పోలవరం జాతీయప్రాజెక్ట్ పూర్తిచేయడానికి టీడీపీ ప్రభుత్వం అహోరాత్రులు శ్రమించింది...




*గంజి చిరంజీవి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి :*

మంగళగిరి (ప్రజా అమరావతి)

పోలవరం జాతీయప్రాజెక్ట్ పూర్తిచేయడానికి టీడీపీ ప్రభుత్వం అహోరాత్రులు శ్రమించింది...


గత ప్రభుత్వం చేసిన పనులను తాము చేసినట్లుగా చెప్పుకుంటూ ప్రారంభోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు 


 రూ.11,600 కోట్లకుపైగా ఖర్చుపెట్టి, 72శాతం పనులుపూర్తిచేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే...


రైతులు,ప్రజలసమస్యలుపట్టించుకోకుండా మంత్రులంతా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.   

 


పట్టిసీమను దండగన్నవారికి, ఇప్పుడు అదే దిక్కయ్యింది. 

  

ఢిల్లీపర్యటనతో ముఖ్యమంత్రి  పోలవరంప్రాజెక్ట్ నిర్మాణానికి  ఏం సాధించారో ప్రజలకు తెలపాలి 

 


జగన్మోహన్ రెడ్డికి దమ్ము, ధైర్యముంటే తన ఢిల్లీపర్యటన వివరాలను మీడియాసాక్షిగా ప్రజలకు వెల్లడించాలి.




పోలవరం డ్యామ్ లో రూ.800కోట్లవరకు ఖర్చుపెట్టినవారు 18,500నిర్వాసితకుటుంబాలను ఎందుకు గాలికొదిలేశారో తెలపాలి.


టీడీపీప్రభుత్వంలో చేసిన నిర్మాణ పనులతాలూకా కేంద్రంనుంచి వచ్చిన రూ.4వేలకోట్లను ఏంచేశారు?


నిర్వాసితకుటుంబాలకు ఇస్తానన్న రూ.10లక్షల పరిహారం ఏమైందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలని డిమాండ్ చేశారు.


ఇప్పటికయినా జగన్ డాంబికాలు మాని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి 


*పోతినేని శ్రీనివాసరరావు, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి :*

ఈముఖ్యమంత్రి పోలవరం జాతీయప్రాజెక్ట్ ని, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా మార్చారు, 


స్పిల్ వే, కాపర్ డ్యామ్ నిర్మాణం సహా, మెజారిటీ పనులన్నీ గతంలో టీడీపీప్రభుత్వమే చేయడం జరిగినది,


2019 జూలైలో  ఆ విధంగా పారుతున్ననీటిని, అక్కడ జరిగిననిర్మాణపనులను  అన్నిప్రసారమాధ్యమాలు చూపించాయి 


 ప్రాజెక్ట్ పరిధిలోని 18,500నిర్వాసిత కుటుంబాల ను ఖాళీ చేయించాక కాపర్ డ్యామ్ పనులను పూర్తిస్థాయి లో పూర్తిచేయాలని ఆనాటిప్రభుత్వం నిర్ణయించింది 


 ఈ వైసీపీ ప్రభుత్వం గడచిన రెండేళ్లలో ఎన్ని నిర్వాసితకుటుంబాలకు న్యాయంచేసిందో చెప్పాలి


 రెండేళ్ల  ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రాజెక్ట్ పరిధిలో హెడ్ వర్క్స్ పనులు ఎంతజరిగాయో చెప్పాలి,



 టీడీపీప్రభుత్వంలో పోలవరం పునాదులే లేవలేదని చెప్పినవారు, ఈరోజు గేట్లుఎలా పెడుతున్నారో చెప్పాలి,


రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి, ప్రాజెక్ట్ పనులన్నీ ఒకే కంపెనీకి కట్టబెట్టారు


టీడీపీ హయాంలో 2019 జులై నెలలోనే గోదావరి నీటిని మళ్ళించడం జరిగింది, నేడు జగన్ రెడ్డి మొదటిసారి తాము మళ్ళిస్తున్నామని చెప్పుకోవడం హేయం


*కళ్ళం రాజశేఖర్ రెడ్డి - గుంటూరు పార్లమెంట్ తెలుగు రైతుసంఘం అధ్యక్షులు*



ఏం పనులు ఒరగబెట్టారని నీటి పారుదల మంత్రి పోలవరాన్ని సందర్శించారో అర్ధంకావడం లేదు,


పోలవరం పనులు లక్ష్యాల దిశగా ఎందుకు పరుగులు పెట్టడం లేదో ప్రజలకు తెలపాలి 


ఈ నెలాఖరుకల్లా నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రణాళిక ప్రకారం పనులు ఎందుకు చేయరు ?


గత టీడీపీ ప్రభుత్వ హయాంలో,2019లో గోదావరి వరదజలాలు అప్రోచ్ ఛానల్ ద్వారా స్పిల్ వే రివర్స్ స్లూయిస్ వెంట్స్ నుండి స్పిల్ ఛానల్, పైలెట్ ఛానల్ గుండాదిగువకు వెళ్ళాయి.


రెండేళ్లయ్యింది. మీహామీలు గాలికొదిలేశారు.18వేలమంది నిర్వాసితులకు పునరావాసం ఏర్పాటుచేయలేదు.

Comments