సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి పన్నిన భారీ కుట్రను బయటపెట్టిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..

 సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి పన్నిన భారీ కుట్రను బయటపెట్టిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..


నెల్లూరు (ప్రజా అమరావతి);

నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియాకు కీలక విషయాలను ఆధారాలతో వెల్లడించిన సోమిరెడ్డి..*


ఆనందయ్య మందుతో వ్యాపారం చేసుకునేందుకు ఎమ్మెల్యే కాకాణి భారీ కుట్ర..


కరోనా ఫస్ట్ వేవ్ లో రైతుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటే..సెకండ్ వేవ్ లో ఆనందయ్య కుటుంబ సంప్రదాయ వైద్యాన్ని టార్గెట్ చేసిన కాకాణి..


ఆనందయ్య మందు అమ్మకం పేరుతో బయటకు వచ్చిన childeal.in వెబ్ సైట్ ను తయారుచేసింది నెల్లూరుకు చెందిన సెశ్రిత(SESRITHA) కంపెనీనే..


కృష్ణపట్నంలో కాకాణి మందు పంపిణీ చేపట్టిన మే 21వ తేదీనే గోడాడీ కంపెనీ వద్ద డొమైన్ కొనుగోలు చేసిన సెశ్రిత టెక్నాలజీ ఇండియా ప్రై లిమిటెడ్..


సెశ్రిత కంపెనీ నిర్వాహకులు కాకాణికి, అధికార పార్టీకి అత్యంత సన్నిహితమైన వారు..


హైకోర్టు మందు పంపిణీకి అనుమతించిన 31వ తేదీనే ఆన్ లైన్ లో మందు పంపిణీకి ఏర్పాట్లు ప్రారంభించామని ప్రకటించిన కాకాణి..


జూన్ 2వ తేదీ ఉదయం 11 గంటల తర్వాత ఆన్ లైన్ లో కనిపించిన chiledeal.in వెబ్ సైట్..


ఫ్యాన్ గుర్తు  సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, కాకాణి ఫొటోలు, వైసీపీ రంగులతో వెబ్ సైట్ హోమ్ పేజీ..


నకిలీ మద్యం, నకిలీ పత్రాలకు తరహాలోనే నకిలీ వెబ్ సైట్ రూపకల్పన..


ఆనందయ్య మందు ఎదురుచూస్తున్న కోట్లాది మంది ప్రజల వద్ద భారీగా వసూలు చేసేందుకు కుట్ర..


ఆయుర్వేదం మందు ఒక్కో ప్యాకెట్ రూ.167కి అమ్ముకునేందుకు పన్నాగం..


ఆనందయ్య కుటుంబం ప్రశ్నించడంతో కలవరం..


కథ అడ్డం తిరిగందని భావించి వెబ్ సైట్ ను హడావుడిగా పక్కనపెట్టారు..


అప్పటి వరకు మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని హడావుడి చేసిన కాకాణి ఒక్క సారిగా ప్లేటు ఫిరాయింపు..


ఆనందయ్య మందుకు తమకు, తమ పార్టీకి సంబంధం లేదని హడావుడిగా ప్రకటన..


లేదంటే వందల కోట్లు దోచుకునేందుకు భారీ స్కెచ్..


ప్రభుత్వం స్పందించి ఈ కుట్రపై సుమోటోగా కేసు నమోదు చేయాలి..


ఈ వెబ్ సైట్ వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారుల గుట్టు విప్పి చర్యలు తీసుకోవాలి..


లేదంటే మేమే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తాం..


*సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశిం సునీల్ కుమార్, నెల్లూరు సిటీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెడ్ శివప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య తదితరులు..

Comments