్నా..నా మీద, నా కుటుంబం మీద ఎన్నో ఆరోపణలు చేశాడు..ప్రమాణాలు అన్నాడు..ఛాలెంజ్ విసిరాడు..ఇవన్నీ ఆయనకు అలవాటు..


ఒక రోజు నా కుటుంబానికి వెయ్యి కోట్ల ఆస్తులన్నావ్...ఆ రోజు కూడా అరిచావ్..కేకలు పెట్టావ్..ఎగిరెగిరి పడ్డావ్...


నిరూపించమంటే రెండు నెలలు పరారై చివరకు సుప్రీంకోర్టుకు పోయావు..


మీ గవర్నమెంట్ వచ్చి రెండేళ్లయింది... నా మీద చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించు..ఆస్తులు ఎక్కడున్నాయో చూపించు..


మానవత్వం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడావ్...వచ్చి అల్లీపురంలో అడుగు మా కుటుంబం సంగతి చెబుతారు..


మొన్న నువ్వు వాడిన భాషకు స్వర్గంలో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య, బెజవాడ గోపాల్ రెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో పాటు ఇటీవలే దివంగతులైన మీ తండ్రి కూడా బాధపడుతుంటారు..


*మొన్న నువ్వు మాట్లాడిన ఆడియో తీసుకెళ్లి నాకు అమ్మతో సమానమైన మీ తల్లి, నాకు చెల్లితో సమానమైన మీ సతీమణికి, నాకు బిడ్డలతో సమానమైన మీ కుమార్తెలకు వినిపించు...వారు ఏం చెబుతారో విను..ఆ తర్వాత మీ జగన్మోహన్ రెడ్డికి కూడా వినిపించు..*


రెండు రాష్ట్రాల్లో 294మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీల్లో ఇలాంటి భాష మాట్లాడటంలో మొదటి స్థానంలో నిలిచావ్...


జీవితకాలం మా కుటుంబం మీద పడి ఏడవడమేనా...


రాజకీయ ఉద్ధండులకు ఒక కేరాఫ్ గా నిలిచిన శ్రీనివాస్ మహల్ గురించి కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతావా..


1958లో మా నాయన కట్టించిన ఇంటిపై కూడా రాద్ధాంతం చేయడం దురదృష్టకరం..ఎదుటి వ్యక్తి సొంత ఇంట్లో నివాసం ఉంటే కూడా ఏడుపా..


నీకు మనస్సు అనేది ఉంటే..నాకు కాదు..తెలుగు జాతికి క్షమాపణలు చెప్పు..

Comments