విశాఖలో టీడీపీ నేతల కబ్జాలపై చంద్రబాబు నోరు విప్పాలిః మంత్రి అవంతి శ్రీనివాస్.


విశాఖపట్టణం (ప్రజా అమరావతి);


*విశాఖలో టీడీపీ నేతల కబ్జాలపై చంద్రబాబు నోరు విప్పాలిః మంత్రి అవంతి శ్రీనివాస్*


*విశాఖపట్టణం సర్క్యూట్‌ హౌస్‌లో పర్యాటక శాఖ మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్‌), ఎమ్మెల్యేలు శ్రీ తిప్పల నాగిరెడ్డి, శ్రీ అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ప్రెస్‌మీట్‌ పాయింట్స్‌*


*- విశాఖను టీడీపీ హయాంలో కబ్జాల సిటీగా మార్చితే.. మే సేఫెస్ట్ నగరంగా తీర్చిదిద్దుతున్నాం*

*- టీడీపీ నేతల కబంధహస్తాల్లో వేల కోట్ల విశాఖ భూములు*

*- వందల కోట్ల భూకబ్జాలకు పాల్పడిన పల్లా శ్రీనివాస్ ను టీడీపీలో కొనసాగిస్తారా బాబూ..?*

*- విశాఖ భూఆక్రమణదారులు ఎంత పెద్దవారైనా క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలి*

*- చంద్రబాబు హయాంలో విశాఖ భూములు అమ్మి హైదరాబాద్ లో ఖర్చు పెట్టలేదా..?*

*- విశాఖ పరిపాలన రాజధానిగా ఉండటానికి టీడీపీ అనుకూలమా.. వ్యతిరేకమా..?*

*- చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా.. విశాఖ ప్రజల భిక్ష*


*మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే*


1. గత నెలరోజులుగా విశాఖలో ఏం జరుగుతుందో అందరూ గమనిస్తున్నారు. ప్రధానంగా నాలుగు విషయాల మీద మాట్లాడాల్సి ఉంది, విశాఖలో భూకబ్జాలు, భూ కుంభకోణాలపై ఐదేళ్ళ క్రితం టీడీపీ ప్రభుత్వం హయాంలో ఒక మంత్రి ఇంకో మంత్రిపై ఆరోపణలు చేస్తూ వాటన్నింటిపై సిట్‌ ఏర్పాటు చేయమని కోరింది వాస్తవమా.. కాదా..?


2. విశాఖలో జరిగిన భూ కబ్జాలు, కుంభకోణాలపై  వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిట్‌ ఏర్పాటు చేసి భూ ఆక్రమణలు చేసిన వారిపై, భూములు దోచుకున్నవారిపై విచారణ చేసిన రిపోర్ట్‌ త్వరలో గౌరవ ముఖ్యమంత్రిగారికి ఇచ్చి, త్వరలోనే భూఆక్రమణదారులందరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు విశాఖ నగరంలో, జీవీఎంసీ పరిధిలోని రూరల్‌ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు, జిరాయతీ భూములు, అసైన్డ్‌ భూములు, డీ పట్టా భూములు..  అన్నీ సర్వే చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. విశాఖలో ఏ సామాన్యుడు అయినా సరే.. అతను రిటైర్డ్ అయిన తర్వాత 500 గజాలు కొనుక్కుంటే విశాఖ సేఫెస్ట్‌ ప్లెస్‌ అనేలా ఉండాలి, ఇక్కడి  ప్రజలకు ఆ నమ్మకాన్ని, భరోసాను కలిగించి, అభివృద్ధి చేయడమే ఈ  ప్రభుత్వ లక్ష్యం. 


3. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఆ పార్టీనేతలు దోచుకున్న విలువైన భూములను... ఈ ప్రభుత్వం తవ్వి తీస్తూ, తిరిగి స్వాధీనం చేసుకుంటుంటే.. భూములు దోచుకుంటున్నారు, ఆక్రమించుకుంటున్నారు అని చంద్రబాబు,  లోకేష్‌ విమర్శలు చేస్తున్నారు.  లోకేష్, చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాం. నేను గానీ, విజయసాయిరెడ్డి గారు గానీ ఒక్క గజం భూమి ఆక్రమించినట్టు నిరూపించగలిగితే.. మేం దేనికైనా సిద్దం. 


4. అలాగే అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. కార్తీకవనం, బేపార్క్‌ దోచుకున్నాం అంటున్నారు, అది పూర్తిగా ప్రైవేట్‌ ట్రాన్సాక్షన్, వ్యక్తుల మధ్య జరిగిన వ్యాపారంలో ఎవరి ఇష్టాలు వారికి.  ప్రైవేటు స్థలాలను అమ్ముకుంటే అమ్ముకుంటారు లేదా ఇష్టం ఉంటే దాచుకుంటారు, దానిని కూడా ప్రభుత్వానికి అంటగట్టడం ఎంతవరకు సబబు...?


5. విజయసాయిరెడ్డి గారు ఒకటే చెప్పారు, ఎవరైనా సరే నా పేరు చెప్పి కానీ, సీఎం గారి పేరు చెప్పినా, మంత్రిగా నా పేరు చెప్పి భూములు ఆక్రమించినా, దౌర్జన్యం చేసినా నేరుగా మీరు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసి, వారిపై యాక్షన్‌ తీసుకోమని చెప్పారు.  మా పేర్లు ఎవరివి చెప్పినా.. ఎవరూ కూడా ఉపేక్షించవద్దు. అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోండి. 


6. టీడీపీ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. టీడీపీ వాళ్ళు ఇప్పుడు రోజూ విజయసాయి రెడ్డి గారు దోచుకుంటున్నారు అని అందుకే విశాఖని ఎగ్జిక్యూటివ్‌ రాజధాని చేస్తున్నారు అంటున్నారు, ఈ ప్రాంతం నుంచి గతంలో మంత్రులుగా చేసిన పెద్దలను, ఈ ప్రాంత నాయకులను ఒకటే అడుగుతున్నాం, మీరు విశాఖలో పరిపాలన రాజధానికి అనుకూలమా.. వ్యతిరేకమా.. !?

- విశాఖ ప్రజలు ఓట్లు వేయడం వల్లే మీరు ఇక్కడ నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు, చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందంటే మీకు విశాఖ ఓటర్ల భిక్ష. మీకు ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కావాలి, సీట్లు కావాలి కానీ విశాఖ పరిపాలనా రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు, రోజూ బురద చల్లుతున్నారు. భవిష్యత్తులో ఇక్కడి ప్రజలు టీడీపీకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పటం ఖాయం. 


7. పల్లా శంకర్రావు తండ్రి పేరు సింహాచలం పేరు మీద జగ్గరాజుపేట, తుంగ్లాంలో ఈ ప్రాంతంలో మొత్తం 61 ఎకరాల భూమిలో 49 ఎకరాలు వివిధ బినామీ పేర్లతో ఆక్రమణలో ఉంది. దాని బేసిక్‌ విలువ తీసుకుంటే రూ. 263 కోట్లు, మార్కెట్‌ విలువ తీసుకుంటే రూ. 791.41 కోట్లు. ఇందులో కొన్ని ఖాళీ స్ధలాలు, కొన్ని హెచ్‌పీసీఎల్‌కు, కొన్ని కంపెనీలకు గోడౌన్లు కట్టి లీజ్‌కు ఇచ్చారు, మరికొన్ని సేల్‌ కూడా చేశారు, స్టీల్‌ప్లాంట్‌లో 21 ఎకరాల చెరువును కూడా కబ్జా చేశారు, రెవెన్యూ రికార్డుల ప్రకారం ఏపీఐఐసీది, ఆ తర్వాత అది రైల్వే అధారిటీకి బదిలీ జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని భూములు, పోరంబోకు భూములు, స్టీల్‌ప్లాంట్‌ భూములు.. ఇలా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే టీడీపీ నేతల కబ్జా కోరల్లో ఉన్న భూములు వేల కోట్లల్లో ఉన్నాయి, మరి దీనిపై చంద్రబాబు, లోకేష్‌లు ఏం సమాధానం చెబుతారు..?


8. ప్రభుత్వ ఆఫీసులు తనఖాలని, విశాఖని అమ్మేస్తున్నారు .. అని టీడీపీ నాయకులు రోజూ విష ప్రచారం చేస్తున్నారు.  మరి వందల కోట్ల రూపాయల భూ కబ్జాలకు పాల్పడిన పల్లా శ్రీనివాసరావుని చంద్రబాబు  పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకున్నారు, ఇప్పుడు ఆయన్ను పార్టీ నుంచి డిస్మిస్‌ చేస్తారా లేక పార్టీలో కొనసాగిస్తారా.. అన్నది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. 


9. చంద్రబాబు, లోకేష్‌లు జూమ్‌ మీటింగ్‌లు పెట్టి మేడిపండు సామెతలా.. తామేదో నీతివంతులం అన్నట్లుగా నీతులు చెబుతుంటారు, మరి చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా పల్లా శ్రీనివాసరావుని తక్షణం విశాఖ పార్లమెంటరీ  పార్టీ అధ్యక్షుడి పదవి తప్పిస్తే, కనీసం గౌరవం అయినా దక్కుతుంది.


10. అలాగే సీఎంగారిని, పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారిని ఒకటే కోరుతున్నాను. విశాఖలో ప్రభుత్వ భూములను ఆక్రమించినవారు ఎంతటివారైనా, వారిపై క్రిమినల్‌ కేసు పెట్టి లోపల వేయాలి, వారు మాజీ ఎమ్మెల్యేలు అయినా, మాజీ మంత్రులైనా, ఎవరైనా సరే వదిలిపెట్లవద్దు, భూమి ఆక్రమించాలంటేనే భయపడే విధంగా ప్రభుత్వం చర్యలుండాలి.

-  విశాఖ సిటీలోనే 1.80 లక్షల మంది పేదలు ఇళ్ళ పట్టాల కోసం ధరఖాస్తు చేసుకున్నారు. దానిని కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారు, రాష్ట్రమంతా ఇళ్ళ పట్టాలిస్తే ఇక్కడ మాత్రం కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారు. 

- టీడీపీ నేతలు మాత్రం భూదోపిడీలు చేస్తూ.. పొద్దున లేచిన దగ్గర నుంచి విజయసాయిరెడ్డి గారిపై ఆరోపణలు చేసి, తప్పించుకోవాలని చూస్తున్నారు. మీ పప్పులు ఉడకవు. టీడీపీ నేతల భూకబ్జాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. దీంతో కబ్జాకోరులెవరో.. విశాఖను కాపాడుుతన్నది ఎవరో ప్రజలు గమనిస్తున్నారు. 

- విశాఖలోని మురికివాడల విషయంలోనూ విజయసాయిరెడ్డిగారు వాటిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ది చేస్తూ, విశాఖ నగరాన్ని అన్నివిధాలా అభివృద్ది చేయాలని కృషి చేస్తుంటే ఆయనపైన బురదచల్లుతున్నారు. 


11. మంత్రుల్ని డమ్మీలని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. మంచికి అండగా ఉంటే డమ్మీలవుతారా..? అంటే, మీ ఉద్దేశంలో చంద్రబాబు హయాంలో మాదిరిగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూకబ్జాలు చేసి, ప్రజల ఆస్తులను దోచుకుని, నీకింత, నాకింత అని పంచుకుంటే మంచివాళ్ళా..?  

- విశాఖ ప్రజలు మంచిని స్వాగతిస్తారు, ఎవరు చేసినా మంచిని కోరుకుంటారు, అటువంటి మంచి  మనసు విశాఖ ప్రజలది.   విశాఖకు మంచి జరుగుతుంటే.. కోర్టులకెళ్ళి అభివృద్దిని అడ్డుకోవద్దు అని టీడీపీ నేతలను కోరుతున్నాం. 

-  ఇప్పటికైనా పల్లా శ్రీనివాసరావులా ప్రభుత్వ భూములు ఎవరైనా ఆక్రమించి ఉంటే వాటిని స్వచ్చందంగా ప్రభుత్వానికి వెనక్కి ఇస్తే మీ గౌరవం నిలబడుతుంది, ఎంత పెద్దవారు అయినా సరే, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే వదిలి పెట్టేది లేదు. ఇది సామాన్యుల ప్రభుత్వం, పేదవాడి కళ్ళలో ఆనందం చూడడమే మా ప్రభుత్వ లక్ష్యం. పేదరికంపై, అవినీతిపై మేం పోరాటం చేస్తున్నాం కానీ టీడీపీ నాయకులపై కాదు.


12. విశాఖలో టీడీపీ నేతల కబ్జాలపై చంద్రబాబు గారు తక్షణమే స్పందించాలి, ఇన్ని ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన దానిపై చంద్రబాబు, లోకేష్‌ సమర్ధిస్తారా, లేదో చెప్పాలి. 

- ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న దోషులు ఎంత పెద్ద వారైనా సరే కఠినంగా శిక్షించాలి, ఆ భూములను స్వాధీనం చేసుకోవాలి. ఈ భూములను పేదలకు పంచాలి. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుంది, ఈ విషయాన్ని విశాఖ ప్రజలు గమనించాలి. 


- చంద్రబాబుకు అసలైన ప్రత్యర్ధి లోకేష్, ఆయన ఉన్నంతకాలం టీడీపీ పైకి రాదు, డాక్టర్‌ సుధాకర్‌ అనారోగ్యంతో మరణిస్తే దానిని కూడా రాజకీయం చేయాలని లోకేష్‌ విశాఖ వచ్చి, అక్కడే కూతవేటు దూరంలో ఉన్న అనారోగ్యంతో మరణించిన ఆ పార్టీ నాయకుడు సబ్బం హరి ఇంటికెళ్ళి పరామర్శించలేదు. అంటే టీడీపీకి ఎంతసేపటికీ రాజకీయం కావాలి. పొలిటికల్ మైలేజ్ వస్తుంది అంటే ఎంతకైనా దిగజారతారు. టీడీపీలో నాయకులను చంద్రబాబు, లోకేష్ ఎలా వాడుకుని వదిలేస్తారో ఇంతకంటే ఉదాహరణలు చెప్పాల్సిన పనిలేదు. వ్యవస్ధలను గుప్పిట్లో పెట్టుకుని రాజకీయం చేయడమే వారి ఉద్దేశం.


13. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా,  విశాఖ భూములను ఉడా ద్వారా అమ్మి,  ఆ డబ్బులు తీసుకెళ్ళి హైదరాబాద్‌లో ఖర్చుపెట్టలేదా, అప్పుడు కూడా అదే పార్టీలో ఉన్న టీడీపీ నేతలు, అప్పుడు నోరెత్తకుండా, ఇప్పుడెందుకు విమర్శలు చేస్తున్నారు. 

- విశాఖ భూములకు సంబంధించిన డబ్బు విశాఖ అభివృద్దికి కాకుండా అప్పటి రాజధాని హైదరాబాద్‌ కోసం చంద్రబాబు ఖర్చుపెడితే అది కరెక్టా..?

-  ఎన్‌ఏడీ ఫ్లైఒవర్‌ కు గతంలో శంకుస్ధాపన మాత్రమే చేస్తే.. మేం ఈ రెండేళ్ళలో దానిని పూర్తిచేయలేదా, త్వరలోనే దీనిని సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరుగుతుంది, అలాగే మరో నాలుగు ఫ్లై ఒవర్‌లకు డీపీఆర్‌లు కూడా సిద్దం చేస్తున్నాం, అవన్నీ కూడా సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభించాలనుకుంటున్నాం, భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్, ఎనిమిది లైన్ల రహదారి, మెట్రో రైల్‌ ఇలా ఇవన్నీ శంకుస్ధాపనలకు సిద్దమయ్యాయి. 


14. విశాఖపై చంద్రబాబు ఎందుకు ద్వేషం పెంచుకుంటున్నారు..? బీజేపీ నాయకులను కూడా అడుగుతున్నాం... విశాఖపై మీకు చిత్తశుద్ధి ఉంటే,  విశాఖ రైల్వేజోన్‌ పనులు ఎందుకు ప్రారంభించడం లేదు, విశాఖకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టుల గురించి కేంద్రాన్ని ప్రశ్నించండి తప్పితే, ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవద్దు. 


*గాజువాక ఎమ్మెల్యే శ్రీ తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఏమన్నారంటే..*

- చంద్రబాబే రాష్ట్రంలో పెద్ద భూకుంభకోణానికి పాల్పడ్డారు, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని టీడీపీ నాయకులు విశాఖలోనూ, మిగతా ప్రాంతాల్లోనూ అదే పనిగా భూములను కబ్జాలు చేశారు, దోచుకున్నారు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూకుంభకోణాలు, ఆక్రమణలపై వెంటనే చర్యలు తీసుకున్నాం. 

- గతంలో టీడీపీ నేతలు వందల ఎకరాలు దోచుకున్నారు. మేం నిబంధనల ప్రకారం ముందుకెళుతుంటే ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ భూములు దోచుకుని కోట్లు గడిస్తున్న పల్లా శ్రీనివాసరావు, ఆయన కుటుంబ సభ్యులు ఇలా చేయడం సిగ్గుమాలిన చర్య, - దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు, ఈ భూములు అన్నీ ప్రభుత్వానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి.


* పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మాట్లాడుతూ.. ఏమన్నారంటే..*

- విశాఖలో ప్రైవేట్ వ్యక్తుల కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను కాపాడుతుంటే.. టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు. 

- తవ్వేకొద్ది టీడీపీ నేతల భూభాగోతాలు బయటపడుతున్నాయి, టీడీపీ నేతలు తప్పులు చేసి, వాటిని కప్పిపుచ్చుకునేందుకు తిరిగి మాపై ఆరోపణలు చేస్తున్నారు.

- బండారు సత్యనారాయణ మూర్తి ఎప్పుడూ బయటికి రాడు, జూమ్‌ ద్వారా మాట్లాడుతూ ఇళ్ళపట్టాలపై సీబీఐ విచారణ జరపాలంటున్నాడు, టీడీపీ హయాంలో ఒక్క ఇంటి పట్టా ఇచ్చారా, సీబీఐ, ఈడీ రాకూడదని జీవో ఇచ్చింది చంద్రబాబు, కానీ మేం అలా భయపడం, మాకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, మీ కబ్జాలన్నీ బయటపెడతాం, అన్నీ కక్కిస్తాం.