చరిత్రాత్మక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రీకారం

 


- చరిత్రాత్మక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రీకారం 


- రెండు దశల్లో 17 వేల జగనన్న కాలనీల నిర్మాణం 

- మౌలిక వసతులకు రూ. 32 వేల 909 కోట్ల నిధులు 

- జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోండి 

- అర్హతుంటే దరఖాస్తు చేసిన 90 రోజుల్లో ఇంటి పట్టా 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కైకలూరు, జూన్ 3 (ప్రజా అమరావతి): దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రాత్మక ఘట్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి సీఎం జగన్మోహనరెడ్డి వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గృహనిర్మాణ పనులను ప్రారంభించారు. దీనిలో భాగంగా కృష్ణాజిల్లా కైకలూరులోని వైఎస్సార్ జగనన్న గ్రీన్ విలేజ్ హౌసింగ్ కాలనీలో జరిగిన గృహనిర్మాణ ప్రారంభ మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కైకలూరులో 92 ఎకరాల్లో 3 వేల ఇళ్ళ నిర్మాణాలకు గాను తొలి విడతలో 862 ఇళ్ళ నిర్మాణ పనులను ప్రారంభించినట్టు చెప్పారు. 2023 నాటికి నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు హామీని ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చనుందని చెప్పారు. తొలి దశలో 8,905, రెండవ దశలో 8,100 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 28.30 లక్షల ఇళ్ళ నిర్మాణం జరుగుతుందన్నారు. ఇందు కోసం రూ. 50 వేల 944 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుందని చెప్పారు. మౌలిక వసతుల కోసం రూ. 32 వేల 909 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. మొదటి దశ ఇళ్ళ నిర్మాణం ద్వారా ఉపాధి కూలీలకు రూ.21.70 కోట్ల పని దినాలు లభించనున్నాయని తెలిపారు. ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం, మౌలిక వసతుల ఖర్చుతో కలిపి ఒక్కొక్కరికీ ప్రాంతాన్ని బట్టి రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల మేర లబ్ధి చేకూరుతోందని తెలిపారు. లబ్ధిదారుల జాబితాల్లో పేర్లు లేని వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసిన 90 రోజుల్లో అన్ని అర్హతలను పరిశీలించి ఇంటి పట్టాను మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి కొడాలి నాని చెప్పారు. రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 31 లక్షల మంది పేద కుటుంబాలకు ఇళ్ళపటాలను ఇవ్వడంతో పాటు మొదటి దశలో 15.60 లక్షల ఇళ్ళ నిర్మాణ పనులను సీఎం జగన్మోహనరెడ్డి ప్రారంభించారన్నారు. ఒక్కో ఇంటికి రూ. 1.80 లక్షల మొత్తాన్ని ప్రభుత్వం నుండి ఆర్ధిక లబ్ధిగా అందజేస్తున్నారన్నారు. పేదవాడి కష్టం తీర్చాలన్న ఆశయంతో సీఎం జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. సీఎం జగన్మోహనరెడ్డి పది కాలాల పాటు చల్లగా ఉండాలని, సీఎంగా కొనసాగాలని అన్ని వర్గాల ప్రజలు, మహిళలు కోరుకుంటున్నారని పేర్ని నాని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ కైకలూరులో 12 వేల మంది పేదలకు ఇళ్ళపట్టాలను పంపిణీ చేయడం జరిగిందని, రెండు విడతల్లో ఇళ్ళ నిర్మాణ పనులు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, జోగి రమేష్, కొక్కిలిగడ్డ రక్షణనిధి, వసంత కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జిల్లా జాయింట్ కలెక్టర్లు డాక్టర్ కే మాధవీలత, ఎల్ శివశంకర్, గుడివాడ ఆర్డీవో జీ శ్రీనుకుమార్ తదితరులు పాల్గొన్నారు.