మళ్ళీమళ్లీ మీరే సీఎంగా రావాలి'. దాసరి దుర్గారాణి, మహిళా పాడిరైతు.


అమరావతి (ప్రజా అమరావతి);


*ఏపీ అమూల్‌ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా సీఎం శ్రీ వైయస్‌ జగన్ తో మాట్లాడిన మహిళలు*


మళ్ళీమళ్లీ మీరే సీఎంగా రావాలి'.

దాసరి దుర్గారాణి, మహిళా పాడిరైతు.


*ఎన్‌.గొల్లగూడెం గ్రామం, ఉంగుటూరు మండలం, పశ్చిమగోదావరి జిల్లా:*

నేను జగనన్న పాలవెల్లువలో భాగంగా మా గ్రామంలోని అమూల్ డైరీలో ఒక ప్రమోటర్‌ గా పనిచేస్తున్నాను. పాదయాత్ర హామీల్లో పాలకు మద్దతు ధర కోసం పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని ఆనాడు మీరు మాట ఇచ్చారు. ఈ రోజు ఆ మాటను గొప్పగా నిలబెట్టుకుంటున్నారు. గతంలో ప్రైవేటు డెయిరీల్లో పాలు పోస్తుంటే ఎన్ని లీటర్లు పాలు, ఎంత ఫ్యాట్ వస్తోందో అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు అమూల్‌కు పోస్తున్న పాలకు ఎంత ఫ్యాట్, ఎన్ని లీటర్లు పాలు పోస్తున్నామనేది చాలా క్లియర్‌గా లెక్క చెబుతున్నారు. నాకు రెండు గెదెలు ఉన్నాయి. ప్రతిరోజూ పాలు పోస్తున్నాను. మంచి ఫ్యాట్ శాతం వస్తోంది. అలాగే లీటర్‌ పాలకు రూ. 50 నుంచి రూ.55 వరకు రేటు వస్తోంది. ప్రైవేటు డైయిరీల కంటే రూ.4 నుంచి 7 రూపాయల వరకు అదనంగా లబ్ధి పొందుతున్నాను. పాలకు సంబంధించిన డబ్బు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయడం పట్ల మహిళలు సంతోషంగా ఉన్నారు. అమూల్ పాలడైయిరీల్లో మమ్మల్ని సభ్యులను చేసి మన రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేశారు. కరోనా కష్ట సమయంలో కూడా మమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడాలంటే మళ్ళీమళ్లీ మీరే సీఎంగా రావాలి.


*అమూల్‌కు పాలు పోయడం వల్ల అదనంగా ఆదాయం*

*నెక్కంటి నవత, మహిళా పాడిరైతు*

*యెర్రమిల్లిపాడు, ఉంగుటూరు మండలం, పశ్చిమగోదావరిజిల్లా:*

పాడి రైతులను ఆదుకుంటానని ఆనాడు మీరు పాదయాత్రలో చేసిన వాగ్ధానంను నేడు నిలబెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. అమూల్‌ కు పాలు పోయడం వల్ల మాకు చాలా లబ్ధి చేకూరుతోంది. పాలలో ఫ్యాట్‌ను ఖచ్చితంగా లెక్కకడుతున్నారు. నేను రోజుకు ఏడు లీటర్లు అమూల్‌కు పాలు పోస్తున్నాను. గత అయిదు రోజుల్లోనే నేను పోసిన పాలకు గతం కంటే రూ.160 అదనంగా వచ్చింది. లీటర్‌కు దాదాపు రూ.7 నుంచి రూ.8 రూపాయలు ఎక్కువగా రేటు వస్తోంది. గతంలో ప్రైవేటు డెయిరీలకు పోవడం వల్ల ఈ ఆదాయాన్ని కోల్పోయాను. మహిళలు వంటింటికే పరిమితం కాదు... అవకాశం ఇస్తే ఆర్థికంగా వృద్ధి చెందుతారని మీ వల్ల నిరూపితం అవుతోంది.


*'గతంలో ఎన్నడూ లేని విధంగా పాలకు మంచి రేటు వస్తోంది'*

*గంగ మహిళా పాడిరైతు*

*నీలాద్రిపురం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరిజిల్లా*

గతంలో ఏ ప్రైవేటు డెయిరీకి పోసినా రాని ధర నేడు అమూల్‌కు పాలు పోయడం వల్ల వస్తోంది. ఇప్పుడు 

జగనన్న పాలవెల్లువలో భాగంగా అమూల్‌కు గ్రామంలో అందరం పాలు పోస్తున్నాము. అయితే మొదటి మూడు రోజులు మాత్రం రేటు ఎలా ఇస్తారో అనే భయంతో చాలా మంది పాలు పోసేందుకు ముందుకు రాలేదు. అమూల్‌కు పాలు పోసిన వారికి లీటర్‌కు రూ.68 నుంచి రూ.72.90 వరకు చెల్లించడం చూసి ఇప్పుడు అందరూ అమూల్‌కే పాలు పోసేందుకు ముందుకు వస్తున్నారు. ఫ్యాట్ శాతంను కూడా ఖచ్చితంగా లెక్కగట్టి, రేటు ఇస్తున్నారు. మహిళలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నందు మీకు ధన్యవాదాలు. *''జగనన్న చెప్పాడంటే... చేస్తాడు.."*

*డి.పరంగీత మహిళా పాడిరైతు*

*సింగరాజుపాలెం గ్రామం, నల్లజెర్ల మండలం, పశ్చిమ గోదావరిజిల్లా:*

ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో పోటీపడుతున్న అమూల్ సంస్థను మా గ్రామానికి తీసుకువచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నాకు రెండు గేదెలు ఉన్నాయి. పొద్దున్న, సాయంత్రం రెండు లీటర్లు చొప్పున గతంలో ప్రైవేటు డెయిరీకి పాలు పోసేవాళ్ళం. ఎన్నడూ మేం పోసే పాలకు సంబంధించి తూకం, ఫ్యాట్ శాతం, ఎంత వస్తుంది అనేది సరిగా చెప్పేవారు కాదు. పదిహేను రోజుల పాటు మాకు రావాల్సిన డబ్బు కోసం ఎదురుచూసే వాళ్ళం. ఎంత వస్తుందో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు అమూల్‌కు పోయడం వల్ల మాకు ఎప్పటికప్పుడు ఒక కంప్యూటర్ స్లిప్‌ ఇస్తున్నారు. దానిలో ఫ్యాట్ ఎంత, ఎన్ని లీటర్లు, ఎంత రేటు వస్తుందో చక్కగా  చెబుతున్నారు. ఇన్ని రోజుల్లో ఇది మీ ఖాతాలో జమ అవుతుందని చెబుతున్నారు. మా గ్రామంలో  పాడిరైతులు అమూల్‌కు పాలు పోయడానికి ముందుకు వస్తున్నారు. ఇదే ఉత్సాహంతో పాల ఉత్పత్తిని కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఒక నాయకుడు సరైన పరిపాలన చేయాలంటే, ప్రజల మనోభావాలను తెలుసుకుంటేనే సరైన పాలకుడు అవుతాడని గ్రహించి మీరు రాష్ట్రంలో పాలన చేస్తున్నారు. మహిళలకు ఒక అన్నగా అండగా ఉన్నానని నిరూపించుకుంటున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అవినీతి రహిత పాలనను ప్రజల వద్దకు తీసుకువచ్చారు. గ్రామవాలంటీర్లు, సచివాలయ వ్యవస్థతో అత్యుత్తమ పాలనకు నాంధి పలికారు. మేం చదువుకునే సమయంలో కులధ్రువీకరణ కోసం వారం రోజులు తిరగాల్సి వచ్చేది. కానీ మూడు రోజుల్లోఏ ఆ సర్టిఫికేట్ వస్తోంది. జగనన్న చెప్పాడంటే... చేస్తాడు అనే నమ్మకం మాకు మరింత పెరిగింది.

మా గ్రామానికి రహదారి సౌకర్యం సరిగా లేదు, గర్భిణీ స్త్రీలు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే చాలా ఇబ్బంది ఎదురవుతోంది, అలాగే చెరువు వద్ద వంతెన కూడా మంజూరు చేయాలంటూ వీడియో కాన్ఫెరెన్స్‌లో సీఎం శ్రీ వైయస్ జగన్ కు పరం గీత విజ్ఞప్తి చేసింది. వెంటనే దీనిపై అక్కడే వున్న గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు స్పందిస్తూ ఈ రోడ్డుకు ఇప్పటికే ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసిందని, అధికారులు పనులు చేపడుతన్నారని తెలిపారు. *గతంలో పాలకేంద్రం మహిళల వల్ల కాదన్నారు... మీ వల్ల దానిని నేడు నిర్వహిస్తున్నాం*

*సుజాత, మహిళా పాడిరైతు*

*కొమ్ముగూడెం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమగోదావరిజిల్లా:*

గతంలో పాలకేంద్రం నిర్వహణ మహిళల వల్ల కాదు అన్నారు. మీ వల్ల నేడు మా గ్రామంలో మేమే దానిని నిర్వహించగలుగుతున్నాం. మీరు ఉన్నారనే ధైర్యం ఇప్పుడు మాకు వచ్చింది. అమూల్ పాల వెల్లువను ఇంకా ముందుకు తీసుకుపోతాం. అమూల్‌కు పోయడం వల్ల మా సభ్యుల్లో ఒకరికి లీటర్‌కు 75 రూపాయలు వచ్చాయి. ఇది మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గతంలో ఇంత మంచి రేటు ఎక్కడా రాలేదు. 


*'మహిళా పాడిరైతుల్లో ఆనందం కనిపిస్తోంది'*

*పటేల్, సబర్ డెయిరీ ఎండి*

వీడియో కాన్ఫరెన్స్‌లో మహిళలు మాట్లాడిన భాష నాకు తెలియకపోయినా... వారి ముఖాల్లో కనిపించిన ఆనందంను గుర్తించాను. ఈ రోజు పశ్చిమ గోదావరిజిల్లాలో పాల సేకరణను ప్రారంభించాం. దేశంలోనే అమూల్‌కు ప్రజల్లో మంచి గుర్తింపు రావడానికి కారణం అమూల్‌ కొనసాగిస్తున్న నాణ్యతా ప్రమాణాలు. అలాగే పాడిరైతులకు మరింత మేలు చేయాలన్నదే అమూల్ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రప్రభుత్వ సహకారంతో పాడిరైతులతో కలిసి అమూల్ నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు అందిస్తుంది. అమూల్ తో కలిసి పనిచేసే రైతులకు ఎక్కువ లబ్ధి చేకూర్చడం ఎంతో సంతోషం కలిగిస్తోంది.