రౌతులపూడి (ప్రజా అమరావతి);
అపోహలు నమ్మవద్దు పిల్లల తల్లులు కోవిడ్ టీకా వేయించుకోవాలని
జిల్లా కలెక్టర్ డి మురళీధర్రెడ్డి వెల్లడి
అపోహలకు లోనుకాకుండా పిల్లల తల్లులు కోవిడ్ టీకా వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి కోరారు
గురువారం పెద్దాపురం డివిజన్ లోని రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వే లో పిల్లలకు కరోన వచ్చే అవకాశం ఉందని పత్రికల ద్వారా మీడియా ద్వారా సమాచారం రావడంతో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలో వైద్యపరంగా కరోనా ని ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు ముఖ్యంగా ఆరు నెలల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు ఈ రోజు నుండి కరోనా టీకా వేయడం మొదలైందని చెప్పారు తప్పనిసరిగా తల్లులు టీకా వేయించుకొని తద్వారా వారి పిల్లలు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లుల పై ఉందని అన్నారు . ఫస్ట్, సెకండ్ కరోనా కేసులలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే మన జిల్లాలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి వీటిని జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కోగలిగే మని కలెక్టర్ చెప్పారు. థర్డ్ వే లో కరోనా చంటి పిల్లలకు వచ్చే అవకాశం ఉందని సమాచారంతో తల్లులు,వారి పిల్లలను కాపాడుకోవడానికి ప్రతి తల్లులు టీకాలు వేయించుకోవాలని దీనిలో భాగంగా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యగా గైనకాలజిస్ట్, చంటి పిల్లల వైద్యుల వైద్యులు సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి, జిల్లాలో 25 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ను ఏరియా ఆసుపత్రిలో 30 పడకల, 50 పడకల కు సంబంధించి ప్రతి పడకు కు ఆక్సిజన్ లైన్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు ద్వారా, ఆగస్టు నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అదేవిధంగా వీటికి సంబంధించిన మందులు పరికరాలు కూడా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యసేవలు సంతృప్తి పరిచిందని చెప్పారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లు సమర్థవంతంగా వైద్య సేవలు అందిస్తే , జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల భారం తగ్గుతుందని అన్నారు . జిల్లాలో 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు . టీకా వేయించుకోవడం వల్ల కరోనా రాకుండా ఉండడమే ,కాకుండా ఒకవేళ వస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరు మార్గదర్శకాలను అనుసరించి కరోనాను అరికట్టడానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమాన్ని ముందు కలెక్టర్ ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి వార్డులో రోగులను కలిసి వైద్య సేవలపై ఆరా తీశారు .
ఈ కార్యక్రమంలో డి సి హెచ్ ఎస్ డాక్టర్ రమేష్ కిషోర్ ఆస్పత్రి వైద్య అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment