- గృహనిర్మాణాల్లో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన గుడివాడ
- అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం
- పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం
- మంత్రి కొడాలి నాని సహకారంతో మరిన్ని నిధులు తెస్తాం
- విలేఖర్లతో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్
గుడివాడ, జూన్ 8 (ప్రజా అమరావతి): జిల్లాలో జరుగుతున్న గృహనిర్మాణాల్లో గుడివాడ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ చెప్పారు. మంగళవారం గుడివాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి డ్రైన్ల నిర్మాణానికి రూ. 23.39 కోట్లు, జలజీవన్ మిషన్ నిధులు రూ.110.57 కోట్లు, రూ. కోటి నియోజకవర్గ నిధులు, పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి రూ. 46.36 కోట్లు, నాడు - నేడులో భాగంగా పాఠశాలల ఆధునికీకరణకు రూ. 14.85 కోట్లు, ఆర్ అండ్ బి నిధులు రూ. 47.02 కోట్లు, మెడికల్ సబ్ సెంటర్ల నిర్మాణానికి రూ. 4 కోట్లు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణానికి రూ. 8.27 కోట్లు, గ్రామ సచివాలయాల నిర్మాణానికి రూ. 15.2 కోట్లు, పీఎంజేఎస్వై రోడ్ల నిర్మాణానికి రూ.15.42 కోట్లు , ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి రూ.32.50 కోట్లు, గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి రూ. 10.30 కోట్లు, ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి రూ.2.50 కోట్లు, జెరియాట్రిక్ వార్డు నిర్మాణానికి రూ. 70 లక్షలు, గుడివాడ స్మశానవాటికలో విద్యుత్ క్రిమిటోరియం నిర్మాణానికి రూ.1.15 కోట్లు, అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణానికి రూ.3.30 కోట్లు, అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణం, మరమ్మతుల నిమిత్తం రూ.5.80 కోట్లు, గుడివాడ పట్టణంలోని గుడ్ మెన్ పేటలో మంచినీటి రిజర్వాయర్ పునర్నిర్మాణానికి రూ. 5.85 కోట్లు, నివార్ తుఫాను బాధిత 8,162 మంది రైతులకు రూ. 5.56 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే సంక్షేమానికి సంబంధించి గుడివాడ నియోజకవర్గంలో 38 వేల 010 మంది లబ్ధిదారులకు రూ. 128.76 కోట్ల వైఎస్సార్ ఆసరా, 12 వేల 521 మంది లబ్ధిదారులకు రూ. 8.22 కోట్ల రైతుభరోసా, 72 వేల 600 మంది లబ్ధిదారులకు రూ.7.30 కోట్ల కరోనా అలవెన్స్, 1,599 మంది లబ్ధిదారులకు రూ.1.59 కోట్ల వాహనమిత్ర ఆర్ధికసాయం, 1,543 మంది లబ్ధిదారులకు రూ. 2.31 కోట్ల కాపునేస్తం, 669 మంది లబ్ధిదారులకు రూ.48 లక్షల, టైలర్స్ నేస్తం, 181 మంది లబ్ధిదారులకు రూ.24 లక్షల నాయీబ్రాహ్మణ నేస్తం, 141 మంది లబ్ధిదారులకు రూ. 18 లక్షల రజక నేస్తం, 75 మంది లబ్ధిదారులకు రూ.20 లక్షల నేతన్న నేస్తం, 4 వేల 543 గ్రూపులకు రూ.5.72 కోట్ల సున్నా వడ్డీ రుణాలు, 3 వేల 480 మందికి రూ.3.48 కోట్ల జగనన్న తోడు ఆర్థికసాయం అందజేశామని చెప్పారు. గుడివాడ నియోజకవర్గంలో మొత్తం 27 వేల 633 మంది లబ్ధిదారులకు ప్రతి నెలా 1 వ తేదీన వైఎస్సార్ పెన్షన్లను అందజేస్తున్నట్టు తెలిపారు. వీటితో పాటు 5 వేల 739 మందికి వైఎస్సార్ చేయూత కింద రూ. 11.20 కోట్లు, 26 వేల 300 మంది తల్లులకు అమ్మ ఒడి కింద రూ.39.45 కోట్లు, 17 వేల 468 మంది విద్యార్థులకు విద్యా కానుక కింద యూనిఫారం, పుస్తకాలు, వసతి దీవెన కింద 5 వేల 151 మంది విద్యార్థులకు రూ.4.83 కోట్లు, 516 మందికి సీఎం సహాయనిధి కింద రూ.8.63 కోట్లు, 4 వేల 264 మంది రైతులకు వైఎస్సార్ ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ నిమిత్తం రూ.3.04 కోట్లు జమ చేశామన్నారు. గుడివాడ రూరల్, నందివాడ, పెదపారుపూడి మండలాల్లోని 68 గ్రామాలు, శివారు ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేసే మల్టీవిలేజ్ స్కీం నిర్మాణానికి 110 ఎకరాల భూసేకరణ జరుగుతోందని, రూ.300 కోట్ల డీపీఆర్ ను నాబార్డ్ కు పంపామన్నారు. గుడివాడ పట్టణంలోని ఏకేటీపీ, పార్క్ స్కూల్స్ ను రూ.కోటి సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. గుడివాడ పట్టణంలోని రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి రూ. 200 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గుడివాడ పట్టణంలో 8,912 మంది పేదలకు టిడ్కో గృహాలను నిర్మిస్తున్నామని, మరో 7 వేల మందికి ఉచితంగా ఇళ్ళ నిర్మాణం జరుగుతాయన్నారు. వీటితో పాటు ప్రజలకు ఉపయోగపడే అనేక దీర్ఘకాలిక కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టామన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు. నియోజకవర్గంలో పార్టీపరంగా ఎటువంటి వివక్షత చూపడం లేదన్నారు. క్యాంప్ కార్యాలయం దృష్టికి ఎటువంటి సమస్యను తీసుకువచ్చినా పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. గత రెండేళ్ళుగా పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడంలో ప్రజలు ఎంతగానో సహకరించారన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సహకారాన్ని అందజేయాలని కోరారు. కరోనా విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కారణంగా కొన్ని అభివృద్ధి పనుల మంజూరులో ఆలస్యం జరిగిందని, పరిస్థితులు చక్కబడిన తర్వాత మరిన్ని నిధులను మంత్రి కొడాలి నాని రాబడతారని చెప్పారు. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిధులు లేకుండానే పలు కార్యక్రమాలకు శంఖుస్థాపనలు జరిపి ప్రజలను మభ్య పెట్టారన్నారు. అటువంటి కార్యక్రమాలకు కూడా ప్రభుత్వ నిధులను మంజూరు చేయించి పూర్తి చేయిస్తామన్నారు. టీడ్కో గృహాలపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. గుడివాడ పట్టణంలో 7 వేల మంది పేదల కోసం సేకరించిన 181 ఎకరాల భూముల్లో లెవలింగ్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. త్వరలో గృహనిర్మాణాలు ప్రారంభమై అక్కడ పెద్ద టౌన్‌షిప్ మాదిరిగా ఏర్పడుతుందన్నారు. నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు లేఅవుట్లో కూడా పెద్దఎత్తున గృహాల నిర్మాణం జరుగుతోందన్నారు. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఇళ్ళపట్టాల పంపిణీకి లేఅవుట్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వాలు లోలెవల్ ఏరియాల్లో స్థలాలిచ్చి చేతులు దులుపుకున్నారని చెప్పారు. ఈ కారణంగా 20 ఏళ్ళ కిందట ఇచ్చిన స్థలాల్లో నేటికీ ఇళ్ళ నిర్మాణం జరగని పరిస్థితులు ఉన్నాయన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో స్థలాలివ్వడంతో పాటు మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పిస్తున్నారని చెప్పారు.
addComments
Post a Comment