నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌తో సీఎం భేటీ:

 

న్యూఢిల్లీ (ప్రజా అమరావతి);


నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌తో సీఎం భేటీ:



– నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌తో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ

– నీతి ఆయోగ్‌ కార్యాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి.

– పలు అభివృద్ధి అంశాలపై చర్చ.

– పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను వివరించిన సీఎం. 

– రాష్ట్రవ్యాప్తంగా 30.76లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని, దీనికోసం 68,381 ఎకరాలను సేకరించామన్న సీఎం. 

– ఇళ్ల పట్టాల పంపిణీ వల్ల 17,005 కొత్త కాలనీలు ఏర్పడ్డాయన్న ముఖ్యమంత్రి. 

– ఈ ఏడాది కొత్తగా 15 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నామని, మొత్తంగా 28.30 లక్షల ఇళ్లు పేదలకోసం నిర్మిస్తున్నామని తెలిపిన సీఎం. 

– ఇళ్ల నిర్మాణ కార్యక్రమం సజావుగా సాగడానికి ప్రతి జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌ను నియమించామన్న సీఎం. 

– 17,005 కొత్త కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రూ. 34,109  కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్న సీఎం. ఇంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మోయడం కష్టసాధ్యమన్న ముఖ్యమంత్రి. 

– ఇళ్లు కట్టి.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుంటే.. లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడతారని, ఇళ్లపట్టాలుకోసం, నిర్మాణంకోసం పెట్టిన ఖర్చు ప్రయోజనాలను ఇవ్వదని తెలిపిన సీఎం.

– సంబంధిత మంత్రిత్వశాఖలతో మాట్లాడి ఈ కాలనీల్లో మౌలికసదుపాయాలకయ్యే ఖర్చును పీఎంఏవైలో భాగంగాచేయాలని కోరిన సీఎం. 

– పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైనా రాజీవ్‌కుమార్‌తో మాట్లాడిన సీఎం.

– పోలవరం పీపీఏతోపాటు, కేంద్ర జలమండలి సిఫార్సులతోపాటు, కేంద్ర జలశాఖకు చెందిన సాంకేతిక సలహామండలి ( టెక్నికల్‌అడ్వైజరీ కమిటీ– టీఏసీ) అంగీకరించిన విధంగా 2017–18 ధరల సూచీ ప్రకారం

రూ. 55,656.87 కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని కోరిన ముఖ్యమంత్రి. 

– 2022 జూన్‌నాటికి ప్రాజెక్టు పనులతోపాటు, భూసేకరణ–పునరావాస పనులను పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, వెంటనే ఈ అంచనాలకు ఆమోదం తెలపాలన్న సీఎం.

Comments