కర్నూలు జిల్లా పోలీసు శాఖకు కేటాయించిన అంబులెన్సు వాహనం(BASIC LIFE SUPPORT AMBULANCE) ను జెండా ఊపి ప్రారంభించిన ..... , జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ , జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
జిల్లా మినరల్ ఫండ్ నుండి అంబులెన్సు ను ఏర్పాటు చేసిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
బేసిక్ లైఫ్ సపోర్ట్ సదుపాయాలను కలిగిన అంబులెన్సు వాహనాన్ని జిల్లా పోలీసులందరూ సద్వినియోగం చేసుకోవాలి.. జిల్లా కలెక్టర్..జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే..
కర్నూలు, జూన్ 07 (ప్రజా అమరావతి);
పోలీసు శాఖకు కేటాయించిన బేసిక్ లైఫ్ సపోర్ట్ సదుపాయాలను కలిగిన అంబులెన్సు వాహనాన్ని జిల్లా పోలీసులందరూ సద్వినియోగం చేసుకోవాల ని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్,జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి,బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోరారు.
మంగళ వారం ఉదయం కర్నూలు కలెక్టరేట్ ఆవరణంలో జిల్లా పోలీసు శాఖకు కేటాయించిన అంబులెన్సు వాహనాన్ని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామి రెడ్డి , జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి జెండా ఊపి ప్రారంభించారు.
జిల్లా మినరల్ ఫండ్ నుండి బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఈ అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు.
ముందుగా అంబులెన్స్ వాహనం ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మీడియా తో మాట్లాడారు.
బనగాన పల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ... కరోనా సమయంలో పోలీసులకు అంబులెన్స్ కావాలనుకున్నప్పుడు ఇబ్బందులు పడుతున్నారని , ఒక అంబులెన్స్ అవసరం వుందని జిల్లా ఎస్పీ గారు తెల్పడంతో జిల్లా మినరల్ ఫండ్ క్రింద 25 లక్షల రూపాయలతో బేసిక్ లైఫ్ సపోర్ట్ పోలీసు అంబులెన్సు వాహనంను ఏర్పాటు చేశామన్నారు .
గతంలో కూడా స్పందన కార్యక్రమం కొరకు 5 మండలాలలో స్పందన భవనాలు ఇవ్వడం జరిగిందన్నారు. బనగాన పల్లె, అవుకు లో కూడా స్పందన భవనాలను కూడా ఏర్పాటు చేయించామన్నారు.
మినరల్ ఫండ్ కింద నిధులను మంజూరు చేసిన కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామ ని ఎమ్మెల్యే తెలిపారు..
జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ గారు మాట్లాడుతూ.... కరోనా సమయంలో ఫ్రంటలైన్ వారియర్స్ గా పని చేస్తున్న పోలీసులు ఎక్కువగా కరోనా బారిన పడ్డారన్నారు. కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయార న్నారు.. పోలీసుల సంక్షేమం కోసం బనగానపల్లె ఎమ్మేల్యే సహాకారంతో మినరల్ ఫండ్ తో ఈ అంబులెన్స్ ను కోనుగోలు చేశామన్నారు. ఈ రోజు నుండి జిల్లా పోలీసులకు , పోలీసు కుటుంబాలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ వాహనాన్ని పోలీసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు మాట్లాడుతూ... కరోనా సమయంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేస్తూ 1000 మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడ్డారన్నారు.
ఫస్ట్ వేవ్ లో 780 మంది పోలీసులు, సెకండ్ వేవ్ లో 228 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు.
15 మంది పోలీసులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ లో పోలీసు వేల్పేర్ యూనిట్ హాస్పిటల్ ఒకటి ఉందన్నారు.
అత్యవసర పరిస్ధితులలో పోలీసులు, పోలీసుకుటుంబాల కొరకు మెరుగైన వైద్య సేవలందించేందకు(హైదరాబాద్ వంటి) వేరే ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు అంబులెన్సులు దొరకక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఒక్కోసారి ప్రవేట్ అంబులెన్సులను రూ. 30 వేలు లేదా 40 వేలు వెచ్చించి వేరే ప్రాంతాలకు పంపించామన్నారు.
శాసన సభ సభ్యులు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి సహకారంతో పోలీసుల సంక్షేమానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేశామ ని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు..
అత్యవసర మెడిసిన్ మరియు ఆక్సిజన్ సిలిండర్లు, అన్ని వైద్య పరికరాలతో బేసిక్ లైఫ్ సపోర్ట్ కేటగిరి క్రింద ఈ అంబులెన్స్ ఉందన్నారు.
పోలీసులకు, హోంగార్డులకు , పోలీసు కుటుంబాలకు అత్యవసర పరిస్ధితులలో ( రోడ్డు ప్రమాదాలు, కరోనా బారినప్పుడు) ఏ ప్రాంతానికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఉచితంగా పోలీసు అంబులెన్స్ ఈ రోజు నుండే అందుబాటులో ఉంటుందన్నారు.
ఇందులో ఒక టెక్నిషియన్ , ఒక డ్రైవర్ ఉంటారన్నారు.
జిల్లా ఎస్పీ గారి అనుమతి తో హెడ్ క్వార్టర్ లోని ఆర్ ఐ MTO నుండి ఈ పోలీసు అంబులెన్సు వాహనంతో ఉచిత సేవలు పొందవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా & సంక్షేమం) శ్రీనివాసులు, ఎఆర్ అదనపు ఎస్పీ రాధాక్రిష్ణ , డిఎస్పీ లు మహేశ్వరరెడ్డి, కె వి మహేష్, పోలీసు వెల్ఫేర్ డాక్టర్ స్రవంతి గారు, డి ఆర్వో పుల్లయ్య, ఆర్ ఐ సురేంద్రారెడ్డి ఉన్నారు.
addComments
Post a Comment